Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

“అన్నా ! వాడ్ని ఏసెయ్యాలని డిసైడ్ అయ్యా..”

November 24, 2024 by M S R

.

“అన్నా ! వాడ్ని ఏసెయ్యాలని డిసైడ్ అయ్యా..”
సడెన్గా కాలేజీ ఫ్రెండ్ గాడి నోటెంబడ ఈ మాట విని అవాక్కయ్యా !

రక్తాన్ని సోడాలో కలుపుకుని కళ్ళతో తాగినోడికిమల్లే వీడికళ్ళు చూస్తే ఎర్రగా ఉన్నాయ్
నాటులో బ్లడ్డు కలుపుకుని నీటుగా తాగినట్టు వీడితో వచ్చినవాడి నోరు చూస్తే ఎర్రగా ఉంది
అసలే శివ విడుదలై నాగార్జున సైకిల్ చైను తెంపేసిన రోజులు
పైగా బెజవాడ
ఆ ఎఫెక్ట్ బాగా ఉండేది

Ads

సరే మెల్లిగా తేరుకుని ,
“ఎవడ్ని వేసేయ్యలని డిసైడ్ అయ్యావ్ ? ఎందుకు వేసేయ్యలనుకుంటున్నావ్ ? ” వాడి వంక అనుమానంగా చూస్తూ అడిగా
“ఆ ఫార్టీ టూ గాడ్ని ” కసిగా చెప్పాడు వాడు
“ఫార్టీ టూ అంటే రవి గాడా ?”
“అవును వాడినే ”

“ఎందుకూ ?”
” నేను కవితల్రాణిని లవ్ చేస్తున్నా ”
“ఎవరూ ? కవితల్రాణి అంటే ఫార్టీ త్రీ సత్యనారాయణ పురం అమ్మాయి కుమారియేనా ? ”
“అవును ”
“అది సరే నువ్ కవితల్రాణిని లవ్ చేయటానికి రవి గాడ్ని వేసేయ్యటానికి సంబంధం ఏంటి ? ”
“వాడు కూడా కవితల్రాణిని లవ్ చేస్తున్నాడు ”
“ఓహో ! రెండు స్తంబాలాట లవ్ స్టొరీ అన్నమాట..సరే..ఆ అమ్మాయ్ నిన్ను లవ్ చేస్తుందా ? ”
“తెలీదు ?”

“తెలీదా ? చిక్కొచ్చిపడిందే ? అంటే నీది మూగప్రేమ అన్నమాట..అసలు ఆ అమ్మాయికి మ్యాటర్ చెప్పలేదా ? ”
“చెప్పలేదు ”
“మరేం చేస్తున్నావ్ ?”
“రోజూ ఇంటిదాకా ఫాలో అవుతున్నా ”
“ఎందుకు ఫాలో అవటం..అడిగేస్తే సరిపోయేదేమో కదా ? ”
“అడిగేసేవాడినే..తర్వాత తెలిసింది..రవి గాడు కూడా ఫాలో అవుతున్నాడని ”

“ఫాలో అయితే అవనీ..నువ్ కుమారికి ప్రపోజ్ చేస్తే మ్యాటర్ తేలిపోతుంది కదా ”
“చేసేవాడినే.. తర్వాత తెలిసింది..ఆ అమ్మాయి బాబు ఫైవ్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ అట ”
“మరి వదిలేయ్..ఆ లాకప్ డెత్తులవీ నీకెందుకు ?”
“నేనొదిలేస్తే రవిగాడు తగులుకుంటాడు ”
“మరేం చేద్దామని ? ”
“రవి గాడికి స్పాట్ పెడదామని వీడ్ని తీసుకొచ్చా ”

“ఏంటీ అంకుశం రామిరెడ్డిలా ఏకంగా స్పాటా..? ఇంతకీ వీడెవడు ? ”
“నవరంగ్ థియేటర్ దగ్గరుంటాడు ”
“ఓనరా ? ”
“కాదు క్లీనర్ ..మోటార్ ఫీల్డ్ ”
“మోటార్ ఫీల్డ్ వాడేం చేస్తాడు రవిగాడ్ని ?”
“ఏ పార్టుకి ఆ పార్ట్ తీసేస్తాడు ”
‘ ఓహో వాడు పార్టులన్నీ విప్పదీస్తాడని తెల్సుకునే తీసుకొచ్చావా ? సరే కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నావ్ ? ”

“అన్నా ! నీకు ఎమ్మెల్యే గారు తెలుసుకదా..పోలీస్ కేసు లేకుండా మ్యానేజ్ చేయాలన్నా ”
“వార్నీ అదా సంగతి..చూడూ ! నాకు ఎమ్మెల్యే తెలిసినా…ఒకవేళ జడ్జి నా బామ్మర్ది అయినా కూడా ఆ రవిగాడికి ఏమన్నా అయిందనుకో వీడికి ఉరిశిక్ష నీకు యావజ్జీవం కన్ఫర్మ్ అవుతుంది..నువ్ మొలతాడు గట్టిగా కడితేనే తట్టుకోలేవ్..ఇంక ఉరితాడు మెడకు ఏం చుట్టుకుంటావ్ నీ తలకాయ్ ”
“అంతేనంటావా అన్నా..అయితే ఇప్పుడేం చెయ్యమంటావ్ ?”

“వీడికి డబ్బులేమన్నా ఇచ్చావా ?”
“ఇందాక కోటర్ తాగుతానంటే ఓ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చా.. ”
“సన్నాసి చీప్ లిక్కర్ ఏసినట్టున్నాడు..కంపు దొబ్బుతుంది..అయినా కోటర్ కే రవిగాడ్ని ఏసేయ్యటానికి ఒప్పుకున్నాడా ?”
“లేదన్నా ! డీల్ ఇంకా మాట్లాడలేదు ”
“మంచిపని చేశావ్ ..సరే మళ్లీ కబురెడతా అని ముందు వాడ్ని పంపేయ్..”
“మరి రవిగాడి సంగతీ ? ”

“ఆ కానిస్టేబుల్ చూసుకుంటాడు..రవి గాడు దొరికితే కేసు బుక్ చేస్తాడు..దొరక్కపోతే లాకప్ డెత్ చేస్తాడు ”
సడెన్గా వాడు ఏడవటం మొదలెట్టాడు
“రేయ్ బాబూ.. ఎందుకేడుస్తున్నవ్రా ? ” వీడికేమర్దమైందో అని డౌటొచ్చి అడిగా
“ఇది ఏడుపు కాదన్నా..ఆనంద బాష్పాలు.. బ్రిలియంట్ ఐడియా ఇచ్చావన్నా..రవి గాడు ఖచ్చితంగా కవితల్రాణి బాబుకి దొరుకుతాడు..వాళ్ళ బాబు వీడ్ని బొక్కలో వేసి ఇరక్కొడతాడు..వస్తా అన్నా..ఇక వీడెందుకు డబ్బులు బొక్క..”అని సంతోషంగా వెళ్ళిపోయాడు నా ఫ్రెండు గాడు
( తర్వాత కానిస్టేబుల్ భయానికి ఇద్దరూ సైడయ్యారని తెలిసింది )

ఏదైతేనేమి…ఓ పెద్ద స్పాట్ ని ఆ రకంగా విజయవంతంగా తిప్పికొట్టి బోలెడంత రుధిరం వీధుల్లో పారకుండా ఆ రోజుల్లోనే ఆపా !
అందుకే అప్పట్లో నా మిత్రులు నాకు ‘ గాంధీ ‘ అని నిక్ నేమ్ కూడా పెట్టారు !
ఇదేదో కధో.. కల్పితమో అనుకుంటున్నారు కదూ..
పేర్లు మార్చా కానీ విజయవాడలో నిజంగా జరిగిన సంఘటనే ! పరేష్ తుర్లపాటి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇంకొన్నాళ్లు పోతే… రూట్ – కోహ్లీ ట్రోఫీగా పేరు మారుస్తారా..?
  • ‘‘బనకచర్ల ఏపీకి మరో కాళేశ్వరం అవుతుంది బహుపరాక్…’’
  • ఫాఫం జగన్… ఈ రఫారఫా నరుకుడు భాషేమిటో, ఈ సమర్థనేమిటో…
  • కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల సాహిత్య పురస్కారాలు వీళ్లకు…
  • వర్తమాన సినిమా ప్రపంచంలో నిజంగానే ఇది ‘అరుదైన సరుకు’…
  • అక్కినేని అలా… కాంతారావు ఇలా… కాంట్రాస్టు జీవితాలు… డెస్టినీ…!!
  • అసలే చిరంజీవి… ఆపై రాఘవేంద్రరావు… ఆవేశంతో శారద… ఇంకేం..?!
  • అన్నదాతకు సంకెళ్లు… ఖచ్చితంగా ప్రభుత్వానికి మరక, మచ్చ..!!
  • దేనికీ టైమ్ లేదా…? పరుగు తీస్తున్నావా..? టైమ్ మింగేస్తుంది జాగ్రత్త..!!
  • గోదావరి- బనకచర్ల ఇష్యూ రాజకీయంగా రేవంత్‌రెడ్డికి కలిసి వస్తోంది..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions