Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహ్… ఆ సైఫ్‌అలీ ఖాన్ 15 వేల కోట్ల ఆస్తుల అసలు చరిత్ర ఇదా..?!

January 23, 2025 by M S R

.

పొట్లూరి పార్థసారథి…. సైఫ్ అలీ ఖాన్ కి మరో పెద్ద దెబ్బ పడ్డది! వారం క్రితం హత్యాయత్నం నుండి బయట పడి కోలుకుంటున్న సమయంలో ఈసారి తన పూర్వీకుల ఆస్తులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది!

అసలేం జరిగింది? సైఫ్ అలీ ఖాన్ కి తన పూర్వీకుల నుండి సంక్రమించిన 15,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2014 లో మధ్యప్రదేశ్ ప్రభుత్వ కస్టోడియన్ అఫ్ ఎనిమీ ప్రాపర్టీ డిపార్ట్మెంట్ సైఫ్ అలీ ఖాన్ కి నోటీసులు ఇచ్చింది.

Ads

నోటీసుల సారాంశం ఏమిటంటే….. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968, 2016 ల కింద సైఫ్ అలీ ఖాన్ అనుభవిస్తున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలి అని…

నోటీసులకి స్పందించిన సైఫ్ అలీ ఖాన్ 2015 లో భోపాల్ హైకోర్టులో సవాల్ చేశాడు. భోపాల్ హైకోర్టు స్టే ఇచ్చింది విచారణ అయ్యే వరకూ ఎలాంటి చర్య తీసుకోకుండా…

2024 డిసెంబర్ 13 లో మధ్యప్రదేశ్ హైకోర్ట్ స్టే ఎత్తి వేస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు చట్టబద్దంగానే ఉన్నాయని, ఒకవేళ సైఫ్ అలీ కావాలని అనుకుంటే అప్పిలేట్ ట్రైబ్యునల్ లో 30 రోజులలోపు అప్పీల్ చేసుకోవచ్చని సమయం ఇచ్చింది!

ఈ రోజుతో 30 రోజుల గడువు ముగిసిపోయింది! కానీ సైఫ్ అలీ ఖాన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ లో అప్పీల్ చేయలేదు! టెక్నికల్ గా 15,000 కోట్ల ఆస్తి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలుంది ఈ రోజుతో!

హై కోర్టు 30 రోజులు గడువు ఇచ్చినా సైఫ్ అలీ ఖాన్ ఎందుకు అప్పిలేట్ ట్రిబ్యునల్ లో అప్పీల్ చేసుకోలేదు?
ఎందుకంటే Enemy Property Act 1968, 2016 లు చాలా స్పష్టంగా ఉన్నాయి.

Enemy Property Act 1968!

శత్రుదేశంగా గుర్తించబడ్డ దేశం, ఆ దేశం యొక్క పౌరుల ఆస్తులని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ 1968. దేశ విభజన తరువాత పాకిస్థాన్ తో యుద్ధం చేయడం వలన పాకిస్థాన్, చైనాతో జరిగిన యుద్ధం వలన చైనా దేశాలని శత్రు దేశాలుగా పరిగణిస్తూ ఆయా దేశాల ఆస్తులు భారత్ లో ఉన్నా మరియు ఆయా దేశాల ప్రజల ఆస్తులు మన దేశంలో ఉన్నా వాటిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు.

మొహమ్మద్ అలీ జిన్నా ఆస్తులని మన ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం వేసింది. అలాగే మాజీ పాకిస్థాన్ అధ్యక్షుడు ముషారఫ్ ఆస్తులని స్వాధీనం చేసుకొని వేలం వేశారు. ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆస్తులని కూడా వేలం వేశారు.

ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ 1968 లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి… వాటిని గుర్తించిన ప్రభుత్వం 2016 లో ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ 1968 ని సవరించి కొత్త చట్టం చేశారు. 2017 లో పార్లమెంట్‌లో The Enemy Property ( Amendment and Validation ) Bill ఆమోదం పొంది చట్ట రూపం దాల్చింది.

కొత్త చట్టం ప్రకారం శత్రువు ఎవరు, శత్రువుకి చెందిన వ్యక్తిగత ఆస్తులు, వ్యాపారాలు, వాటిని ఎలా గుర్తించి స్వాధీనం చేసుకోవాలి వంటి అంశాలకి స్పష్టంగా వివరణ పొందుపరిచింది. The Public Premises (Eviction of Unauthorised Occupants ) Act of 1971 ని కూడా సవరించి కొత్త చట్టంలో వివరంగా చెప్పారు.

కొత్త చట్టం ప్రకారం దేశం వదిలి పాకిస్థాన్ లేదా చైనా పారిపోయిన లేదా వలస వెళ్లిన వారి ఆస్తుల వారసులు ఎవరు మరియు వాళ్లకి ఆస్తిలో హక్కు ఉంటుందా లేదా అన్నది స్పష్టంగా చెప్తున్నది! ఒకవేళ భారత్ లో ఉన్న భాగస్వాములకి పారిపోయిన వ్యక్తి కి చెందిన వ్యాపారంలో ఎలాంటి హక్కులు ఉంటాయో కొత్త చట్టంలో వివరించారు!

కొత్త చట్టం ప్రకారం… దేశంలోని ఏ సివిల్ కోర్టుకి కూడా ఎనిమీ యాక్ట్ కిందకి వచ్చే వివాదాల కేసులని విచారణకి స్వీకరించి విచారించే అధికారం ఉండదు. ఇది జాప్యం లేకుండా పరిష్కారం కావడానికి దోహద పడుతుంది.

పాత చట్టాన్ని సవరించడానికి కారణం దావుద్ ఇబ్రహీం కేసులో లోపాలు బయటపడడమే! So! సైఫ్ అలీ ఖాన్ కేసులో ఉన్న మతలబు ఏమిటీ?

సైఫ్ అలీ ఖాన్ పటౌడి కి ఆస్తులు వాళ్ళ నాన్న మన్సూర్ అలీ ఖాన్ పటౌడి ద్వారా సక్రమించినవే!

భోపాల్ నవాబు హామీదుల్లా ఖాన్ 1960 లో చనిపోయాడు. వారసురాలిగా అతని పెద్ద కూతురు అబిదా సుల్తానాగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది! కానీ అబిదా సుల్తానా తన తండ్రి మరణానికి ముందే అంటే 1950 లో పాకిస్తాన్ వెళ్ళిపోయింది తన భారత పౌరసత్వాన్ని వదులుకొని… అబిదా సుల్తానా చెల్లెలు అయిన సబియా సుల్తానాని వారసురాలిగా గుర్తించారు.

ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ ని 1968 లో అమలులోకి వచ్చింది కాబట్టి తమ ఆస్తులు భద్రంగానే ఉంటాయని భావించారు. కానీ అసలు వారసురాలు అబియా సుల్తానా పాకిస్థాన్ వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఆస్తుల మీద మిగతా వారసులకి హక్కులు ఉండవు సవరించిన చట్ట ప్రకారం… భారత ప్రభుత్వంకి చెందుతాయి!

saif

1968 లో Enemy Property Act అమలులోకి వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేసింది. అయితే ఎవరు శత్రు దేశానికి వెళ్లారు, వాళ్ళ ఆస్తులకి తాలూకు వారసులు ఉంటే ఏం చేయాలి అన్న దాని మీద 1968 యాక్ట్ లో వివరాలు లేవు. దాని వల్ల వివాదాలు సివిల్ కోర్టులలో దశబ్దాల తరబడి నానుతూ వచ్చాయి.

2016 సవరించిన బిల్లులో ప్రతీ ఒక్క అంశాన్ని స్పృశిస్తూ స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే సివిల్ కోర్టుల జోక్యానికి అవకాశం లేకుండా చేశారు. 15,000 కోట్ల ఆస్తులకి వారసురాలు పాకిస్తాన్ వెళ్ళిపోయింది (1950) కాబట్టి అది శత్రు దేశానికి చెందిన ఆస్తిగానే పరిగణిస్తారు!

1947 దేశ విభజన తరువాత భారత్ నుండి ఎవరైతే పాకిస్తాన్ వెళ్లిపోయారో వాళ్ళ ఆస్తులు ఆటోమాటిక్ గా కేంద్రప్రభుత్వ అధీనంలోకి వెళ్ళిపోతాయి. ఈ కేసులో భోపాల్ నవాబు హామీదుల్లా ఖాన్ వారసుడిగా బ్రతికే ఉన్నాడు 1960 వరకూ కాబట్టి అలానే కొనసాగాయి ఆస్తులు… కానీ హామీదుల్లా ఖాన్ చనిపోయాక అతని వారసురాలు పాకిస్థాన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక వారసత్వం అంటూ ఏమీ ఉండదు.

సబియా సుల్తానాకి సైఫ్ అలీ ఖాన్ మనవడు (మన్సుర్ అలీ ఖాన్ కి తల్లి ) అవుతాడు. ఆస్తి దక్కాల్సింది అబిదా సుల్తానాకి… కానీ ఆవిడ పాకిస్థాన్ వెళ్లిపోవడం వలన సబియా సుల్తానాకి, తరువాత మన్సూర్ అలీ ఖాన్ పటౌడి తరువాత సైఫ్ అలీ ఖాన్ కి వచ్చింది…

2015 నుండి 2024 డిసెంబర్ వరకూ మధ్యప్రదేశ్ హైకోర్టులో వారసత్వం మీద విచారణ జరిగింది!

చివరిగా 2024 డిసెంబర్ 13 న మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి సైఫ్ అలీ ఖాన్, తల్లి షర్మిలా ఠాగూర్ ల పిటిషన్  కొట్టివేస్తూ పిటిషనర్లు అప్పిలేట్ ట్రిబ్యునల్ లో అప్పీల్ చేసుకోవడానికి 30 రోజుల గడువు విధించింది! ఒకవేళ అప్పిలేట్ ట్రిబ్యునల్ లో 30 రోజుల లోపు అప్పీల్ చేయకపోతే చట్ట ప్రకారం ఏవైతే నోటీసులు ఇచ్చారో అవి అమలులోకి వస్తాయని పేర్కొంది!

saif

So! తీర్పు స్పష్టంగా ఉంది! 2025 జనవరి 13 కి నెల రోజుల గడువు ముగిసింది కానీ సైఫ్, షర్మిల ఠాగూర్ లు అప్పీల్ చేయలేదు!

బహుశా గత 9 ఏళ్లుగా హైకోర్టులో జరిగిన వాదనల వల్ల వాళ్ళతో పాటు, వాదించిన ఆ అడ్వకేట్లకి కూడా అర్ధమై ఉంటుంది కేసుని అప్పీల్ చేసినా ఉపయోగం ఉండదు అని…

1947 నుండి ఇప్పటి వరకూ తగిన చర్య తీసుకోని ఆస్తులు ఎన్ని ఉన్నాయి? RTI ద్వారా బయటికి వచ్చిన వివరాల ప్రకారం 12,983 వేల స్థిర ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పరిధిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో 5,688 స్థిర ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సినవి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో 4,354 వేల స్థిర ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సినవి ఉన్నాయి.

మధ్యప్రదేశ్ లో ఇప్పటికి సర్వే జరుగుతూనే ఉన్నది… సైఫ్, షర్మిల ఠాగూర్లకి సంబంధించి ఆస్తులు ఇంకా సర్వే చేస్తూనే ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ మీద హత్యా ప్రయత్నం అనేది తన ఆస్తులు పోవడం మీద నుండి దృష్టి మరల్చడం కోసమే అని అనిపిస్తున్నది.

హత్యాయత్నం చేయడానికి వచ్చినవాడు వెస్ట్ బెంగాల్ నుండి వచ్చి ముంబై లో ఉంటున్నాడు కానీ అతను బంగ్లాదేశ్ నుండి వెస్ట్ బెంగాల్ లోకి అక్రమంగా ప్రవేశించి, ఆపై ముంబై వచ్చాడు.

ఈ కేసుకి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ దయా నాయక్ కి అప్పచెప్పడం మీద మొదట ఆశ్చర్యం కలిగినా ఇప్పుడు అర్ధం అవుతున్నది… కేసుని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడానికి అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీలు సిద్ధంగా ఉన్నారని తెలుసుకొని దయా నాయక్‌ని నియమించారు అని…

ఇంతకీ వీళ్ళు నవాబులా? 
Md. ఫైజ్ తలాబ్‌ఖాన్ అనే అతను ఆఫ్ఘనిస్తాన్‌లోని కందహార్‌లో బరేచ్ ట్రైబ్‌కి చెందిన వాడు. చెరువులు తవ్వడం, పూడిక తీయడం వృత్తి. అప్పటి బ్రిటీష్ ఇండియాకి వలస వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికే వాడు. బ్రిటీష్ వాళ్ళు మరాఠా రాజుతో ( Anglo Maratha war ) యుద్ధం చేస్తున్న సమయంలో బ్రిటీష్ తరుపున యుద్ధంలో పాల్గొన్నాడు!

తరువాత బ్రిటీష్ వాళ్ళు ఈ ఫైజ్ తలాబ్‌ఖాన్‌కి హర్యానాలోని గుర్గావ్ దగ్గర ఉన్న పటౌడి అనే గ్రామాన్ని ఇచ్చారు. అప్పట్లో చిన్న చిన్న గ్రామాలు కలిపి ఒక చిన్న రాజ్యంగా ఉండేవి. తలాబ్ అంటే చెరువు అని అర్ధం కాబట్టి చిన్నతనంగా ఉంటుంది అని పటౌడిని తగిలించుకొని తలాబ్‌ని వదిలేశారు. అప్పట్లో నెహర్ ( కాలువ ) పక్కన ఉండే వాళ్ళని నెహర్ లు అని పిలిచేవారు అది క్రమంగా నెహ్రూ అయ్యింది!

అసలు జమీందార్ అని పిలవచ్చు కానీ చెప్పుకోవడానికి క్లాస్‌గా ఉంటుందని నవాబ్ తగిలించుకున్నారు! పటౌడి, నవాబ్‌లు తగిలించుకున్నవే! అసలు పేరు తలాబ్ సైఫ్ అలీ ఖాన్ పిలవాలి!

Md. ఫైజ్ తలాబ్ ఖాన్ సంతానం అందరూ దేశ విభజన తరువాత పాకిస్థాన్ వెళ్ళిపోతే సైఫ్ ముత్తాత ఒక్కడే భారత్‌లో ఉండిపోయాడు! వీళ్ళ మాతృ భాష పష్తో లేదా పష్తూన్! ఇవన్నీ తెలిసి కూడా జాతీయ మీడియా ఇంకా నవాబ్ పటౌడి అని పిలుస్తాయి ఇప్పటికి!

దేశ విభజన జరిగిన తరువాత పాకిస్థాన్‌లోని హిందువుల ఆస్తులు ఆక్రమణకి గురయ్యాయి కానీ మన దేశంలో మాత్రం నవాబుల పేరుతో చెలామణి అవుతూ హాయిగా ఆస్తులని అనుభవిస్తున్నారు!…..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions