.
హోం శాఖ స్పెషల్ సెక్రటరీ ఐపీఎస్ అధికారి రవి గుప్తాతో నిర్మాత దిల్ రాజు భేటీ… త్వరలో విడుదల కానున్న కొత్త సినిమాల విడుదల… టికెట్ల రేట్లు పెంపు… బెనిఫిట్ షోల అనుమతి.., భద్రతా చర్యలు తదితర అంశాలపై చర్చ
భేటీకి హాజరైన ఐ అండ్ పీఆర్ కమీషనర్ హరీష్ తదితరులు… సొంత సినిమాలయిన
“గేమ్ చేంజర్”, “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాల విడుదల నేపథ్యంలో దిల్ రాజు భేటీపై సర్వత్రా ఉత్కంఠ…
Ads
.
ఇదీ ఓ వార్త సోషల్ మీడియాలో… అల్లు అర్జున్‌పై ఎలాగూ మునుపున్నంత కాఠిన్యం ఇప్పుడు లేదు రేవంత్ రెడ్డిలో…! ఏదో జరిగింది, తెర వెనుక ఏ సెటిల్మెంట్ జరిగింది అనేది పక్కన పెడితే… కథ అయిపోయింది… కోర్టు కూడా పెద్దగా పట్టించుకోకపోతే ఇక బన్నీ పుష్ప-2ను మించి పుష్ప-3 సీక్వెల్ మరింత జోరుగా, ఇంకాస్త వెగటుగా కూడా స్టార్ట్ చేయొచ్చు…
పర్లేదు, ఈసారి 2000 కోట్లు… అంతర్జాతీయ ఖ్యాతి తెలుగు సినిమాకు తీసుకురావాలనే బన్నీ ఉదాత్త, త్యాగమయ సినిమా జీవితం సార్థకం కావచ్చు… మరి ఆ పైన చెప్పిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం అనబడే దిల్ రాజు సినిమాల సంగతి…?
ఏమో, ప్రతి దానికీ రేట్లుంటయ్ అంటారా..? నిజంగానే ఇప్పుడు సంక్రాంతికి ఆ రెండు సినిమాలకు గనుక రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు, టికెట్ రేట్ల పెంపుకి అనుమతిస్తే… మరింత భ్రష్టుపట్టిపోతుంది ఈ సర్కారు విలువ… అస్సలు డౌట్ లేదు…
ఏ మాత్రం డొల్ల సడలింపులు ఇచ్చినా సరే, రేవంత్ రెడ్డి ఇజ్జత్ పంచనామా అయిపోవడం ఖాయం… అసలు దిల్ రాజును ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంచుకోవడమే ఓ బ్లండర్… రెడ్డి సాబ్ కావచ్చుగాక… కానీ పక్కా సిండికేట్ వ్యాపారి… ఇండస్ట్రీ తన గుప్పిట్లో ఉంది… అలాంటి తనకు కీలకమైన పదవి ఇవ్వడం ఏమిటి..? తను కాంగ్రెస్ గెలుపు కోసం ఏం చేశాడు రేవంత్ రెడ్డీ..?!
ఏమో, రేవంత్ ఇండస్ట్రీ నుంచి ఏమాశిస్తున్నాడో అంటారా..? అవున్లెండి… అసలే ఢిల్లీ కోరికలు, తన కోరికలు, దివాలా తీసిన ఖజానా, పెచ్చుపెరిగిన ఖర్చులు… ఎక్కడి నుంచి ఏమొచ్చినా స్వీకరించే దురవస్థ… కానీ జనం ఏమనుకుంటారు..?
ఏమీ అనుకోరు… ఈ రోజుకు తిట్టుకునేది రేపటికి ఉండదు… పైగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పాజిటివ్ మార్కులు సంపాదించాలనే సోయి ఎప్పుడూ ఉండదు, ఇప్పుడూ ఉండదు… కేసీయార్ వ్యతిరేకతే దాని బలం… క్రమేపీ కేసీయార్ వ్యతిరేకత సన్నగిల్లితే..?
ఏముంది..? గాలి ఉన్నప్పుడే తూర్పారపట్టుకుని జంపుడే..!! నిజాలు ఇలాగే నిష్ఠురంగానే ఉంటాయి సీఎం సార్..!! అవునూ, ఇప్పటికీ మోహన్‌బాబును ఎందుకు అరెస్టు చేయలేదు..? జల్‌పల్లి అడవుల్లో వన్యప్రాణి వేటకు సంబంధించి మంచు విష్ణు స్టాఫ్ మీద కేసు ఎందుకు పెట్టలేదు..? తెర వెనుక ఏం జరుగుతోంది..!!
Share this Article