Siva Karthik….. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి స్వయంకృపరాధంతో తన స్టామినాని తనే తగ్గించుకుంటున్నారా….!? ఖైదీ సినిమాతో చిరంజీవి స్టార్ అయ్యారు అనుకుంటారు చాలామంది. కానీ అప్పటి సూపర్ స్టార్స్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు కలిసి నటించిన సినిమా ముందడుగు కంటే కూడా ఎక్కువ థియేటర్స్ లో ఖైదీ సినిమా రిలీజ్ అయ్యింది… అంటే చిరంజీవి ఎప్పుడు స్టార్ అయ్యాడో కూడా ట్రేడ్ కే కాదు, ఎవరికి తెలియదు …
అది కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ ‘chiranjeevi’ మ్యాజిక్… 70 ఏళ్ళకి కూత వేటు దూరంలో ఉన్నా కూడా తెల్లవారు జామున 3 గంటల వరకు వర్క్ చేసి మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ 7 గంటలకి కాల్ షీట్ వుంది వుంటే అరగంట ముందే షూట్ లొకేషన్ కి వచ్చే హీరో మీరు… సినిమా ఆన్నా… చేసే వృత్తి అన్నా అంత ప్రాణం , ప్యాషన్ మీకు….
క్యారవ్యాన్ వున్నా కూడా అందులోకి వెళ్లి రెస్ట్ తీసుకోకుండా స్పాట్ లోనే వుంటూ మీ షాట్స్ కే కాకుండా కౌంటర్ షాట్స్ కి కూడా రియాక్షన్స్ ఇస్తూ తోటి ఆర్టిస్టులను inspire చేస్తూ వుంటారు..
Ads
టేక్ కి వెళ్ళే ముందే తోటి ఆర్టిస్టులతో రిహార్సల్ చేస్తూ అందరిని ఇన్వాల్వ్ చేస్తూ ఉత్సాహంగా పని జరిగేలా Good Environment క్రియేట్ చేస్తుంటారు… ఎప్పుడో జాతర సినిమాకి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ టాలెంట్ గుర్తుపెట్టుకొని పదిహేనేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ కి నటనలో మెళకువలు నేర్పమనే బాధ్యత అప్పగిస్తే, అతను ఈ రోజును టాలీవుడ్ టాప్ హీరోలకి నట గురువు అయ్యారు (వైజాగ్ సత్యనంద్ గారు)…
మాస్టర్ సినిమా టైంలో విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిన కథ గుర్తు పెట్టుకొని 11 ఏళ్ల తర్వాత పిలిచి దర్శక ధీరుడుతో (మగధీర) దగ్గరుండి చెప్పించుకుని రామ్ చరణ్ కి తిరుగులేని స్టార్ డం వచ్చేలా చేసారు… ఉప్పెన సినిమా ప్రివ్యూ చూసి ప్రొడ్యూసర్స్ కి ఓన్ రిలీజ్ చేసుకోమని సలహా ఇచ్చే జడ్జిమెంట్ మీది.. కుటుంబంలో హీరో అవుతాను అన్న ప్రతి ఒక్కరి లైఫ్ కి స్టార్ స్టేటస్ వచ్చేలా స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేయడంలో స్పెషలిస్ట్ మీరు …. ఇండియాలో ఒక కమర్షియల్ హీరో అవ్వాలనుకునే ప్రతి హీరో ఎలా నటించాలో, ఏమేం చేయాలో అనేదానికి ఒక లైబ్రరీ మీ కమర్షియల్ సినిమా జర్నీ ..ఒక సినిమా కథ విని అందులో లోటు పాట్లను ఎత్తి చూపగలిగే స్క్రిప్ట్ డాక్టర్ అని టాలీవుడ్ టాప్ producer దిల్ రాజు గారే కితాబు ఇచ్చారు మీకు……
ఇలాంటివి మీలో వున్న గొప్ప క్వాలిటీస్ లో మచ్చుతునకలు మాత్రమే..
అలాంటి మీరు ఎందుకు ఇలా గాడ్ ఫాదర్, భోళా శంకర్ లాంటి సినిమాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు… హిట్ ఫ్లాప్ అనేది ఎవరి చేతుల్లో వుండదు.. కానీ స్ట్రెయిట్ సినిమా చేస్తే వచ్చే కిక్ ఇలా రీమేక్స్ లో రావు.. సైరా సినిమా ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ రాజమౌళి గారి సపోర్ట్ లేకుండా ఇప్పుడున్న top 6 హీరోల్లో ఎవరు కూడా ఇంతవరకు క్రాస్ చేయలేకపోయారు..
ఇంకొన్ని నెలల్లో ప్రశాంత్ నీల్ సలార్, శంకర్ గారి గేమ్ చేంజర్ క్రాస్ చేయొచ్చేమో… ఎందుకంటే రాజమౌళికి దీటైన దర్శకులు వాళ్ళు కాబట్టి… మొన్న సంక్రాంతికి వచ్చిన వీరయ్య average గా వున్నా కూడా.. మీ గ్రేస్ అండ్ ఎనర్జీతో సినిమాని 200+ గ్రాస్ తో 200 డేస్ ఆడే బ్లాక్ బస్టర్ మూవీ చేసారు… స్ట్రెయిట్ సినిమాకి వుండే అడ్వాంటేజ్ ఇది.. ఇదంతా మీకు తెలియంది, చూడంది కాదు…
కాకపోతే ఒక అభిమానిగా మా బాధ మీకు చెప్పుకోవాలనే ఈ చిన్న ప్రయత్నం .. అసలు ఈ ott కాలంలో రీమేక్స్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే భస్మాసురుడికి వాళ్ళకి పెద్ద తేడా లేదనిపిస్తుంది…. పవన్ కళ్యాణ్ అంటే వేరు, ఆయనకి ఫస్ట్ నుండీ సినిమా మీద మీకున్నంత ఫ్యాషన్, ప్రేమ లేవు… పైగా పబ్లిక్ కీ మంచి చేయాలని పాలిటిక్స్ లో వున్నారు కాబట్టి డబ్బులు కోసమే, తక్కువ రోజుల్లో సినిమా చేసేయాలనే ఉద్దేశంతోనో రీమేక్స్ చేస్తున్నారు అంటే అర్ధం వుంది..అంతే కానీ మీకెందుకు Sir ఈ రీమేక్స్…
ఖైదీ no 150 అంటే మురుగుదాస్ గారి స్టోరీ, పైగా మీ కమ్ బ్యాక్ సినిమా, వినాయక్ గారి లాంటి మాస్ డైరెక్టర్.. సో వర్క్ అవుట్ అయ్యింది… అసలు Lucifer మనకి వర్క్ అవుట్ అవుతుందా.. డైరెక్ట్ గా యూట్యూబ్ లో తెలుగు వెర్షన్ వుంటే అసలు ఎందుకు రీమేక్ చేస్తున్నారో కూడా ట్రేడ్ కి కూడా అర్థం కాలేదు, అలాంటి కథ చేయాలని విజయేంద్ర ప్రసాద్ గారిని అడిగితే దాని బాబు లాంటి కథ ఇచ్చేవారు..
ఇక భోళా శంకర్… వేదాళం ఏవరేజ్ కమర్షియల్ ఫిల్మ్.. ఇప్పుడు త్రివిక్రమ్ గారి ట్రిప్ లో పవన్ వున్నట్టు అప్పుడు శౌర్యం శివ గారి ట్రిప్ లో వున్న అజిత్ గారు చేసిన సినిమాల్లో అదొకటి … శివ స్వతహాగా dop కాబట్టి స్టైలిష్ గా ప్రసెంట్ చేసి వర్క్ ఔట్ చేశాడు అంతే కానీ రీమేక్ చేయాలి అనుకునేంత స్టోరీ అందులో లేదు.. పైగా కట్టిపడేసే ఎలిమెంట్స్ కూడా లేవు..
రీమేక్ చేయడమే ఒక డేంజర్ రిస్క్ అనుకుంటే నాలుగు హెలికాప్టర్ షాట్స్ ,8R లెన్స్ తో వైడ్ షాట్స్ కంపోజ్ చేస్తూ అదేదో Hollywood స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అని తనకి తానే ఫీల్ అయ్యే దర్శక బ్రహ్మ మెహర్ రమేష్ గారికి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడం… ఏదో మోహమాటానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తాను అని మాట ఇచ్చినట్లు సినిమా ఇచ్చేశారు.. ఇప్పుడు ఏమైంది… తప్పు ఎవరిది.. సినిమా విడుదల అయిన మొదటి రోజే చాలా చోట్ల టికెట్స్ దొరికే పరిస్థితి వచ్చింది …
అయినా మీ నుండీ మేము ఏమైనా అమితాబ్, ముమ్మట్టి , మోహన్ లాల్ గార్లలాగా కంటెంట్ సినిమాలు చేయమని అడుగుతున్నామా .. ఒక వేళ మీరు చేద్దాము అన్నా ఇప్పుడే ఎందుకు ఇంకో 5, 6 ఏళ్ల తర్వాత చేయండి Sir అని మేమే చెప్తాము… ఇంకా మీ నుండీ లక్షలాదిమంది అభిమానులు, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు కొంచెం స్టొరీ ఇంట్రెస్టింగ్ గా వుంటూ మీరు స్టెప్స్ వేస్తే కలసి స్టెప్స్ కలపడానికి, ఫైట్స్ చేస్తే విజిల్స్ వేయడానికి, డైలాగ్స్ చెప్తుంటే క్లాప్స్ కొట్టడానికి, కామెడీ చేస్తే నవ్వుకోవడానికి,సెంటిమెంట్ సీన్స్ చేస్తే కన్నీళ్లు పెట్టడానికి టోటల్ గా ఒక కమర్షియల్ విందు భోజనం లాంటి సినిమా చూడడానికే సిద్దంగా వున్నారనీ waltair veerayya తో నిరూపించారు….
అలాంటిది ఎందుకు sir సరిగ్గా ఉడికి ఉడకని ఈ రీమేక్స్ చేసి మీ మార్కెట్ మీరే తగ్గించుకుంటున్నారు.. ఫ్యాన్స్ కోసం సినిమాలు తీసే మీరు ఫ్యాన్స్ తలదించుకునే సినిమాలు చెయ్యడం చాలా బాధ వేస్తుంది… అసలు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆచార్య కి ఎంత కలెక్షన్స్ వచ్చాయో ఏవరేజ్ టాక్. 2.75 to 3 రేటింగ్ ఇచ్చినా కూడా గాడ్ ఫాదర్ కి కూడా అంతే కలెక్షన్స్ వచ్చాయి…. ఇప్పుడు భోళాకి ఫైనల్ రన్ లో అంత కూడా రావేమో అనిపిస్తుంది…
సేఫ్ కోసం రీమేక్ చేద్దామని మీరు అనుకున్నా కూడా మీ స్ట్రెయిట్ ఫ్లాప్ సినిమా రేంజ్ లో కూడా రీమేక్ సినిమా కలెక్షన్లు రావడం లేదు అని గుర్తించండి Sir.. మీరు నెక్స్ట్ స్ట్రెయిట్ సినిమానే చేయండి Sir… మన ఫ్యాన్స్ అంతా కలిసి Day 1 records పెడతాము …. రెండో రోజు RTC క్రాస్ రోడ్స్ లోనే కాదు తెలుగు సినిమాలు చూసే ప్రతి సెంటర్ లో 30% occupancy కూడా లేదు… అభిమానులు కూడా మనం చెప్పినా బాస్ వినరు అని వాళ్ళకి వాళ్ళే మథనపడుతున్నారు…
ఒక్క రోజులోనే 100 కోట్ల గ్రాస్ తీసుకొచ్చే స్టామినా మీకుంది… ఒక ప్రాంతీయ భాషలోనే 300 కోట్ల వున్న మార్కెట్ ని మీరే 30 కోట్లకి తెచ్చుకుంటున్నారు అనిపిస్తుంది .. మీరు తల్చుకుంటే ఎంత సేపు చెప్పండి Sir… బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే స్టోరీస్ రాసే రైటర్స్ వున్నారు మన దగ్గర, ఎంతో గొప్ప సాహిత్యం వుంది.. వెతుక్కోవాలే కానీ ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, ఇంద్ర లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్స్ ని మళ్ళీ ఈ జనరేషన్ కి చూపించోచ్చు…
అసలు భోళా లో మీ ఎనర్జీ చూసి గ్యాంగ్ లీడర్ చిరంజీవి గుర్తుకి వచ్చారు… ఇంత potentiality వుండి కూడా బాస్ ఏంటీ ఇలాంటి సినిమా చేసారు అని ప్రతి అభిమాని ఫీల్ అవుతున్నాడు… మేమే కాదు మీరు కూడా అనవసరంగా ఈ సినిమా చేసాను అని బాధపడుతూ వుంటారు.. అయినా సరే కొన్ని రోజుల్లో మళ్ళీ రీఛార్జ్ అయ్యి ఇంకో వన్ ఇయర్ లోపే రికార్డ్స్ బద్దలయ్యే cinema ఇస్తారు… ఫ్యాన్స్ కాలర్ ఎగేరేసేలా చేస్తారు.. అప్పుడు ఇలా మిమ్మల్ని విమర్శించిన ప్రతి నోరు మెచ్చుకునేలా చేస్తారు అనే విషయం మీ అభిమానిగా నాకు తెలుసు Sir.. కానీ దయచేసి రీమేక్స్ మాత్రం చేయకండి … మీరు స్ట్రెయిట్ సినిమాలు చేయండి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ మేము ఇస్తాము… మీరు ఎప్పటికీ మా గుండెల్లో మెగాస్టారే… తెలుగు హీరోల్లో ఎవరెస్ట్ శిఖరమే…
Share this Article