Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాన్నను కదా తల్లీ… వెనుకబడిపోయా, ఓడిపోయా… వెళ్లిపోతున్నా బంగారూ…

May 3, 2025 by M S R

.

దుప్పటి కప్పుకొని… Phone Brightness తక్కువగా పెట్టుకొని ముసిముసిగా నవ్వుతూ Msg లకు Replies ఇస్తున్న బిందు… Room బయట ఏదో చప్పుడు వినిపించేసరికి Phone Lock చేసి మెల్లిగా దుప్పటి తీసి Door దగ్గరకు వెళ్లి తలుపు సందులోంచి బయటకు చూసింది…. Hall లో నాన్నగారు అటు ఇటు తిరుగుతూ కనిపించారు…. అమ్మ సోఫాలో కూర్చొని గడియారం వైపు చూస్తోంది…. తమ్ముడు Cake ని చేతిలో పట్టుకొని నాన్నగారి వంక చూస్తున్నాడు…!

వాళ్లను చూసి వెంటనే మెల్లిగా తలుపులు వేసి Door Lock చేసి వచ్చి Bed మీద పడుకొని దుప్పటి కప్పేసుకొని మళ్లీ చాటింగ్ మొదలెట్టింది…!

Ads

ఇంతలో నాన్నగారు … ” బిందు…. బిందు… ” అంటూ పిలిచారు… తమ్ముడు… అమ్మ కూడా పిలవడం మొదలెట్టారు…. ఏరోజు లేనిది ఈరోజు కొత్తగా బిందు Door Lock చేస్కోవడం వాళ్లకు విచిత్రంగా అనిపించింది… కాస్త భయంగా కూడా అనిపించింది…. పిలవడంతో పాటు ఈసారి తలుపులను కూడా బాదడం మొదలెట్టారు నాన్నగారు…!

వాళ్ళు అంతలా పిలుస్తున్నా కూడా బిందు కప్పుకున్న దుప్పటి తీయలేదు.. వాళ్ళ పిలుపుకు Respond అవ్వలేదు…. Phone పక్కన పెట్టేసి కళ్ళు తెరిచి ఏదో ఆలోచిస్తూ ఉంది…. ఇంతలో బిందు Mobile Vibrate అయ్యింది…. వెంటనే బిందు Mobile చేతిలోకి తీసుకొని Call Answer చేసింది…. అటు వైపు నుండి ఎవరో Birthday Wishes చెప్పారు…. బిందు సంతోషంతో Thanks You So Much అని చెప్పి ఇంకేదో మాట్లాడింది…!
ఇంతలో నాన్నగారి వాళ్ళ పిలుపులు కాస్త అరుపులుగా మారడంతో…. అయిష్టంగానే Call Cut చేసి వెళ్లి Door తీసింది..!

Door తీయగానే నాన్నగారు… ” Many More Happy Returns of the Day రా కన్నా ” అంటూ ఎంతో ప్రేమతో బిందు ని wish చేశారు…. అమ్మ… తమ్ముడు కూడా…!

Cake Cut చేయించారు…. నాన్నగారు ఏదో Gift కూడా ఇచ్చారు తనకి… పాపం తనకి బాగా నిద్రొస్తుంది ఏమో… అందుకే కనీసం ఆ Gift ని open కూడా చేయకుండానే Room లోకి వెళ్ళిపోయి Door వేసుకుంది…!

దాదాపుగా 3 నెలలకు పైనే అయ్యుంటుంది బిందు నాన్నగారితో కూర్చొని మాట్లాడి… చాలాసార్లు నాన్నగారు మాట్లాడడానికి ప్రయత్నించారు…. కానీ ఈ మధ్య బిందు బాగా Busy అయిపోయింది…. Project work లు… Combined Studeis…. Extra Classes అనుకుంటూ చాలా busy అయిపోయింది….

ఒకప్పుడు నాన్నకు Gud Mrng చెప్పేదాక తన Day ని Start చేయని బిందు ఈరోజు Day మొత్తంలో ఒక్కసారి కూడా నాన్నతో మాట్లాడడానికి Time ఇవ్వట్లేదు…. ఎప్పుడూ లేనంతగా బాగా మారిపోయింది ఈ మధ్య….. ఎంతగా అంటే తన Birthday రోజే నాన్నగారి Birthday అనే విషయం మర్చిపోయేంతగా…!!

బిందు ప్రవర్తన నాన్నగారికి కొత్తగా అనిపించింది… ఏవేవో అనుమానాలు కలిగాయి తనలో…. కానీ తన కూతురి మీద ఉన్న నమ్మకానికి ఆ అనుమానాలు పటాపంచలు అయ్యాయి….!

మరుసటి రోజు ఉదయం నాన్నగారు సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నారు…. బిందు నాన్నగారి ముందు నుండే Bag తీస్కొని బయటకు వెళ్ళింది…. నాన్నగారు చూసారు కానీ ఏం అడగలేకపోయారు…. బహుశా Frnd దగ్గరికి వెళ్తుందేమో అనుకున్నారు…. కానీ అమ్మ అడిగేసింది… ” ఎక్కడికే… Bag తీస్కొని బయల్దేరావ్…” అంటూ…

” బట్టలు డ్రై క్లీనింగ్ కి ఇవ్వడానికి మా ” అని చెప్తూ చెప్తూనే గేట్ దాటేసింది….!
సరిగ్గా వాళ్ళ ఇంటి నుండి 30 అడుగులు వేస్తే డ్రై క్లీనింగ్ Shop వచ్చేస్తుంది…. మహా అంటే ఓ 10 నిమిషాల నడక…!

బిందు బయల్దేరి గంట కావొస్తుంది… ఇంకా ఇంటికి రాలేదు…. నాన్నగారు కంగారుగా.. ” రేయ్… ఓసారి బయటకి వెళ్లి చూడు… అక్క Shop దగ్గర ఉందేమో ” అంటూ తమ్ముడిని బయటికి పంపాడు…!
10 నిమిషాల్లోనే తిరిగివచ్చి… ” అక్క అసలు Shop కి రాలేదు అంట నాన్నగారు ” అని చెప్పేసరికి…. నాన్నగారు కుర్చీలోంచి లేచి టేబుల్ మీద ఉన్న తన Phone తీసుకొని బిందు Number కి call try చేశారు…. Call కలవలెదు…!

బిందు వాళ్ళ Frnds అందరికి చేశారు… కానీ తను వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు…!
నాన్నగారికి ఏం చేయాలో పాలు పోలేదు…. తెల్సినవాళ్ళ అందరికి Call చేశారు… కానీ ఏ ఉపయోగం లేకుండా పోయింది….!

” ఓసారి పోలీస్ Complaint ఇద్దాం అండి..” అంటూ అమ్మ ఏడుస్తూ అనేసరికి నాన్నగారు సరేనంటూ కళ్ళు తుడుచుకుని… Complaint File చేయడం కోసం Photo కోసం బిందు రూమ్ లోకి వెళ్లారు….!
అలా వెళ్ళగానే ఇలా టేబుల్ మీద Photo కనిపించింది… టక్కున Photo తీస్కొని రూమ్ నుండి బయటకు వస్తూ ఒక్కసారిగా ఆగిపోయి, తన చేతిలో ఉన్న ఫోటో వంక చూసారు…. ఎవరో అబ్బాయి ఫోటో అది… ఇందాక తను ఫోటో తీసిన ఆ టేబుల్ వంక చూసేసరికి ఓ Letter గాలికి శబ్దం చేస్తూ కనిపించింది…!
దగ్గరికెళ్లి Letter open చేశారు నాన్నగారు…

” నాన్నా… నేను ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని ప్రేమిస్తున్నాను…. ఇద్దరం కలిసి దాదాపుగా 6 నెలలుగా ప్రేమలో ఉన్నాం…. పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నాం…. కానీ ఈ విషయం మీకు చెప్తే మీరు ఖచ్చితంగా ఒప్పుకోరు అని తెల్సు నాకు…. పైగా ఈ మధ్య ప్రేమించిన పాపానికి కన్న తండ్రులే కూతుళ్ళని చంపేస్తున్నారు…. అందుకే భయపడి మీకు చెప్పలేదు…. మమ్మల్ని కల్సి బ్రతకనివ్వండి… మాకు మీ అవసరం లేదు… దయచేసి మాకోసం వెతికి.. మా జీవితాలను నాశనం చెయ్యకండి…!! ”

నాన్నగారు Letter మొత్తం చదివి…. రూమ్ తలుపులు మూసేసుకున్నారు….!
సరిగ్గా వారం రోజుల తరువాత బిందు ఆటో దిగింది ఇంటి ముందు…. ఆటో శబ్దం విని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు తమ్ముడు…. బిందుని చూసి … ” అమ్మా… అక్క వచ్చేసింది…” అంటూ అరిచాడు…. ! అమ్మ కూడా బయటకు వచ్చింది…. బిందు వంక చూస్తూ అలా నిలబడిపోయింది…!

బిందు అమ్మని, తముణ్ణి చూస్తూ సిగ్గుతో తల దించుకొని భయంతో బయటే నిల్చుండిపోయింది…. తమ్ముడు బిందు దగ్గరికి వెళ్లి.. ” లోపలికి పద అక్కా… ” అంటూ ప్రేమగా పిలుస్తూ బిందు చేతిలో ఉన్న Bag తీస్కొని… తనను లోపలికి తీసుకెళ్లాడు…. బిందుకి ఏం అర్థం అవ్వలేదు…. లోపలికి వెళ్లగానే అమ్మ బిందుని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది…. బిందు అంత విచిత్రంగా అనిపించింది…. తను చేసిన పనికి అందరూ కోప్పడతారు… తిడతారు అనుకుంది…. కానీ ఇక్కడ అంత విచిత్రంగా జరిగేసరికి తనకు మెల్లిగా అర్థం అయ్యింది…. తను రాసిన ఆ Letter వీళ్ళు చదవలేదు అని… !

మరి అయితే ఆ letter ఏమైనట్టు…. ఎవరు చదివినట్టు….
” నాన్నగారు…”…. Yes… ఆ Letter నాన్నగారే చదివి ఉండాలి… అవును నాన్నగారే చదివారు…. కానీ నాన్నగారు ఎక్కడ…. తను వచ్చి ఇంతసేపు అయిన నాన్నగారు ఎక్కడ కనిపించలేదు….!
బిందు… ” అమ్మా…. నాన్నగారు ఎక్కడ…? ” అంటూ అమ్మని అడిగింది…!
అమ్మ ఏడుస్తూ … గోడ వంక చూసింది..!
బిందు గోడ వంక చూసి ఖంగుతింది…!
నాన్నగారి Photo కి దండ వేసుంది… బిందు కి పిచ్చి ఎక్కినంత పని అయింది…. తను ఆ shock నుండి తేరుకోకముందే తమ్ముడు ఏడుస్తూ ఓ Letter తీసుకొచ్చి బిందుకి ఇచ్చాడు…!

అందులో…..
” నన్ను క్షమించండి…. నేను బిందుని లైంగికంగా వేధించాను…. తను ఇన్నిరోజులూ ఎవరికి చెప్పలేదు…. కానీ ఈ మధ్య నా వేధింపులు బాగా ఎక్కువ అవ్వడంతో… తను ఎవరికైనా చెప్పేస్తుంది అన్న భయం నాలో మొదలైంది…. అందుకే ఆ భయంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాను……”

ఆ Letter చూసి…. బిందు ఒక్కసారిగా కూలబడిపోయింది…. తన తల పగిలిపోయినంత పని అయ్యింది…. గుండె బరువు ఎక్కిపోయింది…. నోట మాట రాని స్థాయికి చేరుకుంది…!
తనని చూస్తూ అమ్మ నాన్నను దూషిస్తుంది… తను బిందు పట్ల ప్రవర్తించిన తీరు గురించి ఆ Letter లో రాసింది నిజం అనుకొని…….!

బిందు ఏం మాట్లాడకుండా Silent గా భారంగా అడుగులు వేస్తూ తన Room లోకి వెళ్ళింది… రూమ్ లోకి వెళ్లి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఏడ్చింది…. తలను గోడకు బాదుకుంటూ ఏడ్చింది…. చేతులతో తలను కొట్టుకుంటూ ఏడ్చింది…. నేలపై కూలింది…. కన్నీటి ధార ప్రవహించింది తన కళ్ళ నుండి…. నేలపై తలను వాల్చిన తనకు ఎదురుగా ఉన్న టేబుల్ వైపు దృష్టి సారింది…. లేచి టేబుల్ దగ్గరికి చేరుకుంది..!

నాన్నగారు తన Birthday రోజు ఇచ్చిన Gift ని తన చేతిలోకి తీసుకుంది… అది Open చేసినట్టు అనిపించింది తనకు…. దాన్ని పూర్తిగా Open చేసేసరికి … ఏవో Papers కనిపించాయి… Last year తన Birthday wish గా US లో Masters చేయాలని ఉంది అని నాన్నగారితో అంది బిందు…. అందుకోసమే నాన్నగారు తను దాచుకున్న డబ్బు మొత్తాన్ని తన US Education కోసం Invest చేసి Seat సంపాదించి దాన్ని Gift గా ఇచ్చారు….!

అది చూసి బిందు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు… బయటకి వస్తున్న దుఃఖాన్ని గొంతులోనే అదిమిపట్టి, కుమిలి కుమిలి ఏడ్చింది…. బిందు ఆ Gift ని కింద పెడుతుండగా ఆ Gift Box అడుగు భాగాన ఉన్న ఓ Letter క్రిందపడింది…. బిందు దాన్ని తెరచి చదవడం మొదలెట్టింది…..

” బిందూ…. ఎలా ఉన్నావ్ రా బంగారు…. ఈ Letter నువ్ చదువుతున్నావ్ అంటే ఖచ్చితంగా నువ్ చేసింది తప్పు అని తెలుసుకొని తిరిగి వచ్చి ఉంటావు…. పర్లేదు బంగారు…. తెలిసో తెలియక చేసిన తప్పుల్ని దేవుడు లెక్కెట్టడు లే…. ఇక ఈ మనుషులు లెక్కెడతారు అంటావా…. ఆ Chance వాళ్లకు ఇవ్వను నేను…. నా బంగారాన్ని ఎవరైనా ఏదైనా అననిస్తానా నేను…..

అందుకే నువ్ చేసిన తప్పు జనాలకు కనబడకుండా తప్పు నా మీద వేసుకున్నాను…. So… నిన్ను ఎవరు ఏమీ అనరు… నువ్ Happy గా ఉండొచ్చు…. కాకపోతే నేను చెప్పిన అబద్ధం వల్ల నీ ముందే నన్ను జనాలు తిడుతూ ఉండొచ్చు…. కానీ నువ్ అవేం పట్టించుకోవద్దు రా తల్లి…. నన్ను ఎవరు ఏమన్నా పర్లేదు…. అవి వినడానికి నేను ఎలాగూ ఇక్కడ ఉండను కదా….!

హ… నువ్ అన్నది నిజమే తల్లి… ప్రేమించిన పాపానికి కన్న తండ్రులే కూతుళ్ళని చంపుకుంటున్నారు… కానీ నన్ను కూడా వాళ్ళతో పోల్చావు చూడు, అది కాస్త బాధను కలిగించింది తల్లి…. కాస్త కాదు చాలా…. చొక్కా పై బొత్తాలు పెట్టుకోకపోతే ఎగిరిపోయే పరువు ప్రతిష్టల కోసం నిన్ను ఎలా చంపుకుంటాను అనుకున్నావ్ రా….!
నాన్నను రా తల్లి…. గుండెల మీద పెట్టుకొని పెంచాను… నీకు చిన్నపాటి జ్వరం వచ్చిన తెల్లవార్లు జాగారం చేసి మరీ కంటికి రెప్పలా కాపాడుకున్నాను నేను….

నీ రేపటి భవిష్యత్ గురించి నా గతాన్ని , ప్రస్తుతాన్ని సైతం తాకట్టు పెట్టాను నేను…. నీలో మా అమ్మని చూసుకొని నువ్వే నా సర్వస్వమ్ అనుకొని అనుక్షణం నీ గురించే ఆలోచిస్తూ బతికాను రా కన్నా…. అలాంటి నేను నీ ప్రాణాలు తీస్తాను అని ఎలా అనుకున్నావ్ రా….!

9 నెలలు మోసే తల్లిని దేవత అంటూ పూజిస్తారు…. కానీ ఆ మిమ్మల్ని 9 నెలలు మోసే ఆ తల్లిని కవచంలా కాపాడుకుంటూ… భూమి మీదకి అడుగు పెట్టిన నిన్ను 22 ఏళ్ళు భుజాల మీద ఎత్తుకొని పెంచిన నాన్నను మాత్రం కసాయి వాణ్ణి చేశావ్ ఈరోజు… చచ్చిపోయాను రా బంగారు…. నువ్ రాసిన ఆ అక్షరాలు చూడగానే చచ్చిపోయాను నేను….!…అందుకే శాశ్వతంగా చచ్చిపోదాం అని Decide అయ్యాను…! నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే నేను విని తట్టుకోలేను రా తల్లి…!!

నాన్న అంటే నమ్మకం రా… నా నమ్మకానివి రా నువ్…. ఏరా తల్లీ…. నాతో పాటు నువ్ Bike మీద వస్తూ Mobile లో chat చేస్తూ కూర్చుంటే నా బండికి ఉన్న అద్దంలో కనిపించదు అనుకున్నావా …. కనిపించిన కూడా ఎవరు అని అడగలేను… కారణం నమ్మకం…. నా కూతురు అనే నమ్మకం.. ఏది చేసినా నాకు చెప్పి చేస్తుంది అనే నమ్మకం…. కొడుకుల్ని గది బయటే ఉంచి…. కూతుళ్ళని గుండెల్లో దాచుకునే నాలాంటి పిచ్చి తండ్రులు ఎందరో ఉన్నారు….. కానీ ఆ కూతుళ్లు మాత్రం నాన్న గుండెల మీద తంతూ వాళ్లకు నచ్చినట్టుగా బతికేస్తున్నారు…!

అసలు ఏం కావాలి రా మీకు…. ఏదైనా సరే మన దగ్గర లేకుంటేనే కదా బయట Try చెయ్యాలి…. అసలు Love అంటే ఏంటి… !
Caring ఆ…. మీ పట్ల ఎవడో గాలికి తిరిగే వెధవ తిన్నావా అంటూ మూడు పూటలు పలకరిస్తేనే Caring అంటే…. ఆ మూడు పూటలు మీకు తిండి పెడుతున్న Parents చేసేదాన్ని ఏమనాలి…?

Gifts…. పాతిక రూపాయలు పెట్టి Greeting Card… పదిహేను రూపాయలు పెట్టి ఓ చాక్లెట్ కొనిస్తేనే Love పుట్టేసుద్ది అంటే…. పుట్టినప్పటి నుండి ఈరోజు దాకా నువ్ వాడే ప్రతీది కొనిచ్చిన తండ్రి మీద ఏ మాత్రాన ప్రేమ ఉండాలి మరి….?
మేము ఇవ్వలేని ప్రేమలు వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు తల్లీ…. ?

పోనీలే కన్నా…. నువ్ ఏది చేసినా నాకు… Ok…. ఓ తండ్రిగా నువ్ చేసే ప్రతీదాన్ని Support చేస్తాను నేను…. అందుకే నిన్ను Support చేయడానికి నా ప్రాణం కూడా పణంగా పెట్టాను…. నువ్ Happy గా ఉండడమే నాకు కావాలి…. ఓ తండ్రిగా నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడం నా బాధ్యత… ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి….. ఇక పై నిన్ను Support చేయడానికి నేను కూడా ఉండను…….
.

.

(( ఇది కొన్నాళ్లుగా బాగా వైరల్ అవుతోంది… రచయిత ఎవరో తెలియదు… టచింగ్ కథ… ఫోటో కూడా జస్ట్, సింబాలిక్… కథకూ ఆ ఫోటోకూ సంబంధం లేదు……. ముచ్చట ))

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions