Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిన్నప్పుడు మా ఇంటికి దెయ్యం వచ్చింది… అదీ ముసలి దెయ్యం…

October 25, 2023 by M S R

దెయ్యం వచ్చింది.. అవును..నా చిన్నప్పుడు మా ఇంటికి దెయ్యం వచ్చింది..అదీ ముసలి దెయ్యం.. రాత్రి అయితే చాలు మా ఇంటిమీద రాళ్లు విసిరేది.. ఒక్క మా ఇంటిమీదే కాదు.. మా పెద్దనాన్న బ్రహ్మయ్య, బాబాయిలు ప్రసాద్, కృష్ణ వాళ్ళ ఇళ్ల మీదా రాళ్లు విసిరేది.. ఆ దెయ్యం వచ్చే టైం కి మేమంతా తలుపులు వేసుకుని భయపడుతూ పడుకునేవాళ్ళం.. ఎప్పుడు ఎవరిఇంటిమీద రాళ్లు వేస్తుందో అర్థంగాక భయపడి చచ్చేవాళ్ళం… అలా వారం రోజుల తర్వాత ఆ దెయ్యాన్ని మా పిన్నిలు కాపుగాచి పట్టుకున్నారు..

……………..

గుడివాడ దగ్గరలో రామన్నపూడి కి కొంచెం దూరంలో మేంమంతా ఉండేవాళ్ళం.. అక్కడ మా తాత వేములపల్లి రాఘవయ్య, తో పాటు మా పెదనాన్న, బాబాయిలు అంతా కలిసి ఉండేవాళ్ళం.. మాతో పాటు వీరమాచ నేని రాజుగారు, బొప్పన రామచంద్రరావుగారి తో పాటు మరికొన్ని కుటుంబాలు అన్నీ ఒకే చోట ఉండేవి.. అప్పట్లో తాత ఇంటికి ఒక వైపు మా ఇల్లు, కృష్ణ బాబాయ్ ఇల్లు విఉండేవి..మరో వైపు పెదనాన్న, చినబాబాయ్ ఇల్లు ఉండేవి.. అప్పట్లో మా నాయనమ్మకు నలుగురు కొడళ్లకు అసలు పడేది కాదు.. రోజూ తిట్టుకునేవాళ్ళు.. ఒక రోజు మా చిన్న పిన్ని , నాయనమ్మ ఏదో విషయంలో బాగా గోడవపడ్డారు.. అదే రోజు రాత్రి తొమ్మిది తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటి పై రాళ్లు పడ్డాయి.. ఏవేవో అరుపులు వినిపించాయి..ఏమైందా అని అందరూ లేచి చర్చించుకున్నారు.. మొదట దొంగలు ఎవరన్నా వచ్చారా అనుకున్నారు.. మరో గంట తర్వాత మా ఇంటి మీద రాళ్లు పడ్డాయి.. ఇంకో గంట తర్వాత మా పెదనాన్న ఇంటిపై రాళ్లు పడ్డాయి. ఇక ఆ భయంతో ఆ రాత్రంతా మెలకువగా ఉండి బయటే అందరూ మాట్లాడుకుంటూ రాత్రంతా గడిపారు..

Ads

………….

మరుసటి రోజు అందరూ రాళ్ళ దాడి పై చర్చించారు.. ఎవరు ఈ రాళ్లు విసిరి ఉంటారని ఆలోచిస్తున్నారు.. అది విసిరింది మనుషులు కాదు దెయ్యం..ముసలి దెయ్యం అంది మా నాయనమ్మ నాగేంద్రమ్మ.. కోరికలు తీరకుండా బాధతో చచ్చిపోయిన దెయ్యం పగ తీర్చుకుంటోందని అంది.. అందరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.. ఇప్పుడు కోరికలు తీరకుండా ఎవరు చచ్చిపోయారని అడిగింది మా పిన్ని బుజ్జమ్మ.. మన ఇంటికి వచ్చే దారిలో పొలంలో మొన్న ఒక ముసలిదాని శవానికి వాళ్ళ అబ్బాయిలు దహన సంస్కారాలు చేశారు కదా.. ఆ ముసలిదే దెయ్యమై తిరుగుతోంది..రాత్రి దాన్ని నేను చూసాను అంది..అది మా ఇళ్ల మీద రాళ్లు ఎందుకు వేస్తోంది అని భయంగా అడిగింది మా అమ్మ రత్నమ్మ..

ఎందుకంటే.. ఆ ముసలిదానికి కూడా నలుగురు కొడుకులుఒక్క కోడలు దాన్ని సరిగా చూసేవాళ్ళు కాదంట..కనీసం ముసలిదానికి జ్వరమొస్తే భోజనం కూడా వండిపెట్టేవాళ్ళు కాదంట.. రోజూ ముసలిదాన్ని తిట్టేవాళ్ళంట.. కనీసం వాళ్ళ పిల్లలని కూడా ముసలిదానితో ఆడు కొనిచ్చే వాళ్ళు కాదంట.. ఆ బాధతోనే దానికి రోగమొచ్చి చచ్చిపోయిందంట.. చచ్చేముందు ఆ ముసలిది తన శవానికి సొంత పొలంలో తగులబెట్టమని అడిగిందంట..అని చెప్పింది మా నాయనమ్మ.. ఆ ముసలిది దెయ్యం అయి ఇప్పుడు తన కోడళ్ళ మీద పగ మీ అందరిమీదా తీర్చుకుంటోంది అంది నాయనమ్మ

………

అవును రాత్రి నేను సైకిల్ పై వస్తుంటే నా మీద కూడా రాళ్లు వేసింది దెయ్యం..అన్నాడు వీరమాచనేని రాజుగారు..సరిగ్గా ముసలిదాని సమాధి దగ్గరకు వచ్చినపుడు తాటి చెట్టుమీద నుంచి రాళ్లు పడ్డాయి.. అన్నాడు.. నేను పొలం వెళ్లి తిరిగొస్తుంటే…నా వెంట పడింది దెయ్యం.. తెల్ల చీర కట్టుకుంది..దానికి రెండు పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి..ముఖం మీదికి జుట్టు కప్పుకుంది అన్నాడు మా ఇంటికి దగ్గరలో వుండే సింహాద్రి.. దీంతో మా అందరిలో భయం మరింత పెరిగిపోయింది..చివరికి అందరూ కలిసి దెయ్యాలని వదిలించే వాడిని తీసుకొచ్చారు..వాడు అందరి ఇళ్ళ మీదా పసుపు నీళ్లు చల్లి..ఏవో పూజలు చేసి, డబ్బులు తీసుకుని పోయాడు..

…………..

ఇక దెయ్యం పోయుంటుంది లే అనుకుంటున్న సమయంలో ఆరోజు రాత్రి మళ్లీ అందరి ఇళ్ల మీద రాళ్లు పడ్డాయి.. మా నాన్నకి అమ్మ చెబితే ఆయన దెయ్యం లేదు గియ్యం లేదు పడుకోండి అని విసుక్కున్నారు..లా భయపడుతూ నాలుగురోజుల గడిపాము…

………………

ఐదోరోజు రాత్రి తొమ్మిది గంటలకు మా నాలుగో పిన్ని బుజ్జమ్మ, మూడో పిన్ని శా రదమ్మ గట్టిగా అరుస్తుంటేమేమంతా ఇళ్ళల్లోంచి పరుగులు తీసుకుంటూ వెళ్ళాము..అక్కడ వాళ్లిద్దరూ ఒక ముసలిదాన్ని గట్టిగా పట్టుకుని దెయ్యం దొరికింది రెండ్రో య్ అని అరుస్తున్నారు.. దెయ్యం దగ్గరకి వెళ్తుంటే అందరిలోనూ ఒకటే భయం.. అయినా దెయ్యాన్ని ఎలా పట్టుకున్నారు మీరు అని అడుగుతోంది మా అమ్మ.. దెయ్యానికి మంత్రాలు వచ్చు కదా మిమ్మల్ని ఏమన్నా చేస్తుందేమో అని దగ్గరకి రాకుండా దూరంగా ఉండి అంటోంది పెద్దమ్మ రమాదేవి.. దెయ్యం ముఖం మీడికి టార్చ్ లైట్ వేసాడు మా చిన్న బాబాయ్..అందరూ ఆశ్చర్యపోయారు.. నువ్వా అని అందరూ ఒకేసారి అరిచారు.. ఈ వయసులో నీకిదేం పోయేకాలం.. నీకెందుకీ వేషాలు అంటున్నాడు మా తాత.. నేను దగ్గరకు వెళ్లి దెయ్యం ముఖం చూసా… ఆ దెయ్యం ఇంకెవరో కాదు.. మా నాయనమ్మ నాగేంద్రమ్మ….

………..

మన ముసలిది దెయ్యంలా భయపెడుతోంది అని నువ్వెలా కనిపెట్టావ్ అని మా పిన్నిని అడిగితే..అప్పుడు ఆమె చెప్పింది… సాయంత్రం ముసలమ్మ ఎవరో కుర్రాడితో బుట్టలో కంకర రాళ్లు తెప్పించి మంచం కింద పెట్టడం చూసా.. ఏమి చేస్తుందా అని కాపు కాస్తే.. ఇదిగో ఇప్పుడు బయటకు వచ్చి రాళ్లు తీసి ఇళ్ళమీదికి విసురుతోంది.. అంది బుజ్జమ్మ..

……..

పాపం మా నాయనమ్మని తిట్టేవాళ్ళు తిట్టారు.. కాసేపు అందరూ నవ్వుకున్నారు.. ఇంతకీ ఇలా ఎందుకు చేశావ్ అని నాయనమ్మని అడిగితే అప్పుడు చెప్పింది.. నా కోడళ్లందరికీ బుద్ది రావాలని.. అంది.. అశోక్ వేములపల్లి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions