Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లక్ష్మి అందం, అభినయం… వేటూరి పాటకు రాజన్ నాగేంద్ర స్వరాభిషేకం…

September 24, 2024 by M S R

A great musical and visual feast . క్లాస్ & మాస్ ఆడియన్సులను ఇద్దరినీ అలరించిన సినిమా . ఈరోజుకీ ప్రతీ పాట సూపర్ హిట్టే . నవతా ఆర్ట్స్ బేనరుపై వచ్చిన ఈ పంతులమ్మ సినిమా లక్ష్మి , రంగనాధ్ కెరీర్లలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది . కథను ఎవరు వ్రాసారో కానీ చాలా చక్కగా వ్రాసారు .

టైటిల్సులో నవతా టీం అని వేసుకున్నారు . చక్కటి కధకు కె.వి రెడ్డి గారి శిష్యుడయిన సింగీతం శ్రీనివాసరావు బిర్రయిన స్క్రీన్ ప్లేను తయారు చేసుకుని , దర్శకత్వం వహించారు . సినిమా విజయానికి బాలూమహేంద్ర ఫొటోగ్రఫీ కూడా కారణమే .

ఈ సినిమాకు గుండెకాయ రాజన్ నాగేంద్రలు అందించిన మధురాతి మధుర సంగీతం . ఈ సినిమాలో వేటూరి సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే . అలాగే సుశీలమ్మ , బాల సుబ్రహ్మణ్యంలు . మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం పాటను ఎన్ని సార్లు విని ఉంటారో సంగీతప్రియులు .

Ads

సిరిమల్లె నీవె విరిజల్లు కావే వరదల్లె రావే , ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా పూదారులన్నీ గోదారి కాగా , పండగంటి ఎన్నెలంత సందరయ్య దండగయ్యిపోయింది సందరయ్య , మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు పాటలు అత్యద్భుతమైన పాటలు .

పంతులమ్మ , సీతామాలక్ష్మి సినిమాల పాటలతో మాకో ప్రత్యేక అనుబంధం ఉంది . 1978 సంక్రాంతి రోజుల్లో మా TJPS కాలేజీ M Com విద్యార్ధులను కర్నాటక టూరుకి తీసుకొని వెళ్ళాం . ఆ బస్సులో పది రోజులూ బస్సు టేప్ రికార్డర్లో ఈ రెండు సినిమాల పాటలు తెగ వేయించుకుని వినేవాళ్ళం . అలాగే ఆ ఇష్టం సినిమాలు చూసాక మరీ ఎక్కువ అయిపోయింది .

సినిమా అంతా మనకు రంగనాధ్ , లక్ష్మి , దీపలే కనిపిస్తారు . రంగనాధ్ , లక్ష్మిలకే కాదు , దీపకు కూడా మంచి పేరుని తెచ్చిందీ సినిమా . శరత్ బాబు , గిరిజ , రావి కొండలరావు , నిర్మలమ్మ , కె వి చలం , సరిత , సాయికుమార్ ఇతర పాత్రల్లో నటించారు . మా గుంటూరు వాడు ప్రదీప్ శక్తి కూడా ఉన్నాడు . టైటిల్సులో ప్రదీప్ కుమార్ అని వేసారు . మరో చరిత్ర కన్నా ముందే సరిత ఈ సినిమాలో నటించింది . చాలామంది గమనించి ఉండరు .

ఈ అందమైన సినిమాకు నాలుగు నంది అవార్డులు , ఒక ఫిలిం ఫేర్ అవార్డు వచ్చాయి . లక్ష్మికి ఉత్తమ నటి , రాజన్ నాగేంద్రలకు సంగీతానికి , వేటూరి పాటలకు , బాలనటిగా నటించిన బేబీ రాణికి నంది అవార్డులు వచ్చాయి . లక్ష్మికి ఫిలిం ఫేర్ వారి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది .

మా తర్వాత తరం వారు కూడా ఈ సినిమాని ఆస్వాదించి ఉంటారు . ఈతరం వారిలో చూడనివారు ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి . వీనుల విందైన సంగీత సాహిత్యాలు . కనులకు విందైన ఫొటోగ్రఫీ , లక్ష్మి , దీపలు . మనసుకు హత్తుకుపోయే సినిమా నడక . An unmissable , feel good , emotional movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు    (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions