Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మవారి విగ్రహంతో బరిబాతల చెరువులోకి… అంతుచిక్కని అసాధారణ మిస్టరీ !!

July 19, 2026 by M S R

.

నిజంగా ఏదో సైకో థ్రిల్లర్ సినిమాలో ఏదో క్రియేటివ్ సీన్‌లాగా..! చదువుకున్న యువతి, చీకట్లో, రాత్రిపూట, బట్టలన్నీ విప్పుకుని, బరిబాతల, దగ్గరలోని ఏదో గుడిలో విగ్రహాన్ని ఎత్తుకుని, పరుగెత్తి, ఏదో చెరువులో దూకేయడం! రాంగోపాలవర్మ వంటి పర్వర్టెడ్ దర్శకులకూ అందని క్రియేటివ్ సీన్… కానీ నిజంగా జరిగింది హైదరాబాదులో… ఓసారి ఆ వార్త చదవండి, మాట్లాడుకుందాం…

విజయనగరం జిల్లా దేవుపల్లి గ్రామం… ఆ ఊరికి చెందిన అరుణ (52), ఆమె కూతురు తేజస్విని (25) గత కొంతకాలంగా హైదరాబాద్, మేడ్చల్ జిల్లా, మేడిపల్లి, శంకర్ నగర్‌లోని ఓ ఇంట్లో నివాసముంటున్నారు. తేజస్విని గత ఆరు నెలల క్రితం వరకు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేది… రాజీనామా చేసింది.

Ads

ప్రస్తుతం తన తల్లితో కలిసి ఉంటోంది. అయితే, శుక్రవారం అర్ధరాత్రి వేళ తేజస్విని నగ్నంగా స్థానిక ఆలయానికి వెళ్లి, అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని, చీరను తీసుకుని పక్కనే ఉన్న పీర్జాదిగూడ చెరువులోకి దూకేసింది. ఉదయం తేజస్విని మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, హైడ్రా (HYDRAA), డిఆర్ఎఫ్ (DRF) సిబ్బంది.. చెరువులో యువతి మృతదేహాన్ని వెలికి తీశారు.

చెరువు సమీపంలోని సీసీకెమెరా ఫుటేజీలను పరిశీలించినా తేలింది ఇదే… ఇప్పటికే తేజస్విని మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు.. అమ్మవారి విగ్రహం కోసం గాలిస్తున్నారు…. ఇదీ వార్త…

అసలు ఓ సాఫ్ట్ వేర్ కొలువు చేసుకునే ఓ యువతి ఇలా అసాధారణంగా ప్రవర్తించడం ఏమిటి..? పెద్ద మిస్టరీ… టీవీ చానెళ్లు, పత్రికలు నానా కథనాలు రాస్తున్నాయి గానీ, నిజం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు… 1) సాఫ్ట్‌వేర్ కొలువుల అనిశ్చితి, పనిలో ఒత్తిడి చాలామందిని మానసిక సమస్యలకు గురిచేస్తున్నాయి, ఈమె దాంతోనే మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యింది, అందుకే రాజీనామా చేసి వచ్చేసిందనీ, చికిత్స కూడా తీసుకుంటోందని ఓ కథనం…

ఐనా ఫలితం లేకపోగా ఇంకా ఇంకా వ్యాధి ముదిరిపోయిందనీ, ఈ చేష్ట వెనుక కారణం ఇదేనని అంటున్నారు… అది వోకే, కానీ విగ్రహాన్ని తీసుకుపోయి బరిబాతల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి…?

2) ఇక్కడే మరో కథనం ఆసక్తికరం… ఎవడో క్షుద్రపూజలు చేసేవాడు వీళ్లకు ఏదేదో చెబుతూ డబ్బు లాగుతున్నాడని..! ఐనా వీలైనన్ని పూజలు చేయించి, డబ్బు లాగుతాడు గానీ ఆత్మహత్య చేసుకొమ్మని చెప్పడు కదా… సో, అంతా మిస్టరీ…

3) ఎవడో ఏదో కథనంలో రాసుకొచ్చాడు… నెలకు లక్ష రూపాయల అద్దె కడుతున్నారు, వీళ్లుండే ఫ్లాట్ పైన రెండు ఫ్లోర్లలో లాడ్జి నడిపిస్తున్నారు అని! ఏదో సందేహాస్పదంగానే అకారణంగా బురదజల్లడం… పక్కా అన్‌ప్రొఫెషనల్… నిజంగానే తల్లీబిడ్డ ఏదో దందా చేస్తుంటే, ఆత్మహత్య చేసుకోవాల్సిన ఖర్మ ఆమెకేమిటి…?

4) ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు తల్లి బయటికి రాకుండా లాక్ చేసి గుడి వైపు పరుగెత్తింది… తరువాత ఇరుగూపొరుగూ లాక్ బ్రేక్ చేసి, ఆమెను బయటికి తీసుకొచ్చారు… సో, ఇవన్నీ అబ్సర్డ్ కథనాలు…

5) తేజస్విని తండ్రి ఈశ్వరరావు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తుండగా, భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాల కారణంగా ఈ కుటుంబం విడిపోయింది. తల్లి, కూతురు ఇద్దరూ ఒంటరిగానే పీర్జాదిగూడలో నివసిస్తున్నారు… సో, కుటుంబ కలహాల ప్రభావం ప్రస్తుతానికి ఏమీ లేదు…

6) గత ఆరు నెలలుగా తమకు రాత్రి పూట భయంకరమైన పీడకలలు వస్తున్నాయని, కలలో రక్తం చిందినట్లు వింత వింత దృశ్యాలు కనిపిస్తూ తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయని తల్లి అరుణ పోలీసులకు తెలిపింది… తల్లి, కుమార్తె ఇద్దరి మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది… సో, తల్లీబిడ్డ మరింతగా మానసిక వైకల్యానికి గురయ్యారని, బిడ్డ అసాధారణ చేష్ట దాని ప్రభావమే అనుకోవాలి ప్రాథమికంగా!! ఏమో, చివరకు పోలీసులు ఏం తేలుస్తారో చూద్దాం…!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వన్డే సిరీస్ చేజేతులా సమర్పయామి ! కొంపముంచిన బౌలింగ్ వైఫల్యం !!
  • ఈ అవార్డు తెలుగు సినిమాకు చాలా ఉపయోగకరం… ఓ భిన్న విశ్లేషణ !
  • అమ్మవారి విగ్రహంతో బరిబాతల చెరువులోకి… అంతుచిక్కని అసాధారణ మిస్టరీ !!
  • సర్! ప్లీజ్ చెప్పండి సర్! నా ‘సర్’ ఏమయ్యింది సర్..?
  • కట్లపాము పెళ్లాం ! ఈసారి మరో కొత్త ఐడియాతో మరో మొగుడు ఖతం !!
  • బన్నీకి మళ్లీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఎందుకు రాలేదు ?!
  • పోసాని మార్క్ వింత విన్యాసం ! సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ !!
  • గగనానికి బాటలు వేస్తూ కొందరు – ‘జంతర్ మంతర్’ గుప్పిట్లో ఇంకొందరు
  • నో నో… ఈ కుందనపు బొమ్మకూ ఆ గణిత మేధావికీ ‘నెత్తుటి సంబంధం’ లేదు !!
  • ఇదేం పైత్యంరా !? లోదుస్తుల చోరీ ఫుటేజ్ చూసి పోలీసులూ విభ్రాంతి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions