Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో పవర్, నో నెట్, నో ఫోన్, నో టీవీ… 17 ఏళ్ల ఏకాంతంలో… ఓ వన్యప్రాణిలా…!!

May 23, 2025 by M S R

.

నో కరెంట్, నో టీవీ, నో బ్రాడ్ బ్యాండ్, నో స్మార్ట్ ఫోన్, నో కనెక్టివిటీ… ఊహించండి… నెవ్వర్, ప్రస్తుత జనరేషన్ అరగంట కూడా తట్టుకోలేదు… అంతెందుకు, దిక్కుమాలిన సోషల్ సైట్లు కొన్ని గంటలు పనిచేయకపోతేనే తల్లడిల్లిపోతాముగా…

మరి అవేవీ లేకుండా, అసలు మనిషి పొడ గిట్టకుండా… అడవిలో… జంతువుల నడుమ ఓ జంతువుగా పదిహేడేళ్లపాటు బతకడం అంటే..?! నమ్మడం లేదు కదా… కానీ నిజమే… ఎక్కడో కాదు, మన పొరుగునే… దక్షిణ కన్నడ జిల్లాలోని అడ్తాలే, నెక్కరే గ్రామాల నడుమ ఈ అడవి… దట్టమైందే…

Ads

అక్కడికి దగ్గరలోని నెక్రల్ కెమ్రాజే ఊళ్లో మన కథానాయకుడు చంద్రశేఖర్‌ గౌడకు ఎకరంన్నర పొలముంది… సారీ, ఉండేది… ప్రశాంతంగా సాగు చేసుకుంటూ బతికేవాడు… దానిపై సహకార బ్యాంకు నుంచి 2003లో 40 వేల రుణం తీసుకున్నాడు…

ఏదో అత్యవసరమై లోన్ తీసుకోవాల్సి వచ్చింది… అదే తన లైఫ్ గిర్రున తిప్పేసింది… సకాలంలో రుణం తిరిగి తీర్చలేదని బ్యాంకు వాళ్లు ఆ పొలం వేలంలో అమ్మిపారేసి, ఆ సొమ్మును జమచేసుకున్నారు… చంద్రశేఖర్ ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు…

jungle

ఒక్కసారిగా మనవాడిలో కోపం, వైరాగ్యం, అసహనం గట్రా పెరిగిపోయాయి… తన అంబాసిడర్ కారు తీసుకుని, విసవిసా అడ్తాలేలోని సోదరి ఇంటికి వెళ్లాడు… ఎంత దగ్గరి బంధువులైనా సరే మొదట్లో మర్యాద ఇస్తారు, అక్కడే ఉంటానంటే కథ వేరే ఉంటుంది కదా…

నాలుగు రోజులకు అర్థమై పోయింది… ఇక అక్కడి నుంచి అడ్డా లేపేసి, అదే కారులో అడవి మార్గం పట్టాడు… అడవిలోకి కారు ఎంత దూరం వెళ్తగలిగిందో అంత లోపలకు వెళ్లాడు… కారు మొరాయించినచోట తనూ ఆగిపోయాడు… ఓ చెట్టు కింద కారు పార్క్ చేశాడు…

ఇక అక్కడే బతకాలని ఫిక్సయిపోయాడు… ఎందుకలా అనిపించిందో ఏమిటో మరి… మరి ఉండటం ఎలా..? ఓ చిన్న గుడారం వేసుకున్నాడు… వెదురు బొంగుల మీద ప్లాస్టిక్ షీట్లు పరిచి, ఓ టెంపరరీ గూడు నిర్మించుకుని, ఇక క్రమేపీ దాన్ని కాస్త లివబుల్ ఇల్లుగా మార్చుకున్నాడు…

మనం ఆయన్ని చూడాలంటే, చేరుకోవాలంటే… మూడునాలుగు కిలోమీటర్లు ఆ జంగిల్‌లో నడవాల్సిందే… తను ఉంటున్న ఆ వెదురు ఇంటి పక్కనే ఓ పాత తెల్లటి అంబాసిడర్ కారు ఇప్పటికీ అలాగే ఉంది… అది కండిషన్‌లో ఉందా..? డౌటే…!

సన్నగా ఉంటాడు, కానీ బలంగానే కనిపిస్తాడు… సగం బట్టతల, పెరిగిన జుత్తు, క్షవరం చేయక, గడ్డం గీయక ఎన్నేళ్లయిందో… రబ్బరు స్లిప్పర్లు, రెండు జతల బట్టలు… దగ్గరలో ఉన్న ఓ చిన్న నీటి ప్రవాహంలో స్నానం చేస్తాడు… పదిహేడేళ్లుగా ఇదే తన జీవితం…

అక్కడ దొరికే తీగెలతో బుట్టలు అల్లి, దగ్గరలోని ఓ ఊరికి తీసుకుపోయి, అమ్మేసి, ఆ డబ్బుతో బియ్యం, చక్కెర గట్రా తెచ్చుకుంటాడు… అవి అయిపోతే వారాల తరబడీ కేవలం ఆ అడవిలో దొరికే పండ్లు తిని బతికాడట… ఏనుగులు, తోడేళ్లు, అడవి పందులు, చిరుతలు, జింకలు గట్రా కనిపిస్తుంటాయి…

ఎప్పుడూ మీదపడి దాడి చేయలేదు… ఐనా తను కూడా వాటి నడుమ ఓ జంతువే కదా ఇప్పుడు..! ఇప్పుడాయన వయస్సు యాభై ఆరేళ్లు… ఎప్పటికైనా తన ఎకరంన్నర పొలాన్ని మళ్లీ కొనుక్కుంటాను అంటాడు… తన ఓనర్‌షిప్ కాగితాలు భద్రపరుచుకున్నాడు…

ఆధార్ కార్డు గట్రా ఏమీ లేవు… కానీ తన కథలో బాగా నచ్చిన విశేషం ఏమిటయ్యా అంటే… ఆమధ్య అరంథోడ్ గ్రామపంచాయతీకి చెందిన ఆరోగ్యసిబ్బంది అక్కడి దాకా చేరుకుని కరోనా వేక్సిన్ వేశారు… వావ్…  (Source, Credits :: DNA) (ఇది అక్టోబరు 2021 నాటి స్టోరీ… ఇప్పుడూ అక్కడే ఉన్నాడా అనడక్కండి ప్లీజ్… తెలియదు… అసలు అలా బతకగలమా అనే విస్మయాలోచన మరోసారి దీన్ని గుర్తుచేసేలా చేసింది…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Ace..! ఓ నాన్ సీరియస్ స్టోరీ లైన్‌కు అక్కడక్కడా కాస్త కామెడీ పూత…
  • ‘ఉచిత ప్రలోభాల’ పార్టీలు చదవాల్సిన ‘కర్నాటక సర్వే’ ఫలితాల కథ..!!
  • AI … కొలువులే కాదు, ప్రాణాలూ తీస్తోంది… బహుపరాక్‌‌…
  • ఛాలెంజ్..! ‘మెదడుకు మేత’ నవలను సినిమాకరించడం ఛాలెంజే..!!
  • కూలిపోతున్న మినీ బంగ్లాదేశ్… కానీ ఇలాంటివి దేశంలో కోకొల్లలు..!!
  • నో పవర్, నో నెట్, నో ఫోన్, నో టీవీ… 17 ఏళ్ల ఏకాంతంలో… ఓ వన్యప్రాణిలా…!!
  • ఎస్.., ఓ అవకాశం ఇవ్వాల్సిందే..! ధిక్కార తూటా శాంతిమంత్రం..!!
  • చార్‌ ధామ్ కాదు… ఇది పంచ కేదార్..! వెరీ ఇంట్రస్టింగ్ కారిడార్..!
  • ఒక మనిషి మరణించబోతున్నాడు… దేవుడొచ్చాడు చేతిలో ఓ పెట్టెతో…
  • రమ్యకృష్ణ నిజమే చెప్పింది…. మళ్లీ లైంగిక దోపిడీ వార్తల్లోకి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions