.
సీహెచ్ రాజేశ్వరరావు… తను సీఎంపీఆర్వోగా చేశాడు నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… అప్పటికి నేను ఏదో ఓ మారుమూల సెంటర్‌కు ఈనాడు కంట్రిబ్యూటర్‌ను… అప్పుడప్పుడే జర్నలిజంలో ఓనమాలు దిద్దుతూ ఉండి ఉంటాను బహుశా…
తరువాత కొన్నాళ్లకు హైదరాబాద్ స్టేట్ జనరల్ బ్యూరో రిపోర్టర్‌గా హైదరాబాద్ వచ్చాక, ఓ మాజీ సీఎంపీఆర్వోతో కలిసి ఓ రాత్రి వాళ్ల ఇంటికి వెళ్లాను… కర్టెసీ కాల్ కోసం… తను మంచి హోస్ట్.., నచ్చిన వాళ్లకు…
.
తను ఎక్కువగా మాట్లాడడు… తన తత్వమే అది… ఆ రాత్రి పరిచయాలయ్యాక కాసేపటికే ‘‘ప్రస్తుతం ఏం చదువుతున్నారు‘’ అనడిగాడు… అర్థం కాలేదు… ప్రశ్నార్థకంగా ఉన్న నా మొహం చూసి, ‘‘ఏం పుస్తకం చదువుతున్నారు’’ అని క్లారిటీ ఇచ్చాడు…
.
నేనసలే బిత్తిరి సత్తి మాస్ టైపు కదా… నా భాష, నా లుక్కు, నా డ్రెస్సు, నా జ్ఞానం, నా అప్రోచ్… అన్నీ… యండమూరివి, మల్లాదివి, మధుబాబువి కాసిన్ని పుస్తకాలు చదివి ఉంటాను అప్పటికి… అంతే… రాజేశ్వరరావేమో నేనేదో ఇంగ్లిష్ పుస్తకం పేరు చెబుతానని ఆశపడ్డట్టున్నాడు… ప్చ్… ఇంగ్లీష్ ప్రెస్ నోట్ నాలుగుసార్లు చదివితే తప్ప జీర్ణం గానీ జ్ఞానం నాది అప్పట్లో… (అఫ్‌కోర్స్, ఇప్పటికీ పూర్ పూరర్ పూరెస్టు)…
.
కొత్తగా పరిచయమైన వాళ్లను ఆయన అడిగే మొదటి ప్రశ్న పుస్తకం గురించే… చదివే పుస్తకాన్ని బట్టి పాఠకుడి తత్వాన్ని అంచనా వేయొచ్చు అనేవాడు తను… ఒకవేళ మాంచి లోతున్న ఏదో ఇంగ్లిష్ పుస్తకం పేరు చెప్పి, దాని మీద చర్చ మొదలుపెడితే ఇక ఆ సంభాషణకు ఎండ్ ఉండదు…
.
నాతో వచ్చిన మాజీ సీఎంపీఆర్వోకు మరీ పుస్తకాలంటే ఎలపరం… అఫ్‌కోర్స్, అర్థం కావు తనకు… నేనే కాస్త నయం… సో, కాసేపు తీర్థపారాయణం, ప్రసాదసేవనం తరువాత… మళ్లీ చాన్నాళ్లకు ఒకసారి కలిశాం… మనతెలంగాణ పత్రికకు అంబుడ్స్‌మన్‌గా పెడితే, ఓసారి ఆఫీసుకు వచ్చాడు… ఫలానా రోజు మిమ్మల్ని కలిశాను సార్ అని గుర్తుచేశాను… నేను పెద్దగా గుర్తుండిపోయే కేరక్టర్ కాదు గనుక, ఆయనకూ గుర్తురాలేదు గనుక, ఓహో, అలాగా అన్నట్టు ఓ జీవం లేని చిరునవ్వును బదులుగా ఇచ్చాడు…
.
జర్నలిస్టు సర్కిళ్లలో అమితమైన గౌరవం ఉండేది ఆయనంటే… హెచ్ఎంటీవీలో కూడా కొన్నాళ్లు అంబుడ్స్‌మన్‌గా ఉన్నట్టున్నాడు… అపారంగా చదివాడు… ఎన్ని పుస్తకాలు నమిలేశాడో బహుశా ఆయనకూ లెక్క తెలిసి ఉండదు… అన్నిరకాల సాహిత్యం మీద మస్తు అవగాహన ఉండేది… ఆయన సీఎంపీఆర్వోగా ఉన్నప్పుడు రజాహుస్సేన్ కూడా పీఆర్వోగా చేసినట్టు గుర్తుంది…
.
రాజేశ్వరరావు మరణవార్త విన్నాక ఇవన్నీ గుర్తొచ్చాయి… కలిసింది రెండేసార్లు… కానీ ‘తను నాలాంటి జర్నలిస్టులకు ఎన్నడూ అందని ఎత్తులోనే బతికాడు… ఆర్థికంగా కాకపోవచ్చు, కానీ జ్ఞానపుష్టిలో… ఆ ఒక్క రాత్రి భేటీ మాత్రం మెమరబుల్… (అవును, ఫేస్‌బుక్ వాడు రెండేళ్ల క్రితం పోస్టు గుర్తుచేశాడు… అఫ్‌కోర్స్, అది స్వర్గమే అయినా సరే, అక్కడ పుస్తకాల లైబ్రరీ లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేడు తను అక్కడ…)
Ads
Share this Article