.
హిందుస్థాన్ టైమ్స్ అసాధారణ రీతిలో తన మాస్ట్ హెడ్‌ను మార్చేసి, మొన్న రజినీకాంత్ టైమ్స్ అని మార్చేసింది… ఓ ఫుల్ పేజీలో తను బొమ్మ… తనకు లభించిన అనేక పురస్కారాలు, అవార్డులు గట్రా రాసిన అక్షరాలతోనే ఆ బొమ్మ… విభిన్నమైన పేజీనేషన్… HT అని లోగో ఉన్నట్టుగానే RT అనే అక్షరాలు…
అన్నింటికీ మించి… మనం రజినీకాంత్ సుప్రీమసీ మీద బోలెడు జోకులు చదువుతూ ఉంటాం కదా… సేమ్ అలాంటిదే అత్యోక్తి… యాభై ఏళ్ల కాలం తనను లెజెండ్‌గా చేయలేదట… తనే గత యాభై ఏళ్ల కాలాన్ని లెజెండరీగా మార్చాడట…
Ads
కానీ, చూడగానే ఆకట్టుకునేలా డిజైన్… అన్నింటికీ మించి రజినీకాంత్ టైమ్స్ అన్న నేమ్ ప్లేట్, టైటిల్… అదే మాస్ట్ హెడ్… అబ్బో, ఓ పత్రిక తన వందేళ్ల పాత్రికేయ చరిత్రలో తొలిసారిగా 50 ఏళ్ల నటజీవితం పూర్తి చేసుకున్న రజినీకాంత్‌కు అరుదైన గౌరవాన్ని చాటిచూపించింది అని ఒకటే పొగడ్తలు…
జాలిపడాలో, నవ్వాలో తెలియని స్థితి… ఎందుకంటే..? అదే హిందుస్థాన్ టైమ్స్ సొంతంగా తీసుకున్న ఎడిటోరియల్ నిర్ణయం కాదు, తను సొంతంగా రజినీకాంత్‌కు సమర్పించిన సగౌరవ పుష్పాంజలి ఏమీ కాదు… అమెజాన్ ప్రైమ్ వీడియో, ఓటీటీ ప్లే ఇచ్చిన యాడ్ మాత్రమే… పైగా రజినీకాంత్ అభిమానులందరి తరఫున జారీచేయబడిన పబ్లిక్ ఇంట్రస్ట్ యాడ్ అట… అదొక అత్యోక్తి…
దీనికి వందేళ్ల పత్రిక, యాభై ఏళ్ల నటజీవితం, ఇదొక పాత్రికేయ పురస్కారం, నట స్వర్జోత్సవం సెలబ్రేషన్ అనే డొల్లు మాటలు, శుష్క ప్రశంసలు, ఉత్తుత్తి చప్పట్లు దేనికి..?

ఎస్… ఎక్కడో కర్నాటకలో పుట్టిన ఓ సాధారణ బస్సు కండక్టర్… యాభై ఏళ్లు వైభవోపేతంగా తమిళ ఇండస్ట్రీని ఏలడం మామూలు విషయమేమీ కాదు… అదీ ఓ సాదాసీదా రూపంతో… అది తన ఘనతే… ప్రపంచవ్యాప్తంగా తనకున్న అభిమానులు, తనకు దక్కే ఆదరణ కూడా మరే హీరోకూ లేరు, లేదు…
ఐతే అదేమీ హిందుస్థాన్ టైమ్స్ సమర్పించిన పురస్కారం ఏమీ కాదు, డబ్బు కక్కుర్తితో ఓటీటీ ప్లే ఇచ్చిన యాడ్‌ను యథాతథంగా అచ్చేసింది… జస్ట్, ఓ ఆర్థిక వ్యవహారం మాత్రమే ఇది…
కానీ, ఈ డబ్బు కోసం… వ్యక్తి పూజను మరింత పెంచేలా… తన కిరీటంగా భావించే మాస్ట్ హెడ్‌ను మార్చేయడమే అభ్యంతకరం అనిపిస్తోంది జర్నలిస్ట్ సర్కిళ్లలో..! అఫ్కోర్స్, యాడ్స్ పబ్లిష్ చేయడంలో అనేక పత్రికలు అనేక రకాల పిచ్చి పోకడలను కనబరుస్తున్నాయి… తెలుగు పత్రికలైతే లెక్కకు మిక్కిలి ఫస్ట్ పేజీలను, మాస్ట్ హెడ్లతో సహా పబ్లిష్ చేస్తుంటాయి… కానీ ఏకంగా మాస్ట్ హెడ్ మార్చడమే విభ్రాంతికరం…
ఈ సమర్పణ ఆ పత్రికకు తొలిసారి కావచ్చుగాక… కానీ చాలా పత్రికలు ఎంత పెద్ద వార్త, ఎంత సంతాప వార్త అయినా సరే, మాస్ట్ హెడ్‌ను ఇంచ్ కూడా కిందకు దించవు… మరి అంత పేరున్న హిందుస్థాన్ టైమ్స్ కూడా నాలుగు డబ్బుల కోసం ఎందుకు తననుతానే దిగజార్చుకుంది..? ఆశ్చర్యమే…
ఎస్, రజినీకాంత్ అభిమానులు ఈ గౌరవంపై అత్యంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు… రజినీకాంత్ స్వయంగా ఈ “అద్భుతమైన సర్ప్రైజ్” పట్ల కృతజ్ఞతలు తెలియజేసి, తన హృదయం ఆనందంతో నిండిపోయిందని ట్వీట్ చేశాడు… సహజం… కానీ హఠాత్తుగా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఓటీటీ ప్లే సంస్థలకు రజినీకాంత్ మీద అంత అభిమానం ఎందుకు పోటెత్తిందో..?!
మరి అమితాబ్ వంటి స్టిల్ సూపరెస్ట్ స్టార్‌కు ఇలాంటి ఎన్ని చిత్ర పేజీల పురస్కారాలు దక్కాలి..? ఇక ఇప్పుడు దీన్ని ఓ మోడల్‌గా చూపించుకుని… ప్రతీ డబ్బు కక్కుర్తి పత్రిక ఇతరత్రా స్టార్లతో సేమ్ ప్రయోగాలు చేస్తాయేమో ఇక..!! సార్, సార్, కాస్త మాస్ట్ హెడ్‌కు కాస్త శాంటిటీ (Sanctity) ఉంటుంది, దాన్ని గౌరవించండి సార్ ముందుగా..!! డబ్బు ముఖ్యమే కానీ… కాస్త సెల్ఫ్ రెస్పెక్ట్, మాస్ట్ హెడ్ వాల్యూ కూడా ఒకటి ఏడుస్తుందని గమనించండి సార్..!!
Share this Article