.
తల్లి వింత కోరికలను నెరవేర్చిన కుమారులు
పెడన మండలం ముచ్చర్ల గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో రక్త సంబంధాలు, బంధాలు, బంధుత్వాలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. బతికున్న సమయంలోనే కుటుంబ సభ్యులను వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకుండా వదిలి పెట్టిన, వృద్ధాశ్రమాలలో చేర్పించిన ఘనులు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి.
Ads
కంప్యూటర్ యుగంలో అందరూ బిజీగా ఉండి డబ్బుకు విలువిస్తున్నారు తప్ప బంధానికి, బంధుత్వానికి విలువ ఇవ్వడం లేనని కొంతమంది వాపోతున్నారు. రక్తసంబంధం కలిగిన అన్నదమ్ములే డబ్బు కోసం కొట్లాడుకొని విడిపోయే ఘటనలు కూడా నిత్య జీవితంలో చూస్తూనే ఉన్నాం.
పెడన మండలం ముచ్చర్ల గ్రామంలో రంగమ్మ అనే వృద్ధురాలు కోరిక స్థానికులను ఔరా అనిపించింది. వయస్సులో ఉన్న సమయంలో డబ్బు సంపాదించి కుమారులకు ఆస్తులను కూడగట్టి ఇచ్చింది. ఇప్పుడు ఆమె వృద్ధాప్యంలో ఉంది. అయితే ఆ వృద్ధురాలు మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని తన కుమారులతో మాట్లాడింది.
ఆమె బతికి ఉన్న సమయంలో కుమారులు తల్లి కోసం వంతులేసుకోవడం చూసి, ఆమె మనసు గాయపడినట్లు అనిపించింది. ఇదే తరువాయి నేటితరం కుమారులను చూసినా ఆమె తనకు వచ్చిన ఆలోచన మంచిదే అని అనిపించింది.
తన కుమారులను పిలిపించుకొని, ఆమె మరణ అనంతరం ఆమె పెదకర్మ అనంతరం నిర్వహించే భోజనాలు తన కుమారులు నిర్వహిస్తారా? నిర్వహించరా? ఒకవేళ నిర్వహిస్తే ఘనంగా నిర్వహిస్తారా? లేక తూతూ మంత్రంగా నిర్వహిస్తారా? ఎలా నిర్వహిస్తారో అని భయపడి, ఆమె మదిలో పుట్టిన ఆలోచన ను కార్యరూపం దాల్చాలని కుమారులకు ఆర్డర్ వేసింది.
ఆమె బతికుండగానే ఆమె పెద్దకర్మ అనంతరం నిర్వహించే భోజనాలు గ్రామంలో కుమారులు ఎలా నిర్వహిస్తారో తను చూడాలనుకుంది. ఆ గ్రామంలో గొప్పగా జీవించిన ఆ తల్లి పెద్దకర్మ అనంతర భోజనాలు గ్రామ ప్రజలకు సరిగ్గా పెడతారో లేరోనని భావించి తన కుమారులను పిలిపించి ఆమె బతికి ఉన్న సమయంలోనే పెద్ద కర్మ భోజనాలు నిర్వహించాలని ఆజ్ఞాపించింది.
ఇలాంటి కోరిక ఒక తరహా కొత్తదే కావచ్చు కానీ వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లి చివరి కోరిక ను గౌరవించడం తమ కర్తవ్యం గా భావించారు కుమారులు. ఇదే మొదలుకొని ఆ కుమారుల తల్లి పెద్దకర్మ సమయంలో నిర్వహించే భోజనాలు గ్రామంలో నిర్వహించే విధంగా గ్రామస్తులకు ఆహ్వానాలు అందించారు.
భోజనాలు గొప్పగా ఉండాలని భావించినా తల్లి బతికి ఉండగానే యాట మాంసం, కోడి జాయింట్ , చేపలు, రొయ్యల కూరతో ఘుమఘుమలాడే బిర్యానీతో గ్రామస్తులకు విందును ఏర్పాటుచేసి భోజనం పెట్టారు. ఆ వృద్ధురాలు బతికి ఉండగానే పెద్దకర్మ సమయంలో నిర్వహించే భోజనాలు నిర్వహించి తన తల్లి కోరికను కుమారులు తీర్చి ఆనందాన్ని కలిగించారు… (ఒక వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించిన వార్త, ఫోటో… యథాతథంగా…)
Share this Article