Priyadarshini Krishna….. ఇంతకుముందు చాలాసార్లు నేను అన్నాను, మళ్ళీ చెప్తున్నాను… సినిమా రివ్యూ అంటే సినిమాలోని ఇతివృత్తం లేదా కథని విశ్లేషించడం, పాత్రల పోకడను, దర్శకుడు ఆయా పాత్రలని మలిచిన తీరుని , ఆయా పాత్రలను పోషించిన నటుల నటనాచాతుర్యాన్ని చర్చించడం కాదు.
ప్రేక్షకునికి ఆ సినిమాని పూర్తిగా పరిచయం చెయ్యడం. సినిమాలోని వివిధ విభాగాలు ఆ సినిమాలో ఎలా మెరుగైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దాయి అనే అంశాలను చర్చించడాన్ని రివ్యూ అనాలి. ఇవాళ్టి వరకు తప్పడ్ సినిమాపై ఏఫ్బీ లో వచ్చిన అనేకానేక వ్యాసాలు కేవలం కథని, అందులోని పాత్రలు, ఔచిత్యాలను పోకడలు వంటి అంశాలపై థీసీస్లు సమర్పించారు.
ఉప్మా వండి దానిని పులిహోరా అనలేము, ఎందుకంటే మనకి చాలా కాలంగా పులిహోర మాత్రమే కాదు ఉప్మా కూడా తెలుసు.
Ads
అలాగే బిర్యానీ వండి దానిని పులిహోర అని నమ్మించలేము. మనకి అది కూడా తెలుసు కాబట్టి.
మేఘసందేశం రాసి అది కుమారసంభవం అనలేము, మోనాలిసా పెయింటింగ్ వేసి వన్ గో వర్క్ అనలేము. ఎందుకంటే అవి విశ్వ విఖ్యాతాలు.
ఒక ప్రోగ్రెసివ్ కవి రాసిన కవిత్వాన్ని ఏంటీ ఈ కవిత్వం శ్రీశ్రీ ఇలా రాయలేదు. కృ. శా కూడా ఇలా రాయలేదు అని ఒక చట్రంలో బిగించి కొలవలేము. పైపెచ్చు ఆహా ఓహో అనగలం. అలాగే ఒక మేధావి రాసిన నవలని ఇదేం రాత, రంగనాయకమ్మలా రాయలేదు, వడ్డెర చండీదాస్ లా రాయలేదు అనం. ఎందుకంటే అది ఆ రాసినవారి సృజన. వారి ఊహాపోహ శక్తికి తగినట్లు ఇతివృత్తాన్ని మలిచి పాత్రలని పుట్టించి, వాటికి తగిన సన్నివేశాలని కల్పిస్తారు.
అలాంటి నవళ్లను చదువుతాం నచ్చితే ఫ్రెండ్స్ ని చదవమంటాం, లేకుంటే టైం వేస్ట్ అని చెప్తాము. ఒక నవల గురించి ఆ నవలలోని కథాకథనం సన్నివేశాలు, పాత్రల గురించి ఎలాగైతే ఈకలు పీకమో అలాగే ఒక పెయింటింగ్ గురించి, ఒక కవిత గురించి పుంఖానుపుంఖాలుగా థీసిస్లు రాయము. రచయిత, చిత్రకారుడు రాయని, వేయని subtext లను మనకి మాత్రమే తెలిసినట్లు చెప్పము.
కానీ …. సినిమా విషయానికొస్తే మాత్రం మనందరం ఆటాప్సి డాక్టర్లమే…!!
దర్శకుడు ఒక ఇతివృత్తాన్ని ఎంచుకుని అది జనాల మెప్పు పొందాలి అనే ఆలోచనతోనే డెవలప్ చేసి సీన్లను స్క్రీన్ప్లే ని తయారు చేస్తాడు . దానికి ఒక టీమ్ ఉంటుంది నెలల తరబడి కసరత్తు చేస్తారు. అది అందమైన దృశ్యకావ్యం అవుతుందా కాదా అనేది వివిధ అంశాలమీద ఆధారపడి ఉంటుంది. అయితే పునాది మాత్రం కథ, కథనం, పాత్రలదే.
Share this Article