ఒక కథ… ఫేస్‌బుక్‌లోనే కనిపించింది… అలా బోలెడు కథలున్నయ్… ఇదే ఎందుకు ఆకర్షించింది అంటే… మనం కాలం వెళ్లదీస్తున్నవి గడ్డురోజులు కాబట్టి… మనకు తెలియని ఏదో అంశం మన బతుకుల్ని, వాటి గతుల్ని నిర్దేశిస్తున్నట్టుగా అనిపిస్తున్నది కాబట్టి… మనిషిని ఈ గడ్డుకాలం కాస్త వైరాగ్యం వైపు నెట్టేస్తున్నది కాబట్టి… మన చేతుల్లో ఏముంది అనే ఓరకమైన విరక్తిని నింపుతున్నది కాబట్టి… ఇది కథ ఎవరు రాశారో తెలియదు… (తెలిస్తే బాగుండు… తెలియకపోయినా సరే, ఆ అజ్ఞాత రచయితకు ధన్యవాదాలు, ఆకట్టుకునే శైలిలో రాసినందుకు…)… నిజానికి పెద్ద కథే… దేవుడున్నాడనే భ్రమనో, నిజాన్నో చెప్పేందుకు ప్రయత్నించే కథ… ఇలా జరిగిందో లేదో చెప్పుకోవడం అనవసరం, ఎందుకంటే… ఇది కథ కాబట్టి… జరిగితే బాగుండు అనుకుంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే, నిజంకన్నా కల్పన బాగుంటుంది కాబట్టి… ఎహె, ఈ ఉపోద్ఘాతం అంతా దేనికి..? కథ చదవండి, ఎవరెలా స్వీకరించినా నో ప్రాబ్లం…
అది 1976 నవంబర్ 11 వ తేదీ, న్యూఢిల్లీ …
Ads
ధ్యానం అయిపోయాక గౌరీ పరమేశ్వర్ ఫోను చేసిన విషయం చెప్పింది. వైద్యనాథ్ పరమేశ్వర్ తో మాట్లాడి హుటాహుటిన రామేశ్వరం ప్రయాణమయ్యాడు …
Share this Article