.
ఈయన పేరు డాక్టర్ శిరీష్ వల్సంగ్కర్… వైద్యుడు… సర్జన్… ఈ వైద్యుడితో ఆపరేషన్ చేయించుకోవడానికి మహారాష్ట్రలోని వేలాది మంది రోగులు నెలల తరబడి ఎదురుచూస్తుంటారు….. షోలాపూర్ రత్నం తను..,
అపారమైన సంపద, ప్రతిష్ట, తెలివితేటలకు ప్రతీక… పది మందికీ బతుకును, ధైర్యాన్ని ఇవ్వగలిగిన స్టేటస్… కానీ ఈ ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ శిరీష్ వల్సంగ్కర్ గత నెలలో లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు…
Ads
షోలాపూర్ జిల్లాలో సొంతంగా చార్టర్డ్ విమానం ఉన్న ఏకైక వ్యక్తి ఆయన… శుక్రవారం రాత్రి, అతను తన కుటుంబంతో కలిసి భోజనం చేసి, తన గదికి వెళ్ళాడు, బాగానే ఉన్నాడు… కానీ ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత, డాక్టర్ వల్సంగ్కర్ తలకు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వైద్యులు అతన్ని కాపాడటానికి తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ చివరికి, అతను ప్రాణాలు కోల్పోయాడు…
తన హాస్పిటల్ పేరు వల్సంగ్కర్ ఎస్‌పి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్… సోషల్ ఈవెంట్లలో పాల్గొనేవాడు, విమానాలు నడపడం మీద ఆసక్తి, తరచూ టీవీ షోలలో న్యూరాలజికల్ ఇష్యూస్ మీద మాట్లాడేవాడు, సూచనలు ఇచ్చేవాడు… పెద్ద సోషల్ సర్కిల్ తనది…
కొడుకు కూడా న్యూరాలజిస్టే… అశ్విన్ వల్సంగ్కర్… కోడలు సోనాలి కూడా న్యూరాలజిస్టే… వాళ్లే హాస్పిటల్ నిర్వహణను చూస్తున్నారు ఈమధ్య… ఒక్క క్షణం ఆలోచనలు అదుపు తప్పాయి… కారణాలు ఏవైనా గానీ ప్రాణాలు తీసుకున్నాడు… తన అంత్యక్రియలకు వేలాది మంది హాజరయ్యారు… ఇదే ఇక్కడ చెప్పదలచుకున్నది…
సంపద, పేరు, చదువు, సర్కిల్ అన్నీ ఉన్నా సరే… అవేవీ నిజమైన శాంతిని ఇవ్వలేకపోతున్నాయి… ఏదో ఓ దుర్బలమైన క్షణం, పరిస్థితులను ఎదుర్కోలేని ఆలోచన ఇలా మనిషిని బలిగొంటుంది… అసలు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు..? పోలీసులు చెప్పే కారణాలు ఏమిటంటే..?
2008లో ఆయన మనీషా మహేష్ మానే అలియాస్ ముసాలే అనే మహిళను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా తీసుకున్నాడు… మంచి జీతం… ఎక్కువగా నమ్మేవాడు… దాంతో ఆమె హాస్పిటల్ నిధుల్ని అక్రమంగా వాడుకోవడం, ఇతర ఖాతాలకు మళ్లించడం మొదలుపెట్టింది… మూడు బ్యాంకు ఖాతాలున్నాయి… అన్నీ సందేహాస్పద లావాదేవీలే…
ఒక ఖాతాలో 39 లక్షలున్నాయి… ఎక్కడి నుంచి వచ్చాయనేదీ సందేహాస్పదమే… ఆమె తన యజమానికి, హాస్పిటల్ బాధ్యతలు చూస్తున్న ఆయన కొడుక్కి మెయిల్స్ పెట్టింది… తనను నమ్మడం లేదు, మందలించారు, జీతంలో కోతపెట్టారు, నేను నా ఇద్దరు కొడుకులతో వచ్చి హాస్పిటల్‌లోనే సూసైడ్ చేసుకుంటాను ఆ మెయిల్స్‌లో బెదిరించింది…
హాస్పిటల్ బాగోతాలన్నీ బయటపెడతానని పేర్కొంది… తెర వెనుక ఏముందో గానీ డాక్టర్ ఓ నోట్ రాసి, అందులో సదరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పేరు కూడా రాసి సూసైడ్ చేసుకున్నాడు… ఇప్పుడు ఆమె ఏం చెప్పి తనను బెదిరించిందో తెలుసుకోవడానికి ఆమెను మొన్న అరెస్టు చేశారు… సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించిందనేది ఆరోపణ…
ప్చ్… వేల మందికి న్యూరాలజికల్ ఇష్యూస్‌లో వైద్యం చేసి, టీవీ షోలలో జనానికి సూచనలు చేసి, ఉత్తమ న్యూరాలజిస్టుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఓ పతకం, పురస్కారం కూడా తీసుకున్న ఆయన అదే న్యూరాలజికల్ అప్‌సెట్‌తో సూసైడ్ చేసుకోవడమే ఓ పారడాక్స్… ఐరనీ … కొడుకుకోడళ్లు కూడా న్యూరాలజిస్టులే..!!
Share this Article