.
నిజంగా ఇదొక విశేషమే… తెలుగు టీవీల్లో వినోద కార్యక్రమాల్ని వీక్షించేవారికి..!
తెలుగు టీవీ కార్యక్రమాల్లో మస్తు పాపులర్ జంట సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి గౌతమ్… ఎప్పుడో ఏదో సందర్భంలో రేటింగ్స్ కోసం వారి నడుమ ప్రణయగాథను క్రియేట్ చేశారు ఈటీవీ క్రియేటివ్ టీమ్…
Ads
ఓసారి పెళ్లి కూడా చేశారు ఏదో ప్రోగ్రాంలో… సూపర్ హిట్… కలిసి కామెడీ స్కిట్లు చేస్తారు, కలిసి యాంకరింగ్ చేస్తారు, హోస్టింగ్… కలిసి డాన్సులు చేస్తారు, ఎత్తిపొడుపులు, ప్రణయ ఆలింగనాలు… అన్నీ వీక్షకులకు నచ్చాయి, నచ్చుతున్నాయి…
ఎన్నేళ్లుగా… దాదాపు తొమ్మిదీ పదేళ్లుగా..! అసలు ఇన్నేళ్లుగా ఎవర్ గ్రీన్ అండ్ నెవర్ ఎండింగ్ ఆర్టిఫిషియల్ టీవీ లవ్ స్టోరీ బహుశా వీళ్లదే అనుకుంటా… వాళ్లే బోలెడు ఇంటర్వ్యూల్లో, ప్రోగ్రాముల్లో చెప్పారు… మాది టీవీ వీక్షకుల కోసం క్రియేట్ చేయబడిన స్టోరీయే తప్ప తమ మధ్య అందరూ అనుకునే ఆ లవ్ బంధం ఏమీ లేదనీ, కాకపోతే ఒకరినొకరు గౌరవించుకునే గాఢమైన స్నేహం ఉందని…
ఎన్ని జంటలను కలిపినా… ఎన్ని వేషాలు వేసినా సరే ఈ రేంజ్ లవ్ స్టోరీని మళ్లీ ఏ టీవీ కూడా క్రియేట్ చేయలేకపోయింది… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..?
సుధీర్ ఈటీావీ నుంచి వెళ్లిపోయాడు… సినిమాలు, వేరే టీవీల్లో షోలు హోస్ట్ చేస్తుంటాడు… సినిమాల మీద పిచ్చితో టీవీని వదిలేయకుండా… టీవీలో కంటిన్యూ అవుతూనే ఉంటాడు… తనను ఓ ప్లేబాయ్‌గా చిత్రించే స్కిట్లు, షోలలోనూ ఎంజాయ్ చేస్తాడు, ఎంటర్‌టెయిన్ చేస్తాడు…
రష్మి ఈటీవీకి ఆస్థాన యాంకర్… అనసూయ వెళ్లిపోయాక ఇక ఆమెదే రాజ్యం… జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ హోస్ట్ ఆమే… చాలా మంది యాంకర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ రష్మి లోకల్… ఐనా సరే, ఈరోజుకూ రేటింగ్స్ కావాలీ, టీవీ షోకు అదనపు అట్రాక్షన్ కావాలంటే మళ్లీ రష్మి, సుధీర్‌లే కావల్సి వచ్చారు ఈటీవీకి..
సంక్రాంతికి ఏదో స్పెషల్ షో ప్లాన్ చేశారు… అందులో కూడా మళ్లీ రష్మి, సుధీర్ ప్రేమకథ పెట్టారు… బాగుంది… నిజానికి వాళ్ల రొమాన్స్, వాళ్ల లవ్ ఎవర్ గ్రీన్… ఎవర్ ఎంటర్‌టెయినింగ్… ఆ కెమిస్ట్రీ మరే జంటలోనూ కనిపించదు…
ఇన్నేళ్లయినా, నిజం కాదని తెలిసినా జనం వాళ్ల ప్రేమను ఆశీర్వదిస్తూనే ఉన్నారు, ఆనందిస్తూనే ఉంటారు… లక్కీ పెయిర్… ఇద్దరికీ పెళ్లి కాలేదు(ట)… బహుశా ఎవరికి పెళ్లయినా ఈ కథకు ఇక శుభం కార్డు పడేదేమో…
ఇదే ప్రోమోలో హైపర్ ఆది పుష్ప2 స్పూఫ్ చేశాడు… ఆ జాతర వేషం సహా… కుదిరాయి, బాగా చేశాడు… కానీ ఏ స్కిట్ చేసినా దొరబాబు రాగానే అప్పట్లో జైలు, విడిపించడం ప్రస్తావించాల్సిందేనా…? పాత్రలు ఉండాలి స్కిట్‌లో… పాత్రధారులు కాదు..! పాత్రధారుల వ్యక్తిగతాలు జొరపడొద్దు స్కిట్‌లోకి హైపర్ ఆది ఈ విసయంలో అస్సలు మారడు, మారలేడు…
ఫైమా రష్మిక వేషం వేయడంతో స్కిట్ బాగా వచ్చినట్టుంది… చూశారుగా పైన ఫోటో… ఫైమా కాలితో గడ్డం తడుముకుంటున్న హైపర్ ఆదిని… అన్నట్టు… అనసూయ వేసిన దాక్షాయణి వేషం శాంతిస్వరూప్ చేశాడు… హహహ… ఫాఫం అనసూయ..!! #anasuya #sudigalisudheer #hyperaadi #rashmigautham #rashmisudheer
Share this Article