Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ పాకిస్థానీ గూఢచారి (స్పై) దొరికాడు… కానీ ఒప్పుకోవడం లేదు

July 18, 2026 by M S R

.

కాలమ్ దాటని కథ…
ఓ పాకిస్థానీ గూఢచారి (స్పై) దొరికాడు… కానీ ఒప్పుకోవడం లేదు తను గూఢచర్యం చేస్తున్నానని… ‘రా’ ఆఫీసులోని ఓ సెల్‌లో పారేశారు… తరువాత ఓ భారీ పర్సనాలిటీ (ఆఫీసర్) ఇంటరాగేషన్‌కు వచ్చాడు… ఎదురెదురుగా కూర్చున్నారు… ఆ గూఢచారి భయాన్ని, వినయాన్ని నటిస్తున్నాడు…

ఆఫీసర్ :: చెప్పు, నీతోపాటు ఇంకా ఎందరు పనిచేస్తున్నారు ఇక్కడ..? ఎవరెవరు..? ఎక్కడెక్కడ ఉంటారు..?
స్పై :: సార్, నన్ను నమ్మండి సార్, నేను ఇండియన్‌నే… కావాలంటే నా జేబులో డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు చూడండి, వదిలేయండి సార్…
ఆఫీసర్ :: నేను నమ్మను, నువ్వు గూఢచారివే

Ads

స్పై :: ఎలా నమ్మించాలి సార్, మన రాష్ట్రపతుల పేర్లు వరుసగా చెబుతాను, ఇవిగో పేర్లు, వాళ్ల పుట్టినరోజులు, వర్ధంతులు…
ఆఫీసర్ :: నేను నమ్మను, నువ్వు గూఢచారివే
స్పై :: అయ్యో సార్, ఇదుగో మన ప్రధానుల పేర్లు, జయంతులు, వర్ధంతులు…
ఆఫీసర్ :: నేను నమ్మను, నువ్వు గూఢచారివే

స్పై :: కాదు సార్, నేను ఇండియన్‌నే అని ఎలా నమ్మించాలి ఇక..? వందేమాతర గీతం, జాతీయ గీతం పాడుతున్నాను, వినండి, ఎవరు రాశారో చెబుతున్నా, జెండా రూపకర్త ఎవరో చెబుతున్నా…
ఆఫీసర్ :: నేను నమ్మను, నువ్వు గూఢచారివే
స్పై :: మన రాజ్యాంగ పీఠికలో ఇలా రాసి ఉంది, చదువుతున్నా వినండి, మన మొత్తం రాష్ట్రాలు, రాజధానుల పేర్లు ఇవిగో…
ఆఫీసర్ :: నేను నమ్మను, నువ్వు గూఢచారివే

ఇక గూఢచారికి చిరాకెత్తింది, మొండి ధైర్యం వచ్చేసింది…
‘‘అవును, నేను గూఢచారినే, ఇంతకీ నేను ఇన్ని చెప్పినా నువ్వు నమ్మలేదేమిటి..?’’
‘‘పిచ్చోడా, ఇప్పటిదాకా నువ్వు చెప్పిన వివరాలేవీ నిఖార్సయిన ఏ భారతీయుడికీ తెలియవు… ఇన్ని చెబుతున్నావు అంటే, ప్రిపేర్డ్, ప్లాన్డ్ అనీ, నువ్వు ఇండియన్ కాదనీ అర్థం కావడం లేదా నాకు..?’’
.
.
కథ అయిపోయింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నా చిన్నప్పటి ప్రియురాలు… ఈరోజుకూ కలలో పలకరిస్తుంది…
  • ప్రహార్ ! బాలీవుడ్ మరో మేలిమి కథ ! కసబ్ విచారణలో కొత్త కోణాలు !!
  • అమ్మ పేర్చిన బతుకమ్మ అమ్మంత అందంగా ఉండేది…!
  • యూపీలో యోగి *పవర్ తగ్గలేదు! *డీప్ స్టేట్ ఇంకా కష్టపడాలి !!
  • అనూహ్యం- 48 కోట్ల నుంచి 5,800 కోట్ల సంపద! ఎవరీ మహేంద్ర నహతా !!
  • ప్రధాని ఎవరైతేనేం..? టరమ్స్ శాసించేది అంబానీ..! ఇదీ జియో పుట్టుక !!
  • కవిత చెప్పింది ! సాయం చేసిన చేతులనే కాటేసే కేటీయార్ !!
  • వీథుల్లో అల్లర్లు – అలజడి … వీటితో ప్రభుత్వాన్ని మార్చడం అసాధ్యం !!
  • నోబెల్ విజేత – తండ్రి కోరిక కోసం, మూలాలు వెతుక్కుంటూ వచ్చింది !
  • అయ్యా నరేష్ గారూ… బాగా నటించగలరు, ఎటొచ్చీ యాసతోనే తిప్పలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions