.
2008… వెంచువాన్… భూకంపం వణికించింది… ఓ భవనం కుప్పకూలింది… ఆ శిథిలాల నుంచి ఓ మూలుగు, ఏడుపు సన్నగా వినిపిస్తోంది… సహాయక చర్యల్లో ఉన్నసోల్జర్ 22 ఏళ్ల లియాంగ్ విన్నాడు… పరుగుపరుగున అక్కడికి చేరుకున్నాడు…
రెండో అంతస్థుకు చెందిన ఉక్కు కడ్డీలు, ఇటుకల కింద ఓ అమ్మాయి కనిపించింది… ఏడుస్తోంది… బయటికి తీయడం కష్టంగానే కనిపిస్తోంది… కానీ లియాంగ్ వదిలిపెట్టలేదు… తన టీమ్ నాలుగు గంటలపాటు కష్టపడింది… ఆ అమ్మాయి భయంతో, షాక్‌తో ఏడ్చీ ఏడ్చీ సొమ్మసిల్లిపోయింది…
Ads
ఎలాగోలా ఆ అమ్మాయిని బయటికి తీసి, వెంటనే హాస్పిటల్‌కు తరలించారు… ఆమె ఒంటిపై చాలా గాయాలు… హాస్పిటల్‌లో ఆమె కోలుకుంది… తరువాత తల్లిదండ్రులు ఆమెను హునాన్‌లోని జుజౌకి తీసుకుపోయారు… విధి నిర్వహణలో ఆరోజు చాలామందిని రక్షించిన లియాంగ్ ఆ అమ్మాయిని కూడా మరిచిపోయాడు…
ఆ అమ్మాయి, పేరు లియు… ఆమె కూడా ఆ విపత్తు రోజు కొద్దిసేపే లియాంగ్ మొహాన్ని చూసింది, తరువాత సొమ్మసిల్లిపోయింది.,. లియాంగ్ మొహాన్ని భయం, షాక్‌లో చూసింది కాబట్టి ఆమె మైండ్‌లో పెద్దగా రిజిష్టర్ కాలేదు… సీన్ కట్ చేస్తే…
2020… 22 ఏళ్ల లియు చాంగ్‌షాలో తన తల్లిదండ్రులతో కలిసి ఓ హోటల్‌లో భోజనం చేస్తోంది… వాళ్ల టేబుల్‌కు దగ్గరలోనే లియాంగ్ భోజనం చేస్తున్నాడు… అతన్ని చూసి, లియు తల్లి గుర్తుపట్టింది… ‘నువ్వే కదా మా అమ్మాయిని ఆరోజు కాపాడింది’ అని పలకరించింది…
‘మా అమ్మాయితోపాటు హాస్పిటల్ వెళ్లిపోయాం, కోలుకున్నాక నీ కోసం చూశాం, ధన్యవాదాలు చెప్పాలనుకున్నాం, నువ్వు ఇంకెక్కడో రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్నావని చెప్పారు… నీ మొహం గుర్తుంది నాకు’ అని చెబుతోంది ఆమె…
లియాంగ్‌కు ఏమీ గుర్తులేదు నిజానికి… మొహమాటంగా వింటున్నాడు… ఆ అమ్మాయి లియును చూసినా గుర్తుపట్టలేకపోయాడు… 12 ఏళ్లు గడిచాయి, ఆ అమ్మాయి మొహం కూడా బాగా మారిపోయి ఉంటుంది కదా… ‘ఆరోజు చాలామందిని శిథిలాల నుంచి వెలికితీశాం… మీ అమ్మాయిని పోల్చుకోలేకపోతున్నా, ఏమీ అనుకోకండి’ అన్నాడు…
తరువాత తరచూ ఆ అమ్మాయి లియాంగ్‌తో మాట్లాడుతూ ఉండేది… తన ప్రాణాలు కాపాడిన హీరో అనే భావనతోపాటు తన మర్యాద, మాటతీరు బాగా నచ్చాయి ఆమెకు… ఆమెతో సాన్నిహిత్యం కూడా అతనికి బాగా నచ్చేది… మెల్లిగా ప్రణయం మొదలైంది… ఆమెతో మాట్లాడుతున్న ప్రతిసారీ తనకు ఏదో మోటివేషన్.., డిప్రెషన్ ఆవరించినప్పుడల్లా ఆమెతో మాట్లాడితే ఊరట లభించేది అట… అయిదేళ్లు అలా గడిచిపోయాయి…
మొన్నటి నవంబరు 29… హునాన్ ప్రావిన్సులో… హాన్ శైలిలో 37 సామూహిక వివాహాలు జరుగుతున్నాయి… అక్కడ ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు… ఎప్పుడో 17 ఏళ్ల క్రితం… తొలిచూపు… ఆ పరిస్థితులూ వేరు… ఇప్పుడు ఆ ఇద్దరికీ పెళ్లి… ఇదే డెస్టినీ… అవును, విధి ఎవరిని ఎప్పుడు, ఎలా కలుపుతుందో ఎవరూ చెప్పలేరు… లియాంగ్, లియు జంట కూడా ఓ ఉదాహరణ..! ఇదుగో ఆ జంట ఫోటో…

Share this Article