Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శోభన్‌బాబు – జయలలిత… ఆఫ్‌ స్క్రీన్, ఆన్‌ స్క్రీన్ ముద్దొచ్చే జంట…

June 17, 2024 by M S R

శోభన్ బాబు , జయలలితల సినిమా . 1965 లో వచ్చిన హిమాలయ్ కి గోద్మే సినిమా ఆధారంగా 1973 లో మన తెలుగు సినిమా వచ్చింది . మనోజ్ కుమార్ , మాలా సిన్హాలు ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమా బాగా హిట్టయింది . మన తెలుగు సినిమా బాగానే ఆడింది కానీ , హిందీ సినిమా అంత హిట్ కాలేదు . సినిమా పేరు డాక్టర్ బాబు…

ఓ పెద్ద పోలీసు ఆఫీసర్ గారి డాక్టర్ కొడుకు , పేదవారికి సేవ చేయాలనే సత్సంకల్పంతో ఓ గ్రామంలో హాస్పిటల్ పెట్టుకోవటం , అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ప్రేమలో పడటం , ఆమె తండ్రి ఓ పేద్ద గజదొంగ కావటం , చివరకు ఆ గజదొంగ లొంగిపోతూ చనిపోవటం . ఇదీ కధ టూకీగా .

టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . హిట్టయ్యాయి కూడా . విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే , నీవనుకున్నది నే కలగన్నది , అల్లనేరేడు చెట్టుకాడ అమ్మలాల , గాజులయితే తొడిగాడు నా రాజు నా మోజులైతే తీరేవి ఏరోజు , వయసు పిచ్చిది ప్రేమ గుడ్డిది , నా రాతకొద్ది దొరికాడు పాత బావయ్య పాటలు శ్రావ్యంగా ఉంటాయి . ఈ పాటలన్నీ సి నారాయణరెడ్డి వ్రాసినవే .

Ads

నాకెప్పుడూ నవ్వు తెప్పించే పాట ఒకటుంది . ఎవడురా దొంగ ఎవడురా దొరలకు ద్రోహులకు దొరకని నేనా అంటూ గజదొంగ మల్లు పాత్రలో SVR పాడతాడు . దొంగలు , గజదొంగలు , హంతకులు తామెందుకు అలా అయ్యామో జస్టిఫై చేసుకోవటానికి ఓ కధ మొదలెడతారు . క్షణక్షణం సినిమాలో శ్రీదేవికి తాను ఎందుకు దొంగ కావలసి వచ్చిందో వెంకటేష్ మాంచి కధ చెపుతాడు . చూస్తున్నాంగా . గాంధీని చంపిన గాడ్సే కూడా ఓ పేద్ద కధ చెప్పడం , అదేదో మహా గ్రంధం లాగా మన మిత్రులు దానిని తరచూ కోట్ చేయటం చూస్తూనే ఉన్నాం .

Off-screen లో శోభన్ బాబు , జయలలితల స్టోరీ మనకు తెలిసిందే . జయలలిత బయోపిక్ లో అసెంబ్లీలోనే కరుణానిధి చురక వేస్తాడు . On-screen లో కూడా జోడీ ముద్దుముద్దుగానే ఉంటుంది . ఇతర పాత్రల్లో SVR , గుమ్మడి , ముక్కామల , రాజనాల , రేలంగి , అల్లు రామలింగయ్య , రాజబాబు , జి వరలక్ష్మి , విజయలలిత , ప్రభృతులు నటించారు .

మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసినట్లు గుర్తు . వెంకటేశ్వరానా లేక నాగూర్వలినా కరెక్టుగా గుర్తు లేదు . మా నరసరావుపేట ఫ్రెండ్సే కన్పర్మ్ చేయాలి . కలర్ సినిమా . ముద్దుముద్దుగా , అందంగా ఉంటుంది . అందమైన హీరోహీరోయిన్లు . ఔట్ డోర్ లొకేషన్సూ హీరోహీరోయిన్లలాగానే అందంగా ఉంటాయి .

చూడని వారెవరయినా ఉంటే , ముఖ్యంగా శోభన్ – జయలలితల అభిమానులు , యూట్యూబులో ఉంది , చూసేయండి . A thing of beauty is a joy forever . జాన్ కీట్స్ చెప్పాడుగా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…… (డోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • BF అంటే..? ఆగండి, ఏవో నీలి ఊహల్లోకి వెళ్లకండి… ఇది చదవండి…
  • మజ్ను అంటే ఓ పేరు కాదు..! పిచ్చోడు, మూర్ఖుడు అని అర్థం..!!
  • నోబెల్ ఇవ్వకపోతే చచ్చారే… అసలే నేను మహా శాంతికాముకుడిని…
  • 10 లక్షల మంది ఉపాధి… 21 వేల కోట్లు… యూట్యూబ్‌ ఒక వ్యవస్థ..!!
  • పదాలన్నీ పచ్చల పిడిబాకులే… పదప్రయోగంలో సినారె రసికుడైన వగకాడు…
  • కాంతార ప్రీక్వెల్‌కు ఈయన పర్మిషన్ దేనికి..? అదీ దేవుడు చెప్పడమేంటి..?!
  • ఈతరం తప్పక చదవాల్సిన శాస్త్రి డెత్ మిస్టరీ… ఎవరు చంపారు..?!
  • ఎంత మంచివాడవురా…? ఎన్ని నోళ్ల పొగడుదురా..? చెంపపైకి ఓ కన్నీటి చుక్క..!!
  • 75 weds 35 … పెళ్లిరోజు రాత్రే కుప్పకూలాడు… ఏం జరిగి ఉంటుందబ్బా…
  • బాహుబలితో స్టార్ట్… పదేళ్లలో ఏడు సౌత్ సినిమాలదే హవా..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions