.
ఉత్తమ పురుషుడు అంటే ఎవరు..? పోనీ, ఉత్తమ తండ్రి అంటే ఎవరు..? ఉత్తమ పురుష లక్షణాలు అంటే కేవలం దేహదారుఢ్యమేనా..? అందమైన మొహమా..? ఇంకేమిటి..?
ఆరోగ్యం, ఫిట్‌నెస్, హైట్, వెయిట్, హెయిర్, ఏ వైకల్యమూ లేకపోవడం ఇవేనా..? జన్మతః వచ్చే జ్ఞానం, చురుకుదనం, ఇతరుల పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, సాహసం, వివిధ క్రీడల్లో నైపుణ్యం, స్పాంటేనిటీ, సందర్భశుద్ధి, ఉదారగుణం, ఉన్నతంగా బతికే నేర్పు…. ఇవి కాదా చూడాల్సింది…
Ads
ఒక స్త్రీకి తన భర్తతో సంతానం కలగకపోతే, ఇతరుల వీర్యంతో కడుపు పండించుకోవడం… అంటే పరపురుషుల వీర్యాన్ని స్వీకరించడం ప్రపంచంలో కొత్తేమీ కాదు… మనకూ కొత్త కాదు… వీర్యాన్ని కృత్రిమంగా భద్రపరిచే సౌకర్యాలు వచ్చాక… అసలు ఆ మగమనిషి ఎవరో తెలియకుండా, ఏ సంభోగ బంధమూ లేకుండా జస్ట్, దాన్ని ఆ బ్యాంకు నుంచి కొనుక్కుని, వాడేసుకోవడమే…
ఈ చర్చ దేనికంటే..? టెలిగ్రామ్ సోషల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్ తెలుసు కదా, దాని సీఈవో పవేల్ దురోవ్‌కు సంబంధించిన ఓ సంతాన సాఫల్య ఆసుపత్రి చేసిన ఓ ప్రకటన…
‘‘పవేల్ వీర్యాన్ని స్వీకరించి సంతానాన్ని పొందే మహిళలకు మేం ఉచితంగా కృత్రిమ గర్భధారణ ప్రక్రియ చేసిపెడతాం… ఆ ఖర్చులన్నీ పవేల్ భరిస్తాడు… కానీ 37 ఏళ్ల లోపు స్త్రీలు, అదీ మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్లయితేనే… ముందుగా దరఖాస్తు చేసుకొండి, మంచి తరుణం మళ్లీ దొరకదు…’’
ఇదీ ఆ ప్రకటన… తనకు ఆల్రెడీ 12 దేశాల్లో 100 మంది పిల్లలు ఉన్నారట… మనిషికో పిచ్చి… ఎవరో ఓ మిత్రుడి అభ్యర్థనతో ఆయన భార్య వీర్యదానం చేసిన తరువాత ఇక ఆ పిచ్చిలోనే పడిపోయాడు పలేవ్… వీర్యదాతల వివరాలు మన దేశంలో రికార్డు చేసి పెట్టరు, బయటికి తెలియనివ్వరు, దాంతో వచ్చే కష్టాలు వేరు…
కానీ పలు దేశాల్లో ఆ వివరాలు భద్రంగా ఉంటాయి… సంబంధిత వ్యక్తులు అడిగితే ఇస్తారు కూడా… ఆ 100 మంది మహిళల్లో చాలామంది ముక్కూమొహం కూడా పలేవ్‌కు తెలియవు, తెలియాల్సిన అవసరమూ లేదు… తమ పిల్లలకు కూడా కృత్రిమ గర్భధారణతో కన్నామనే నిజాన్ని కూడా తెలియనివ్వరు… తామే మోశాం, తామే కన్నాం, తమ పిల్లలు, అంతే… ఎవడో కోన్‌కిస్కాగాడి వీర్యం, సో వాట్..? అన్నట్టుగా ఉంటారు…
కానీ పవేల్ ఆ వివరాలు సేకరించి రాసిపెట్టుకుంటున్నాడు… ఇంకా ఇంకా పిల్లలు కావాలట తనకు… సో, ఈ హాస్పిటల్ ఖర్చులు భరిస్తామనే ప్రలోభాన్ని విసురుతున్నాడు… అవునూ, చాలామంది మహిళలకు పరపురుషుల వీర్యం అవసరమే కావచ్చుగాక… కానీ నిన్నే ఎందుకు ఎంచుకోవాలి..? నీ ఉత్తమ పురుష లక్షణాలు ఏమిటని..?
12 దేశాల్లో 100 మందికి బయోలాజికల్ ఫాదర్ కావడం అనేదే అర్హతా..? నాన్సెన్స్..! నువ్వు విసిరే ప్రలోభాలకు ఆకర్షితులై నీ ‘పిల్లలకు’ బయోలాజికల్ మదర్ కావాలా..? నిన్ను ఎంచుకోవాలా..? ఇదెక్కడి పైత్యం..? కొందరు వ్యక్తుల జీవనవిధానాన్ని దగ్గరగా గమనిస్తూ, నా సంతానానికి వీడే సరైన జెనెటిక్ తండ్రి అవుతాడు అనుకుని… సెలక్ట్ చేసుకుని… వీర్యాన్ని తీసుకునే సంఘటనలూ బోలెడు రీసెంట్ కాలంలో…
ఆమధ్య ఓ సినిమా వచ్చింది తెలుగులో… పెళ్లి వద్దు, కానీ సంతానం కావాలని అనుకుంటుంది అనుష్క శెట్టి… స్టాండప్ కమెడియన్ పోలిశెట్టిని అడుగుతుంది… ముందుగా తనేదో ఊహించుకుంటాడు… అది వేరే కథ… కానీ ఆమెకు కావల్సింది తన వీర్యం మాత్రమే… మిస్ అండ్ మిస్టర్ పోలిశెట్టి సినిమా పేరు… సరే, సినిమా కాబట్టి కొంత డ్రామా, ట్రామా ఉంటాయి… కానీ అసలు కంటెంట్… తన సంతానానికి సరైన తండ్రిని ఎంచుకోవడం…! ఇందులో సంభోగాలు, ఇతర బంధాలు ఏమీ ఉండవు..!!
Share this Article