Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మంధానా ! ఈ పేరులోనే ఏదో వైబ్ ! ఇద్దరూ ఇద్దరే… నేషనల్ క్రష్ !!

September 4, 2026 by M S R

.

అదేదో సినిమాలో కలర్స్ స్వాతి డైలాగ్… మహేష్, ఆ పేరులోనే ఓ జోష్, ఓ వైబ్… ఆ పేరున్నోడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది… నేములోనేముంది అనుకుంటాం గానీ, నేములో అంతా ఉంది… అదే సినిమాలో ఆమె అంటుంది, రాంబాబు నేములోనేముంది, బ్బాబ్బా అని అడుక్కున్నట్టు అనీ కొక్కిరిస్తుంది…

విషయానికి వస్తే… అప్పట్లో కత్రినా కైఫ్ అంటే తన అందంతో అందరినీ పిచ్చెక్కించింది… అదే సమయంలో మహమ్మద్ కైఫ్ ఇండియన్ క్రికెట్‌కు జీవగర్రలా నిలిచాడు… కైఫ్ అనే పేరులో ఓ వైబ్ అప్పట్లో… ఇప్పుడు..?

Ads

స్మృతి

మంథానా…! అవును… ఆ పేరులోనే ఏదో వైబ్ ఉంది… ఒకరు స్మృతి మంథానా… మరొకరు రష్మిక మంథానా… ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటారా..? ఫస్ట్, స్మృతి… ఇండియన్ వుమెన్ క్రికెట్ టాప్ స్టార్ ఆమె… అందగత్తె… మగ క్రికెటర్లకు దీటుగా టాప్ బ్రాండ్ వాల్యూ ఉన్న వుమెన్ క్రికెటర్… ఆమె పేరిట బోలెడు రికార్డులున్నాయి… తాజాగా వుమెన్ క్రికెట్ ఇంటర్నేషనల్‌లో టాప్ స్కోరర్‌గా వరల్డ్ రికార్డు నెలకొల్పింది…

మంథానా

ఇన్నాళ్లూ ఆ రికార్డు మన ఇండియన్ వుమెన్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉండేది… ఆమె 10,868 రన్స్ చేసింది, ఇన్నేళ్లూ ఎవరూ ఆ రికార్డు బద్దలు కొట్టలేదు… కానీ నిన్న స్మృతి దాన్ని బ్రేక్ చేసింది… ఆమె కెరీర్ ఇంకా ఉంది, కెప్టెన్ కావల్సి ఉంది, ఆమె పర్‌ఫామెన్స్ చూస్తుంటే, ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డులు క్రియేట్ చేసేట్టు కనిపిస్తోంది… మూడో స్థానంలో ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెటర్ సూజీ బేట్స్ 10,740 పరుగులతో ఉంది… (ఎక్కువ సెంచరీల రికార్డు కూడా స్మృతి పేరిటే ఉంది)…

మంథానా

కట్ చేస్తే… మరో నేషనల్ క్రష్ రష్మిక మంథానా… ఈమెపై తాజా వార్త ఏమిటంటే..? జాతీయ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ తాజాగా నిర్వహించిన‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (Mood of the Nation) సర్వేలో రష్మిక దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది… గత నాలుగేళ్లుగా ఈ సర్వేలో అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్‌ను వెనక్కి నెట్టి రష్మిక ఈ నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం…

rashmika

కన్నడ చిత్రసీమతో ఓ చిన్న నటిగా ప్రయాణం ప్రారంభించి, తెలుగు, హిందీ భాషల్లో వరుస బ్లాక్‌బస్టర్ హిట్లతో తన మార్కెట్‌ను విస్తరించిన రష్మిక ప్ర‌స్తుతం హయ్యెస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది… పుష్ప, యానిమల్, ఛావా, పుష్ప-2 సినిమాలతో బాలీవుడ్‌లో పాగా వేసింది… దీపిక పడుకోన్‌ను ప్రజాదరణలో దాటేయడం ఖచ్చితంగా ఓ విశేషమే…

సాయిపల్లవి

 

దీపిక రెండో స్థానంకాగా, శ్రద్ధాకపూర్ మూడో స్థానంలో నిలిచింది… మరో టాప్ స్టార్ ఆలియా భట్‌ను వెనక్కి నెట్టేసి ఈసారి సాయిపల్లవి నాలుగో స్థానానికి చేరుకుంది… ఆమధ్య మరో నేషనల్ క్రష్ అని ప్రచారం పొందిన రుక్మిణి వసంత్ జాడలేదు..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • S I R – ఇప్పటికిదే అతి పెద్ద దరిద్రపు, హానికరపు అధికారిక ప్రోగ్రామ్ !!
  • ఇదీ ఓ ‘పడమటి సంధ్యారాగం’… కాకపోతే కథ పూర్తిగా డిఫరెంట్ !!
  • దమ్మున్న జర్నలిస్టు – ప్రకంపనలు – అసలు ఎవరు ఈ రితికా చోప్రా !?
  • ప్రేక్షకుడి సహనంపై ‘సవారీ… మసాలాలు ఎక్కువై రుచి కుదరని ‘బిర్యానీ’…
  • జేడీ చక్రవర్తి ఎవరికీ అర్థం కాడు – అర్థమైతే ఆ దోస్తీ వదలలేం…
  • దిక్కుమాలిన సంత – యాణ్నుంచి పట్టుకొచ్చార్రా వీళ్లను ?
  • ఆ సంధ్య థియేటరే దేనికి..? సొంత హైటెక్ థియేటర్లు ఉన్నాయిగా..!!
  • నాని పైత్యం ! పెంటపెంట… జవహర్‌నగర్ డంపింగ్ యార్డు దుర్వాసన !!
  • ఒవైసీ చెప్పిన ఈ పేరు వెనుక ఓ చరిత్ర’… అసలెవరు ఈ ‘మౌల్వీ?
  • బిడ్డ బాలీవుడ్ స్టార్ ! తల్లి ఓ తమిళపల్లెవాసి ! ఇదీ అసలు సౌందర్యం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions