దేశమంతా ఆ వీడియో వైరల్… మార్ఫింగుల్లేవు… ఎడిటింగుల్లేవు… కరడుగట్టిన నేరగాడు, ఐఎస్ఐ-లష్కరేతొయిబా ఆప్తమిత్రుడు, గ్యాంగ్‌స్టర్, అరాచకశక్తి అతీక్ కాల్పుల్లో హతమారిపోయాడు… ఏ మీడియా వల్లే తను ఇంకా బతికి ఉన్నానని చెప్పాడో… అదే మీడియా ఎదుట… మీడియా ఫేక్ కార్డులు వేసుకున్న హంతకుల చేతుల్లో పాయింట్ బ్లాంక్ క్లోజ్ రేంజులో కాల్చివేయబడ్డాడు… ఓ క్రైం సినిమా సీన్‌ను పోలిన ఈ సంఘటన మొత్తం మీడియాలో రికార్డయిపోయింది… ఇలాంటి అరాచకశక్తులకు, వీటికి అండగా నిలిచే పార్టీలకు, భక్తితో, భయంతో మద్దతు పలికిన మీడియా షాక్‌లోనే మునిగి ఉంది…
మళ్లీ మళ్లీ యూపీ గ్యాంగ్‌స్టర్ అతీక్ నేరచరిత్ర గురించి చెప్పుకునే పనిలేదు… మనం ఆల్‌రెడీ చెప్పుకున్నాం… తను హతమారిపోవడం ఓ నరకాసుర వధ… యూపీలో మరో దీపావళి… దీంతో ఆ నేరసామ్రాజ్యానికి తెరపడినట్టేనా..? మాఫియాను, ఇలాంటి గ్యాంగులను తుదముట్టించడమే తన సంకల్పంగా చెప్పుకున్న యోగి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే చర్చకు తెరలేచింది… అతీక్ వంటి కేరక్టర్లు ఇంకా ఉన్నాయి… ది గ్రేట్ సమాజ్‌వాదీ పార్టీ పెంచి పోషించిన విషవృక్షాల కొమ్మలు నరికాడే తప్ప ఇన్నేళ్లూ యోగి ఈ వేళ్ల నిర్మూలనకు పోలేదు… ఆ పని ఇప్పుడు మొదలైంది…
చాలామందిలో ఓ సందేహం… ఇదోరకం ఎన్‌కౌంటరా..? తెలంగాణలో అలవాటే, ‘గుర్తుతెలియని వ్యక్తులు’ నక్సలైట్లను ఇలాగే ఖతం చేసిన ఉదాహరణలున్నయ్… మీడియా ఎదుట, అంత మంది పోలీసుల బందోబస్తు ఉన్నచోట, మొన్నమొన్ననే అతీక్ కొడుకు సాదిక్ ఎన్‌కౌంటరైనవేళ, అంత పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిచంపడం, లొంగిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది… ఐనాసరే, అతీక్ వంటి పిశాచిని ఎలా చంపినా కరెక్టే అనేది సగటు యూపీవాసి భావన…
Ads
అయితే 11 వేల ఎన్‌కౌంటర్లు చేయించిన యోగి సర్కారు కావాలనుకుంటే అతీక్‌ను మెడికల్ చెకప్ కోసం తీసుకొచ్చినప్పుడు, అక్కడికక్కడే ఖతం చేసేది కదా… హఠాత్తుగా ఈ హంతకులు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు..? పాతకక్షలు అనే వాదన నమ్మేట్టు లేదు… సరే, దాన్ని కాసేపు పక్కన పెడితే… నేరగాళ్లకు కొమ్ముకాసే రాజకీయ పార్టీల అసలు స్వరూపాలు బయటపడుతున్న తీరు సమాజానికి మంచిదే కదా… ఈ ఫోటో ఓసారి చూడండి…
అతీక్ పెంపుడు కుక్క ములాయంసింగ్ యాదవ్‌కు షేక్ హ్యాండ్ ఇస్తోంది… పైపైన చూస్తే అది ఓ సరదా ఫోటో… కానీ ఈ ప్రభుత్వాలు మా చెప్పుచేతల్లో ఉన్నాయి అని అతీక్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సంకేతం అది… ఎవడూ మా జోలికి రాకండి అని పోలీసులకూ ఓ హెచ్చరిక… నేరాన్ని, రాజకీయాల్ని కలగలిపే, సిగ్గూశరం తప్పిన ఎస్పీ పార్టీ ఇప్పటికీ అతీక్ మీద సానుభూతి ఒలకబోస్తోంది…
ఓ మిత్రుడి వ్యాఖ్య ఏమిటంటే… ములాయంసింగ్‌తో తన కుక్కకు షేక్ హ్యాండ్ ఇప్పించిన అతీక్ వ్యవస్థను కుక్కలా చూశాడు… కానీ యోగి సర్కారు పాలనలో అదే అతీక్ బహిరంగంగా, బజారులో కుక్కచావు చచ్చాడు… అదీ తేడా… అందుకే తాజాగా ఈ ఫోటో కూడా వైరల్ అయిపోతోంది… నిజమైన రాజసన్యాసి సొసైటీ కోసం ఎంత కఠినంగా ఉండగలడో యోగి నిరూపిస్తున్నాడు… అందుకే యోగి ప్రధాని కావాలనే కోరిక మళ్లీ సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యక్తమవుతోంది… చాలా సమీకరణాలు అడ్డుపడవచ్చుగాక… గుజరాతీ గ్యాంగ్స్ పడనివ్వకపోవుగాక… కానీ యోగి అంటే యోగే… ఆల్టర్నేట్ పేరు లేదు…!!
Share this Article