Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విచిత్ర కథనం… విచిత్ర జీవితం… విచిత్రంగానే ప్రేక్షక తిరస్కారం…

October 31, 2024 by M S R

హిందీలో సూపర్ హిట్ మూవీ దాగ్ రీమేకే 1978 లో వచ్చిన మన తెలుగు సినిమా విచిత్ర జీవితం . హిందీలో సూపర్ హిట్టయిన సినిమా అగ్ర తారలతో తీసినా తెలుగులో సక్సెస్ కాకపోవటం ఆశ్చర్యమే . పాటలు , మాటలు , చిత్రీకరణ అన్నీ బాగానే ఉన్నా మరెందుకనో సక్సెస్ కాలేదు .

ఓ సాధారణ అమ్మాయి అబ్బాయి గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు . ఉద్యోగార్ధం వేరే ఊరు వెళతారు . ఆ యజమాని సుపుత్రుడు ఈ అమ్మాయిని మానభంగం చేయబోతాడు . ఇంతలో అబ్బాయి వచ్చి , సుపుత్రుడితో ఫైటింగ్ చేసే క్రమంలో సుపుత్రుడు చనిపోతాడు .హీరోకి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది . జైలుకు తీసుకుని వెళ్ళేటప్పుడు ఖైదీల వాహనానికి పెద్ద ప్రమాదం జరుగుతుంది . హీరో ఒక్కడే బతికి బట్ట కడతాడు .

హీరో తప్పించుకునే క్రమంలో రైల్లో ఓ కోటీశ్వరుని , అతని కూతురిని కలుస్తాడు . గుండె నొప్పి వచ్చిన కోటీశ్వరుడిని కాపాడుతాడు . అప్పటికే మోసపోయి గర్భవతిగా ఉన్న సెకండ్ హీరోయినుకు భర్త అవుతాడు . ఫస్ట్ హీరోయిన్ ఆ ఊరికే వచ్చి , సెకండ్ హీరోయిన్ ఇంటికి చేరుతుంది .

Ads

హీరోతో సన్నిహితంగా ఉండటం చూసిన సెకండ్ హీరోయిన్ యాగీ చేస్తుంది . హీరో అసలు కధ చెప్పేస్తాడు . ఈలోపు తప్పించుకున్న హీరో పోలీసులకు దొరకటం , కోర్టులో హీరో బయటపడటం , ఫస్ట్ సెకండ్ హీరోయిన్లు హీరోని పంచుకునేందుకు ఇష్టపడటంతో సినిమా ముగుస్తుంది .

హీరోగా అక్కినేని , ఫస్ట్ హీరోయినుగా వాణిశ్రీ , సెకండ్ హీరోయినుగా జయసుధ , విలన్ సుపుత్రుడిగా మోహన్ బాబు , ఇతర పాత్రల్లో జగ్గయ్య , నాగభూషణం , రమాప్రభ , కాకరాల , ధూళిపాళ ప్రభృతులు నటించారు . హిందీలో రాజేష్ ఖన్నా , షర్మిలా టాగోర్ , రాఖీలు నటించారు .

వి మధుసూధనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు డైలాగులను బొల్లిముంత శివరామకృష్ణ బాగా వ్రాసారు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . వేటూరి , వీటూరి , దాశరధి , సి నారాయణరెడ్డి , ఆరుద్రలు వ్రాసారు . బాల సుబ్రమణ్యం , సుశీలమ్మ , జిక్కిలు పాడారు .

దాశరధి వ్రాసిన ఓ చంద్రమా ఒకనాటి ప్రియతమా పాట చాలా బాగుంటుంది . నా కోసం ఆనందం నీకోసం అనురాగం , ఇన్నాళ్ళ ఈ మూగ బాధ ఈనాటితో మాసిపోనీ శ్రావ్యంగా ఉంటాయి . వేటూరి వ్రాసిన భలె భలె బంగినపల్లి మామిడిపండు గ్రూప్ డాన్సు పాటలో అక్కినేని , వాణిశ్రీల డాన్స్ బాగుంటుంది .

అల్లిబిల్లి చిటిపాపా మనమందరమొకటే చిటిపాపా పాట స్కూల్ పిల్లలతో బాగుంటుంది . వేటూరి వ్రాసిన గుమ్మడమ్మ గుమ్మడి పాట జయమాలిని , మరో డాన్సర్ మీద హుషారుగా ఉంటుంది .

మన తెలుగు సినిమా హిందీ దాగ్ సినిమా ఆధారంగా రీమేక్ చేసారు . హిందీ సినిమాకు మూలం 1886 లో థామస్ హార్డీ వ్రాసిన The Mayor of Casterbridge నవల . థామస్ హార్డీ వ్రాసిన ఒక నవల Under the Greenwood Tree మాకు డిగ్రీలో ఇంగ్లీషు సబ్జెక్టులో నవల .

సినిమా యూట్యూబులో ఉంది . సినిమా హిట్ కాలేదు కాబట్టి చూడకూడదు అనుకోకండి . సినిమా చూడబులే . అక్కినేని , వాణిశ్రీల లవ్ సీన్లు హాట్ గానే ఉంటాయి . As usual , వాణిశ్రీ చాలా అందంగా ఉంటుంది , బాగా నటించింది , గ్రూప్ డాన్సులో బాగా నర్తించింది .

A watchable and feel good movie despite its commercial failure . నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్లకు , థియేటర్ వాళ్ళకు ధన ప్రాప్తి లేకపోతే అంతే మరి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 55 ఏళ్ల క్రితం గల్లంతు..! ఆ అణు పరికరం కథ తెలిస్తే నేటికీ వణుకే..!!
  • నందమూరి దిష్టి తమన్… తెలియకపోతే అన్నీ మూసుకోవాలి బ్రదర్..!!
  • మూడు తెలుగు సినిమా పాటలు- ఒక నోస్టాల్జియా… అజరామరం…
  • నకిలీలకే ‘మెరుపు’లెక్కువ..! ముగ్గురు గరల్‌ ఫ్రెండ్స్, గర్భాలు..!!
  • తెలంగాణ గ్రామీణ వోటరు ఏం చెబుతున్నాడు..? ఇదీ క్లారిటీ..!!
  • హీరో మెటీరియలే..! కానీ ‘ఆది’ నుంచీ ‘డ్రైవ్’ కుదరడం లేదు పాపం…
  • మసక మసక చీకటిలో… మళ్లీ ఆనాటి స్మిత నయగారాలు, నయా రాగాలు…
  • బాలకృష్ణ అఖండ తాండవాలకు బీజం పడింది ఈ సినిమాతోనే..!!
  • మెస్సి టూర్ – నిజమైన సార్ధకత ఎక్కడుంది..? | Khelo India రియాలిటీ చెక్…
  • తగ్గొద్దు… రేవంతన్నా… ఏదేమైనా కానీ… ఈ స్పీడ్ ఆగొద్దు….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions