Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రేక్షకుడికి కూడా ఆ థార్ ఎడారిలో చిక్కుకున్న ఓ ఫీలింగ్…

June 7, 2024 by M S R

Subramanyam Dogiparthi…. కరెక్ట్ టైటిల్ . ఈ సినిమా చూస్తున్నప్పుడు , ఆ పసివాడి కష్టాలు చూసి పాపం అని అననివాడు ఉండడు . ఆడవాళ్లు కంట తడి కూడా పెట్టారు . వి రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ పాపం పసివాడు సినిమా 1972 సెప్టెంబరులో వచ్చింది . సుమారు ఒక నెల థార్ ఎడారిలో షూటింగ్ చేసారు . ఇలాంటి సినిమాలు మన తెలుగు సినిమా రంగంలో చాలా తక్కువ . 1969 లో వచ్చిన Jamie Uys ( జామీ ఉయిస్ ) లాస్ట్ ఇన్ ది డిజర్ట్ ( Lost in the desert ) ఆఫ్రికన్ సినిమా ఆధారంగా మన తెలుగు సినిమాను తీసారు . కధ , స్క్రీన్ ప్లే , మాటలు గొల్లపూడి మారుతీరావు సమకూర్చారు .

ఓ గొప్ప ధనవంతుడికి ఆలస్యంగా మగ పిల్లవాడు పుడతాడు . చుట్టాలు ఆ ఆస్తిని కాజేయటానికి ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు . గర్భవిఛ్ఛిన్నానికి విఫల ప్రయత్నం చేస్తారు . పిల్లాడు పుట్టాక కూడా ఎలాగోలా చంపాలని చూస్తుంటారు . ఇంతలో ఆ పిల్లాడికి క్షయ వ్యాధి రావటం , వైద్యం కొరకు స్విట్జర్లాండుకి విమానంలో బయలుదేరి , మధ్యలో పైలటుకి గుండె పోటు వచ్చి విమానం క్రాష్ అవుతుంది . పైలట్ చనిపోతాడు . పసివాడు , పెంపుడు కుక్క ఎడారిలో పడే రకరకాల కష్టాలు , అదృష్టం బాగుండి తల్లీతండ్రులను కలవటంతో సినిమా ముగుస్తుంది . టూకీగా ఇదీ కధ .

ఈ సినిమా పబ్లిసిటీకి కరపత్రాలు హెలికాప్టర్ ద్వారా జారవిడిచి , వినూత్న ప్రయోగం చేసారు . కమర్షియల్ గా కూడా బాగా సక్సెస్ అయింది . సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు బాగా హిట్టయ్యాయి . ఆత్రేయ వ్రాసిన అమ్మా చూడాలి నిన్నూ నాన్నను చూడాలి అనే పాట సూపర్ హిట్ అయింది . అయ్యో పసివాడా అయ్యో పాపం పసివాడా , ఓ బాబు నీకన్నా మాకు పెన్నిధి ఎవరు అనే పాటలు కూడా బాగుంటాయి . ఆటవికుల గ్రూప్ డాన్స్ పాట మంచియన్నదే కానరాదు ఈ మనుషులలోన అనే పాట , గ్రూప్ డాన్స్ చాలా బాగా చిత్రీకరించారు .

Ads

ఈ సినిమాకు హీరో ఆ పిల్లాడి పాత్ర వేసిన మాస్టర్ రామే . బాగా నటించాడు . తల్లిదండ్రులుగా SVR , దేవిక , మేనమామ పైలట్ గా తమిళ నటుడు నగేష్ , రాబందు చుట్టాలుగా సత్యనారాయణ , సూరేకాంతం , ఛాయాదేవి , ఇతర పాత్రల్లో నాగయ్య , ప్రభాకరరెడ్డి , రాజబాబు , త్యాగరాజు , మాస్టర్ విశ్వేశ్వరరావు , డాన్సరుగా విజయశ్రీ ప్రభృతులు నటించారు .

మా నరసరావుపేటలో ఏ థియేటర్లో చూసానో గుర్తులేదు . తప్పక చూడవలసిన సినిమా . ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే , డైరెక్షన్ ఉంటాయి . ప్రధాన హీరోలు ఎవరూ లేకపోయినా కధే హీరోగా సక్సెస్ అయిన సినిమా ఇది . యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడతగ్గ సినిమా . A watchable , entertaining , sentimental movie … #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు



పాపం పసివాడు..! బాల్యం కరిగిపోయేసరికి ఇండస్ట్రీ అలా వదిలేసింది..!!

.



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కీలక డాక్యుమెంట్… సాయుధ పోరాట దుస్థితిపై ఐదేళ్లుగా అంతర్గత చర్చ..!!
  • వావ్… తొలిసారిగా ఓ ‘ప్రెస్‌’టీజియస్ పోస్టులోకి లేడీ జర్నలిస్ట్..!
  • స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్ కాదు… సైలెంటుగా చిగురించి పెనవేసుకున్న బంధం..!
  • జుహీ చావ్లా తొలి తెలుగు సినిమా… అదీ సూపర్ స్టార్ డైరెక్షన్‌లో…
  • మెస్సీ పట్ల ఈ ‘ఫస్ట్ లేడీ’ అమర్యాదకర ప్రవర్తన..! నెటిజనం తిట్టిపోతలు..!!
  • ఎవరూ అడుగుమోపని… ఆ మార్మిక కైలాస పర్వతం ఎక్కిన ఏకైక వ్యక్తి..!!
  • 55 ఏళ్ల క్రితం గల్లంతు..! ఆ అణు పరికరం కథ తెలిస్తే నేటికీ వణుకే..!!
  • నందమూరి దిష్టి తమన్… తెలియకపోతే అన్నీ మూసుకోవాలి బ్రదర్..!!
  • మూడు తెలుగు సినిమా పాటలు- ఒక నోస్టాల్జియా… అజరామరం…
  • నకిలీలకే ‘మెరుపు’లెక్కువ..! ముగ్గురు గరల్‌ ఫ్రెండ్స్, గర్భాలు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions