మనసైతే మల్లి, లేకపోతే ఎల్లి… ఇంద్రగంటి మోహనకృష్ణ తీరు అలాగే ఉంటుంది… కాస్త ఫీల్, కాస్త సెన్స్ ఉన్న దర్శకుడు… నిజంగా మంచి ప్రాజెక్టు దొరికితే, మనసు పెట్టి పనిచేస్తే… మనసును మెలిపెట్టే సినిమా తీయగలడు… భిన్నమైన బాటలో కథను నడిపించగలడు… అశ్లీలం వంటి పెడపోకడ కానీ ఇదొక గందరగోళం కేరక్టర్… అప్పుడే ఓ మోస్తరు సినిమా… అప్పుడే ఓ చెత్త సినిమా… అలా ఉంటుంది తన కెరీర్… 18 ఏళ్లయింది ఫీల్డుకు వచ్చి, వచ్చీరావడంతోనే తొలి సినిమా గ్రహణంకు బోలెడు అవార్డులు, చప్పట్లు, శాలువాలు, సన్మానాలు…
ఇంద్రగంటిలో ఓ సుగుణం ఉంది, ఆర్టిస్టులతో మంచి సంబంధాలుంటయ్… అష్టాచెమ్మా చేసిన కలర్స్ స్వాతి, ఆ తరువాత సినిమా గోల్కొండ హైస్కూల్‌కు పనిచేసింది… గోల్కొండ హైస్కూల్‌లో పనిచేసిన సుమంత్ తరువాత వచ్చిన ‘అంతకు ముందు- ఆ తరువాత’ అనే సినిమాకు పనిచేశాడు… ఇదే సినిమాలో పనిచేసిన ఇషా రెబ్బా, తరువాత వచ్చిన బందిపోటు సినిమాలో చేసింది… నాని ‘వి’లో చేశాడు… గతంతో తనతో పనిచేసిన అదితి హైదరి, నివేదా థామస్, సుధీర్‌బాబు కూడా ఈ సినిమాలో ఉన్నారు… తరువాత సమ్మోహనంలో చేసిన సుధీర్ బాబు ఇప్పుడు ‘‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’’ సినిమాకు పనిచేశాడు… రిలేషన్స్ అలా కంటిన్యూ చేస్తుంటాడు ఇంద్రగంటి… ఇప్పుడు కొత్త సినిమా గురించే మనం కాస్త చెప్పుకోవాలి…
అష్టాచెమ్మా తరువాత ఏవేవో పెరిఫెరల్ తీసిపారేశాడు… నానితో తీసిన జెంటిల్‌మాన్ కాస్త పర్లేదు, వెంటనే అమీతుమీ అని ఓ ఫ్లాప్… నాలుగేళ్ల క్రితం సుధీర్‌బాబు, అదితి హైదరీతో సమ్మోహనం తీశాడు… సినిమా చాలాచోట్ల బాగున్నట్టనిపిస్తుంది… బాగుంది కూడా… మళ్లీ ఏదైనా సెన్సిబుల్ సినిమా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కదా… ‘‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’’ అంటూ వచ్చాడు… సుధీర్‌బాబే గాకుండా ప్రజెంట్ పాపులర్ స్టార్ కృతిశెట్టి ఉంది, ఇంద్రగంటి ఆస్థాన ఆర్టిస్టులు వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ సరేసరి… అదనంగా రాహుల్ రామకృష్ణ వచ్చాడు… ఐతేనేం..?
Ads
ఓ కమర్షియల్ మాస్ డైరెక్టర్ (సుధీర్) లేడీ ఓరియెంటెడ్ సినిమా తీద్దామని అనుకుంటాడు, ఓ మంచి లేడీ ఆర్టిస్టు కావాలని చూస్తుంటాడు… సినిమాటిక్‌గా ఓ రీల్ దొరికి, అందులో అనుకోకుండా ఓ మొహం కనిపిస్తుంది… ఎవరా అని ఆరా తీస్తే ఓ డాక్టర్ (కృతిశెట్టి) అని తెలుస్తుంది… ఆమె సినిమా చేయడానికి ఒప్పుకోదు, ఒప్పిద్దామని ట్రైచేసి, చివరకు ఒప్పిస్తాడు… (శ్యామ్ సింగరాయ్ గుర్తొస్తుందా..?)… తరువాత పేరెంట్స్, అడ్డంకులు, ఇబ్బందులు ఎట్సెట్రా కథ సాగిపోతుంది… (సినిమా బ్యాక్ డ్రాప్ అంతా సమ్మోహనం హ్యాంగోవర్ అన్నమాట…) అయితే తను ఏదో ఫోటో రీల్‌లో చూసిన అమ్మాయి వేరు, ఆమెది ఓ విషాదగాథ… అదీ ట్విస్టు…
కథ వరకూ బాగుంది… కృతిశెట్టి అందంగా ఉంది… సుధీర్‌బాబు తనకు చేతనైనంతగా చేశాడు… కానీ ఎక్కువ భారం అవసరాల, రాహుల్, వెన్నెల మోశారు… కాస్తోకూస్తో కామెడీ సీన్లే బాగున్నయ్… మిగతా కథనం అంతా బాగా స్లో… ఇంద్రగంటికి ఉన్న బలహీనతే అది… ఇక్కడా అంతే… ప్రజెంట్ ట్రెండ్‌లో స్పీడ్ ముఖ్యం… సాగదీత ఈ సినిమాకు మైనస్… పైగా పాటలు ఇంప్రెసివ్‌గా లేవు… పాత్రల్ని పరిచయం చేయడానికే బోలెడు టైం తీసుకున్నాడు… తెలుగు టీవీ సీరియల్‌గా జీడిపాకంలా సా-గు-తూ ఉన్న కథనం చివరివరకూ అంతే… అదీ ఈ సినిమాకు మైనస్… చివరగా… ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ వచ్చాడు కదా దర్శకుడు… చెప్పాలనుకున్నది ఇంట్రస్టింగుగా చెప్పలేకపోయాడు…!! పాపం సుధీర్, తను ఆశిస్తున్న ఓ పెద్ద హిట్ ఓ జీవితకాలం లేటు అయ్యేట్టుంది… (US ప్రీమియర్ షోల ఫీడ్ బ్యాక్ ఆధారంగా…)
Share this Article