Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ పాత్రను ఎందుకంత చీపుగా షేప్ చేశారు..? ఆయనెందుకు వోకే చెప్పాడు..?

September 11, 2024 by M S R

1974 లో గుండె ఆపరేషన్ అయ్యాక 1977 లో వచ్చిన ఈ ఆలుమగలు సినిమాలో అక్కినేని దసరాబుల్లోడు , ప్రేమనగర్ సినిమాలలో లాగా జయమాలినితో పోటాపోటీగా డాన్స్ చేసి , సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు . ఈ సినిమా ప్రేక్షకులకు , బహుశా మహిళలకు , బాగా నచ్చింది .

ఆలుమగలు ఇగో గొడవలతో కీచులాడుకోవటం , కొట్టుకోవటం , విడిపోవటం , సినిమా ఆఖరికి ఎవరో ఒకరు కలపటం , లేదా వాళ్ళకే జ్ఞానోదయం కావటం అప్పట్లో ఇదే మొదటి సినిమాయేమో ! తర్వాత ఇలాంటి ప్లాట్లతో చాలా సినిమాలే వచ్చాయి .

32 కేంద్రాల్లో రిలీజయితే 23 కేంద్రాలలో యాభై రోజులు , 15 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . హైదరాబాదులో నూన్ షోలతో సిల్వర్ జూబిలీ ఆడింది . 1979 లో నల్లతోరు కుటుంబం అనే టైటిల్ తో తమిళంలో , 1980 లో జుదాయి అనే టైటిల్ తో హిందీలో , 1987 లో శుభా మిలన అనే టైటిల్ తో కన్నడంలోకి రీమేక్ అయింది . అన్ని భాషల్లోను సక్సెస్ అయింది . హిందీలో జితేంద్ర , రేఖలు నటించారు . తమిళంలో శివాజీ గణేశన్ , వాణిశ్రీలు నటించారు . కన్నడంలో విష్ణువర్ధన్ , అంబిక నటించారు .

Ads

ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం తాతినేని చలపతిరావు సంగీత దర్శకత్వం . పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి . నాకయితే చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పూసే అనే పాట చాలా చాలా ఇష్టం . సి నారాయణరెడ్డి వ్రాసారు . వేటూరి వారు వ్రాసిన ఎరక్కపోయి వచ్చాను ఇరక్కపోయాను పాటలోని ఆ డైలాగ్ జనం ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు . సినారె వ్రాసిన మరో పాట ఒక్కరిద్దరముగా మారేది ఇద్దరు ఒక్కటవ్వాలని చిత్రీకరణ బాగుంటుంది . పాట కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది .

కుర్ర జంటలు నారాయణరావు- సంగీత , లక్ష్మీకాంత్- రోజారమణిల మీద పాట పరుగెత్తి పాలు తాగేకంటే హుషారుగా ఉంటుంది . శ్రీశ్రీ వ్రాసిన తెలుసుకో ఈ జీవిత సత్యం పాట బాగుంటుంది .

ప్రత్యేకంగా చెప్పాల్సింది సినారె వ్రాసిన రా రా రా రా రంకే వేసాడమ్మో అనే జయమాలిని మీద పాట . ఈ పాటలో పోటీకి రమ్మని సవాలు విసురుతుంది . డాన్స్ పోటీలో నారాయణరావు ఓడిపోతాడు . ఇదే కనుక నేనయితేనా అని ఊహించుకొని చేసే ANR డాన్స్ గురించి చెప్పుకోవలసిందే . గుండె ఆపరేషన్ అయ్యాక , 53 ఏళ్ల వయసులో అంత గొప్పగా డాన్స్ చేసే సాహసం చేయటం . ఆరోగ్య రీత్యా ధైర్యం ఉండాలి కదా ! Hats off to ANR and his determination and dedication to profession .

ఇంక వాణిశ్రీ నటన గురించి చెప్పేదేముంది . మొదట్లో అల్లరి చేస్తూ , ఊరకూరకే పేచీలు పెడుతూ , పెట్టుబడి లేని ఓవర్ ఆత్మాభిమానంతో సతమతమవుతూ , వయసు ఉడికాక కూడా ఇగోతో సఫరవుతూ , సినిమా పూర్తి కావాలి కాబట్టి ఆనాటి సగటు స్త్రీ లాగా భర్త సన్నిధే ఆడవారికి ఫైనల్ డెస్టినేషన్ అని భావించే పాత్ర . అలవోకగా చేసేసింది . గ్లామర్ + ఏక్షన్ = వాణిశ్రీ .

అలాగే అక్కినేని . గోపాలకృష్ణుని పాత్రలకు పెట్టింది పేరు . ఈ సినిమాలో పాత్ర పేరు కూడా అదే . చాలా హుషారుగా , ఎనర్జిటిక్ గా నటించారు . సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగానే ప్రారంభమయ్యాయి .

ఇతర పాత్రల్లో గుమ్మడి , నాగభూషణం , కాకరాల , విజయలలిత , హలం ప్రభృతులు నటించారు . రాజబాబు- రమాప్రభల పాత్రలు . రాజబాబు పాత్రని రచయిత బాలమురుగన్ అంత చీపుగా ఎందుకు షేప్ చేసారో అర్థం కాదు . మరి సీనియర్ డైరెక్టర్ తాతినేని రామారావు , సీనియర్ నిర్మాత ఏ వి సుబ్బారావులు ఎందుకు అంగీకరించారో తెలియదు . సినిమా బాగా ఆడింది కాబట్టి ఇలాంటివన్నీ కొట్టుకుపోతాయి .

మొత్తం మీద సినిమా బాగుంటుంది . ఆనాటి మహిళలకు నచ్చింది . యూట్యూబులో ఉంది . ANR , వాణిశ్రీ , జయమాలిని అభిమానులు ఎవరయినా చూడకుండా ఉంటే తప్పక చూడండి . A feel good , watchable musical entertainer . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు    (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీషా మెడలే వంచాలనుకుని కేసీయార్ ఆడిన ఓ డ్రామా అది..!!
  • ఏమయ్యా పవన్ కల్యాణుడా… ఓసారి కాస్త సీరియస్‌గా చదువు దీన్ని..!!
  • నటనకు క్లాప్సే కాదు… షూటింగులో అనుకోని షాకింగులు కూడా…
  • జమ్ము కాశ్మీరంపై మరో విధాన నిర్ణయం..? ఢిల్లీలో వరుసభేటీలు..!!
  • కోపం ఆపుకోలేక ఆ జర్నలిస్టును అక్కడే చెప్పు తీసి కొట్టిందట…
  • ఫక్తు జంధ్యాల మార్క్… రెండు రెళ్లు ఆరు… కాదు, అంతకుమించి..!!
  • గురూ గారూ… పెళ్లి గాకుండా ఆడలేడీస్ వరలక్ష్మివత్రం చేయొచ్చునా..?!
  • ‘‘అడ్డూఅదుపూ లేని కాళేశ్వరం దందాకు… కేసీయారే పూర్తి బాధ్యుడు…’’
  • ప్రజాదేవుళ్లు కదా కరుణించాల్సింది… వాళ్ల సేవ అవసరం కదా కేసీయార్..!!
  • వాట్ ఏ మ్యాచ్..! ఆశ్చర్యకరంగా గెలుపు… అదే మరి క్రికెట్ అంటే..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions