.
Mohammed Rafee …. ఆమని అడుగు కూడా అంతేనా?
సినిమా నటులు రాజకీయ రంగంలో అడుగు పెడితే ఒకప్పుడు సంచలనం! ప్రత్యేకంగా ఆయా పార్టీలు సినిమా నటులను చేర్చుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుండే వారు! ఎన్టీఆర్ శకం వేరు! ఆయన చరిత్ర ఎవ్వరూ తిరగ రాయలేరు! (తెలుగు రాజకీయాల్లో)…
Ads
ఆయనకు ముందు కొందరు, ఆయన తరువాత చాలా మంది వచ్చినా పెద్దగా రాణించింది లేదు! అప్పట్లో జమున, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ, మురళీమోహన్, జయప్రద ఎంపిలయ్యారు. దాసరి నారాయణరావు, కృష్ణంరాజు, చిరంజీవి కేంద్ర మంత్రులయ్యారు! మాయం అయ్యారు!
కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యారు. బాబుమోహన్, శివప్రసాద్ మంత్రులు అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏకంగా జనసేన పార్టీ పెట్టి జనంలో ఉండి ఉప ముఖ్యమంత్రి అయ్యారు! జయసుధ ఎమ్మెల్యే అయ్యారు! రోజా మంత్రి అయ్యారు! విజయశాంతి ఎమ్మెల్సీ కాగలిగారు!
జనం కూడా సినిమా నటులను చూసేందుకు పోటీపడుతున్నారు! ఓటింగ్ దగ్గర మాత్రం జనం ఆట జనందే! కొన్నాళ్ళ వరకు ప్రచారాలకు పనికి వచ్చారు కొందరు నటులు! ఇక రాను రాను రాజకీయ నేతలే సినిమా వాళ్ళపై ఆధారపడటం మానేశారు. ఇప్పుడు ఎవరు చేరినా చేరకున్నా ఫరక్ పడటం లేదు!
అందుకే రాజకీయ రంగంలో సినిమా క్రేజ్ తగ్గిపోయింది. చేరాలనుకునే వాళ్ళు కూడా సర్దుకున్నారు. గెలిచి పదవులు తీసుకున్న వాళ్ళు కూడా పెద్దగా రాజకీయంగా లబ్ది పొందింది ఏమీ లేదు. అందుకే ఇప్పుడు ఎవరు చేరినా పట్టించుకోవడం లేదు.
దివ్యవాణి, జీవిత ఇంకా చాలామంది కొన్నాళ్ళు ఆయా పార్టీల్లో సేవలు అందించినా అవకాశాలు అంది పుచ్చుకోలేక వెనక్కి మళ్ళారు. ఇప్పుడు తాజాగా ఆమని బిజెపి కండువా కప్పుకున్నారు! మరి ఆమె ఏం ఆశించారో తెలియదు.
ఇంకా చిన్నా చితకా నటులు ఇటీవల కాలంలో బిజెపిలోకి వెళ్లారు! వాళ్ళు పార్టీకి ఏం చేస్తున్నారో తెలియదు. ఒక్క బిజెపి మాత్రమే కాదు, అటు కాంగ్రెస్, బిఆర్ఎస్ కూడా నటులను ఏం పట్టించుకోవడం లేదు. టిడిపిలోనూ చాలామంది ఉన్నారు. వైసీపీ, జనసేనలోనూ ఉన్నారు. ఒకరిద్దరు మినహా ఎవ్వరూ యాక్టీవ్ గా లేరు. ఆమని అడుగు కూడా అంతేనా? – డా. మహ్మద్ రఫీ
ఓ కృత్రిమ మేధ ప్లాట్‌ఫారమ్ ఇచ్చిన అదనపు సమాచారం…
-
విడాకులు…: ఆమని తన భర్త ఖాజా మొయినుద్దీన్‌తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా కొన్ని ఏళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు…
-
కారణం…: వారిద్దరి మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు రావడంతో, పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది…
-
ప్రస్తుత పరిస్థితి…: ప్రస్తుతం ఆమె తన పిల్లలతో కలిసి విడిగా ఉంటున్నది… తన సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో సహాయక పాత్రలు పోషిస్తూ బిజీగానే ఉంది… – ముచ్చట
Share this Article