Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బొడ్లు, పండ్లు కాదు… అప్పట్లో ఆయనా కాస్త మంచి సినిమాలే తీశాడు…

September 12, 2024 by M S R

బొడ్ల మీద పండ్లు , పూలు వేస్తాడని ఇప్పుడు రాఘవేంద్రరావుని ఆడిపోసుకుంటారు . మొదట్లో ఆయన కూడా బాలచందర్ లాగా ఆఫ్ బీట్ , లో బడ్జెట్ , సందేశాత్మక , ప్రయోగాత్మక సినిమాలు తీసారు . 1977 లో వచ్చిన ఈ ఆమె కధ సినిమాలో ఉత్తమ నటనకు జయసుధకు రెండో సారి ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది . 1976 లో వచ్చిన జ్యోతి సినిమాలో నటనకు మొదటిసారి ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది . రెండింటికీ దర్శకుడు రాఘవేంద్రరావే . నిర్మాత క్రాంతికుమారే .

వాసిరెడ్డి సీతాదేవి వ్రాసిన మానిని మనసు అనే కధ ఆధారంగా ఈ ఆమె కధ సినిమాగా తీయబడిందట . ఈ కధను నేను చదవలేదు . అందువలన ట అని అన్నాను . By the way , వాసిరెడ్డి సీతాదేవి గారు మా గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు . జయసుధను సహజనటిని చేసిన సినిమాలు జ్యోతి , ఆమె కధ , ప్రేమలేఖలు అని ఆమే కొన్ని ఇంటర్వూలలో చెప్పారు . ఆ కాలంలో నవలా చిత్రాలు, హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు బాగానే వచ్చాయి… జయసుధ స్టార్‌ను చేసినవి నవలా చిత్రాలే…

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . పువ్వులనడుగు నవ్వులనడుగు పాట బయట కూడా హిట్టయింది . తహతహమని ఊపిరంతా ఆవిరైతే , పతియే ప్రత్యక్షా దైవము , నాకేటైపోతుందిరో ఎంకయ్య మామా పాటలు థియేటర్లో శ్రావ్యంగా ఉంటాయి . అన్ని పాటల్నీ వేటూరే వ్రాసారు .

Ads

ఈ ఆమె కధ సినిమా కమర్షియల్ గా అంత సక్సెస్ కాకపోయినా రాఘవేంద్రరావుకు పేరొచ్చింది . జయసుధకు అవార్డు వచ్చింది . జయసుధ స్టార్ అయింది . రజనీకాంత్ జయసుధ భర్తగా నెగటివ్ పాత్రలో కనిపిస్తారు . ఇది కధ కాదులో చిరంజీవి విసిగిస్తే , ఈ ఆమె కధ సినిమాలో రజనీకాంత్ విసిగిస్తాడు . రజనీ పాత్రతోనే సినిమాలో పంచ్. ఇతర పాత్రలలో మురళీమోహన్ , శ్రీప్రియ , సత్యనారాయణ , రమాప్రభ , జయమాలిని ప్రభృతులు నటించారు .

యూట్యూబులో ఏ వీడియోలూ లేవు . పాటల ఆడియోలు మాత్రం ఉన్నాయి . జయసుధ అభిమానులు చూడాలనుకుంటే టివిలో వస్తే చూడవలసిందే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions