Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిరంజీవి తన తొలిరోజుల్లో ప్రేక్షకుల్ని కనెక్టయిన సినిమా…

December 13, 2024 by M S R

.

( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) ….. 1980 లోకి వచ్చేసాం . ఆరనిమంటలు . తమిళంలోకి డబ్ చేయబడిన చిరంజీవి మొదటి సినిమా . రెండు భాషల్లోనూ కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది . ఏంగ్రీ యంగ్ మేన్ గా , రివెంజ్ తీసుకునే పాత్రల్లో చిరంజీవి తొలి రోజుల్లో ప్రేక్షకులకు దగ్గరయ్యారు .

ఈ ఆరనిమంటలు సినిమా ఆ కోవకు సంబంధించిందే . అయితే ఈ సినిమాలో అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ కూడా ఉంది . ఓ అన్నయ్య పాట కూడా ఉంది . బాగుంటుంది .

Ads

ఓ నలుగురు దుండగులు , మరో వాంప్ వలన హీరో చెల్లెలు ఆత్మహత్య చేసుకుంటుంది . వాళ్ళను చంపేయాలని హీరో వారిని వెంటాడుతాడు . కానీ , మరెవరో చంపుతుంటారు . సినిమా ముగింపులో తెలుస్తుంది ఆ చంపేది చనిపోయిన చెల్లెలు ప్రియుడు అని . ఈ సస్పెన్సును చివరిదాకా బాగా మెయింటైన్ చేసారు సినిమాలో .

చిరంజీవి గిటారిస్టుగా , డాన్సరుగా , ఏంగ్రీ యంగ్ మేన్ గా , అన్నయ్యగా  బాగా నటించారు . తొలి రోజుల నుండి కూడా ఆనాటి అగ్ర నటుల వలనే మంచి డిక్షన్ ఉండేది . డైలాగ్ డెలివరీలో ఉచ్చరణ బాగుండేది . కష్టపడటంలో చెప్పేదేముంది ! అందుకే మెగా స్టార్ కాగలిగారు .

హీరో చెల్లెలుగా సుభాషిణి బాగా నటించింది . ఆత్మరక్షణకు కరాటే నేర్చుకుంటుంది . ఎవడయినా అల్లరి పెడితే అక్కడికక్కడే కొట్టేస్తుంది . ఎర్ర హీరో నారాయణమూర్తి ఇలా కొట్టించుకునే ఓ రోడ్ సైడ్ రోమియో పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో .

హీరోయిన్ గా కవిత చాలా హుషారుగా నటిస్తుంది . ప్రతీకారం తీసుకోవాలని ఆరాటపడే ప్రియుడికి సాయపడే పాత్రలో బాగా నటించింది . ఇతర పాత్రల్లో గిరిబాబు , సిలోన్ మనోహర్ , జయమాలిని , ప్రసాద్ బాబు , జగ్గారావు , ప్రభృతులు నటించారు . జగ్గారావుకి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది ఈ సినిమాలో .

కె ప్రత్యగాత్మ కుమారుడు కె వాసు దర్శకుడు . డైలాగులను జంధ్యాల వ్రాసారు . పదునుగా ఉంటాయి . సత్యం సంగీతంలో పాటలన్నీ బాగుంటాయి . డ్యూయెట్లు , క్లబ్ డాన్సులు , డాన్సులకు పాటలు అన్నీ బాగుంటాయి .

వేటూరి వ్రాసిన అన్నయ్య దీవెన పాటను శైలజ పాడింది . కమ్మని నా పాట అనే క్లబ్ పాటలో చిరంజీవి , జయమాలిని పోటాపోటీగా డాన్స్ చేస్తారు . జయమాలిని స్పీడుకు బహుశా ఒక్క చిరంజీవే తట్టుకోగలడేమో ఆ రోజుల్లో .

మిగిలిన పాటలు ఓయమ్మో టక్కరి గుంట , నలుగురి కోసం వెతుకుతున్నవి నా కళ్ళు పాటల్లో కవిత డాన్సులు కూడా బాగుంటాయి . టి.వి ఫిలింస్ బేనరుపై కె మహేంద్ర , త్రిపురమల్లు వెంకటేశ్వర్లు నిర్మాతలు . ఈ త్రిపురమల్లు వెంకటేశ్వర్లు గుంటూరు వాడేమో అని అనుకుంటా .

సినిమా , పాటల వీడియోలన్నీ యూట్యూబులో ఉన్నాయి . చూడబుల్ సినిమా . అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్+ రివెంజ్+ చిరంజీవి డాన్సుల సినిమా . చిరంజీవి అభిమానులకు బ్రహ్మాండంగా నచ్చుతుంది . మరయితే ఆలస్యమెందుకు ? చూసేయండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు? ఎన్సీపీ వర్గాల పునఃకలయిక?
  • పది భారీ సైలోలు… ఆహారధాన్యాల నిల్వపై రేవంత్ ప్రభుత్వ కొత్త ఆలోచన భేష్…
  • కాలిపోయేది మా పర్సులు..! నీ గల్లాపెట్టె నిండకపోతే మాదా తప్పు..?!
  • సమాజం మారుతోంది- రియల్ హీరోలు ఎవరో గుర్తించి ప్రేమిస్తోంది !
  • రణ్‌బీర్‌ నోట తెలుగు పలికింది! బ్రహ్మ AI నేర్పిన ‘డబ్బింగ్ కళ !!
  • రాముడు తనే- సీత తనే..! మాటల్లేవ్… టాకీసులోనే లైవ్ బీజీఎం..!!
  • …. చివరకు మంత్రి ‘అక్షింతల’తో దత్తత వివాదానికి శుభం కార్డ్..!!
  • ఈ సీరియల్ కిల్లర్ ఓ క్రైమ్ రిపోర్టర్ – ఆ పత్రికకు ఎడిటర్- పబ్లిషర్…
  • ఈ ‘రామయణం’లో నాకు నచ్చిన నటుడు- వివేక్ విద్యుత్‌జిహ్వుడు!!
  • ఏం తక్కువైంది రెహమాన్ నీకు..? ఎందుకు ఈ సాకులు, ఈ శోకాలు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions