అబ్బాస్ అన్సారీ… సిట్టింగ్ ఎమ్మెల్యే… ఉత్తరప్రదేశ్… ఈయన ఎవరూ అంటే గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ముఖ్తార్ అన్సారీ కొడుకు… అన్సారీ పెద్ద క్రిమినల్… పెద్ద రికార్డే ఉంది… మవు నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ సుహేల్‌దేవ్ బీఎస్పీ నాయకుడిని ఈడీ అరెస్టు చేసింది… తను బాందా జైలులో ఉన్నాడు ప్రస్తుతం… ఘాజిపూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు గత డిసెంబరులో తనకు గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద పదేళ్ల జైలు శిక్ష, అయిదు లక్షల జరిమానా విధించింది…
తండ్రిలాగే కొడుకు… కొడుకు పేరు చెప్పుకున్నాం కదా అబ్బాస్ అన్సారీ… తను సిట్టింగ్ ఎమ్మెల్యే… తనను వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేసి, చిత్రకూట్ జైలులో ఉన్నాడు… జైలులో ఉండేనేం..? అంత పెద్ద తీహార్ జైలులోనే బోలెడు యాక్టివిటీస్ జరుగుతుండగా లేనిది ఈ చిత్రకూట్ జైలు ఎంత..? ఆ జైలు నుంచే తన క్రైమ్ యాక్టివిటీస్ నడిపిస్తున్నాడు…
రోజూ భార్య నిఖత్ ములాఖత్ వెళ్లేది ఉదయం పదకొండు గంటలకు… నాలుగైదు గంటలు అక్కడే ఉండేది… ఎవరూ ఏమీ అడిగేవాళ్లు లేరు, వారించేవాళ్లు లేరు… బయట జరిగే విషయాలన్నీ చెప్పేది… ఫోన్ ఇచ్చేది, ఆ ఫోన్‌తోనే అన్సారీ తన వసూళ్ల దందా వ్యవహారాలు చక్కబెట్టేవాడు… చూసీ చూసీ కొట్వాలీ నగర్ పోలీసులు ఈ వ్యవహారంపైనా కేసు నమోదు చేశారు…
Ads
తండ్రి ఒక జైలులో… కొడుకు మరో జైలులో… మొత్తానికి తమ దందా మాత్రం ఆపలేదు… పోలీసులు అన్సారీ భార్యపైనే కాదు, ఏకంగా జైలు సూపరింటిండెంట్ అశోక్ సాగర్, డిప్యూటీ జైలర్ సుశీల్ కుమార్, ఒక కానిస్టేబుల్ జగ్‌మోహన్, నిఖత్ డ్రైవర్ నియాజ్ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు… జైలులో ఏం జరుగుతుందో విచారణ జరిపి ఎంక్వయిరీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆదేశించారు… అన్నట్టు, ఈ చిన్న అన్సారీ షూటింగులో దిట్ట… పలు పతకాలు కూడా పొందాడు…
నిఖత్‌ను కస్టడీలోకి తీసుకున్నారు… ఆమెను కూడా అండర్ ట్రయల్‌గా అదే జైలుకు పంపించారా లేదా తెలియదు… ఆమె నుంచి మొబైల్ ఫోన్లు గట్రా స్వాధీనం చేసుకున్నారు… గతంలో జరిగినన్ని ఎన్‌కౌంటర్లు, జేసీబీ ఆపరేషన్లు ఇప్పుడు లేవు పెద్దగా… కాకపోతే జైలు నుంచే తమ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్న క్రిమినల్స్ నట్లు బిగించే కసరత్తు సాగుతోంది ఇప్పుడు…! అన్నట్టు, ఈ సుహేల్‌దేవ్ బీఎస్సీ పార్టీ ఎక్కడిదని సందేహం వచ్చిందా..? బీహార్, యూపీ రాజకీయాల్లో ఉనికి బాగానే ఉంది దీనికి… ప్రస్తుతం యూపీ అసెంబ్లీలో ఆరుగురు ఎమ్మెల్యేలున్నారు… అందరూ ఇలాంటివాళ్లేనా అనే ప్రశ్న మాత్రం వేయకండి ప్లీజ్…!
Share this Article