జ్యోతిష్యం.,. చాలామంది నమ్మరు, చాలామంది నమ్ముతారు… ఇది శాస్త్రమే అంటారు తెలిసినవాళ్లు… ఠాట్, ట్రాష్ అంటారు కొందరు… గణించే పద్ధతులు, చెప్పే జోస్యాల తీరు ఎలా ఉన్నా సరే, ప్రపంచమంతా జ్యోతిష్కం ఏదో ఓ రూపంలో మన జీవితాల్లో ప్రధానపాత్ర పోషిస్తూనే ఉంది… సరే, జ్యోతిష్కులందరినీ ఒకే గాటన కట్టేయలేం గానీ, కొందరి ప్రతిభ, జ్ఞానం, జోస్యాలు వివరించే పద్దతి చూస్తే అబ్బురం అనిపిస్తుంది… ఆ అబ్బురాల్లో ఒకడు అభిజ్ఞానంద… Abhigya Ananda…
ఎవరితను..? ఓ సూపర్ కిడ్… చిన్న వయస్సులోనే చాలా క్లిష్టమైన సబ్జెక్టులను ఔపోసన పట్టేశాడు… కర్నాటకలోని మైసూరువాసి… తను చెప్పే జోస్యాలన్నీ నిజం అవుతున్నట్టు మనమేమీ సర్టిఫికెట్లు ఇవ్వనక్కర్లేదు… కొన్ని ప్రిడిక్షన్స్ ఫెయిలయ్యాయి… కానీ తన ఐక్యూ లెవల్, గ్రాస్పింగ్ కెపాసిటీ, వయస్సుకు మించి ఎన్నో రెట్ల సంయమనం ఆశ్చర్యం కలిగిస్తాయి… 2006లో పుట్టాడు… కరోనా విపత్తు గురించి ముందుగానే ప్రిడిక్ట్ చేశాడనే వార్తలతో బాగా పాపులర్ అయ్యాడు గానీ… తను ఎనిమిదేళ్ల వయస్సుకే భగవద్గీతను కంఠతా పట్టేసి, తనదైన బాష్యాలు చెప్పేవాడు…
ప్రపంచంలోకెల్లా ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో అత్యంత చిన్న వయస్సు పోస్ట్ గ్రాడ్యుయేట్… సంస్కృతంలో ఎంఈ… వాస్తు శాస్త్ర గ్రాడ్యుయేట్… సొంత వీడియోలు చేసి యూట్యూబ్‌లో పెడుతుంటాడు… సరే, తన గురించి చెప్పుకోవడం మానేసి, తాజాగా ఏం చెప్పాడో చూద్దాం… 9/11 దాడులు జరిగిన సమయంలో ఎలాంటి గ్రహస్థితి ఉందో సరిగ్గా అలాంటి గ్రహస్థితే ఇప్పుడు నెలకొందనీ, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పంజా విసురుతుందనీ అంటున్నాడు…
Ads
అంతేకాదు, పలు విపత్తులు కూడా ప్రపంచంలోకి వరుస విషాదాల్ని మోసుకొస్తాయట… మరీ ప్రత్యేకించి అక్టోబరు 14 నుంచి ప్రపంచ రాజకీయాలు బాగా ప్రభావితం అవుతాయని, 28 ప్రాంతంలో సీరియస్ పరిణామాలు ఉంటాయనీ అంటున్నాడు… అఫ్గానిస్థన్ భూకంపం, ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి పరిణామాల నేపథ్యంలో మళ్లీ అభిజ్ఞానంద వీడియోలు, జోస్యాలు ప్రాముఖ్యాన్ని పొందాయి… ఏ గ్రహగతుల వల్ల ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో తను ఓ వీడియోలో పొందుపరిచాడు… ఎగువన ఆ యూట్యూబ్ లింక్‌లో చూడొచ్చు ఆసక్తి ఉన్నవారు…
పైన మ్యాప్ చూశారు కదా… ఈ ప్రాంతం కల్లోలితంగా ఉంటుందంటున్నాడు… ఇజ్రాయిల్, పాలస్తీనాలు ఈ ప్రాంతంలోనివే… దక్షిణ అమెరికా నుంచి ఉత్తర అమెరికా కూడా సమస్యాత్మకం కాబోతుందనీ చెబుతున్నాడు… ఇదంతా సరే, ఈ గ్రహగతుల కారణంగా మన దక్షిణ భారత రాష్ట్రాలకూ ప్రకృతి విపత్తులు, హింస ప్రమాదాలు ఉన్నాయట… ఏమో… చెప్పలేం…!!
Share this Article