Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్టార్ల సినిమాలు కాదు… ఇదుగో ఇవి కదా రీరిలీజ్ చేయాల్సింది..!!

November 7, 2025 by M S R

.

 

  • Subramanyam Dogiparthi ... ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం , చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం , మింగినాను హాలాహలం . గుండెల్ని పిండేసే పాట వ్రాసారు ఆత్రేయ . He was at his best through this song , I should say . బాలసుబ్రమణ్యం కూడా అద్భుతంగా పాడారు . ఆసక్తికరంగా ఆయనకు ఈ పాటకు నంది అవార్డు రాలేదు . ఇదే సినిమాలో ఆయన పాడిన మరో పాటకొచ్చింది . జడ్జీలకు ఏది ఎందుకు నచ్చుతుందో మనకేం తెలుసు !?

అభినందన సినిమా అనగానే గుర్తొచ్చే మరో పాట మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో . ఎంత శ్రావ్యంగా ఉంటుందో ! బాలసుబ్రమణ్యానికి అవార్డు వచ్చిన పాట రంగులలో కలవో యెద పొంగులలో కళవో నవ శిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహల ఊయలవో .
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరొద్దికైనారు ముద్దు ముద్దుగున్నారు . మరో శ్రావ్యమైన పాట . ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటనీ ఓ ప్రియా జోహారులు . ప్రేమికులందరూ ఎప్పుడూ పిచ్చోళ్ళే . ఇలాంటి విషాద గీతాలు పాడుకుంటూ ఉండటమే . ప్రియురాళ్ళు ఎప్పుడూ కఠినమే . వారి కష్టాలు వారివి .

Ads

మరో విషాద గీతం ఎదుటా నీవే యెదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే . మరంతే బిడ్డా . దాన్నే ప్రేమంటారు . క్లైమాక్స్ పాట అదే నీవు అదే నేను అదే గీతం పాడనా . అన్ని పాటలూ సూపర్ హిట్టే . అన్నింటినీ ఒకనాటి మనసు కవి ఆత్రేయ గారే వ్రాసారు . బహుశా చాలా వ్యవధి తర్వాత గొప్ప పాటల్ని , అదీ అన్నీ , ఆయనే వ్రాసారు .

వ్రాయించుకోవటానికి ఎంత కష్టపడ్డారో ! సంభాషణలను కూడా ఆయనే వ్రాసారు . ఇళయరాజా అత్యంత శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . He made this movie a music romance splendour . సినిమా విజయానికి ఆయన సంగీతమే కారణమని చెప్పవచ్చు . ఇంత గొప్ప సంగీత సాహిత్యాలకు సరయిన న్యాయం చేసారు బాలసుబ్రమణ్యం , జానకమ్మ . ఎంత గొప్పగా పాడారో పాటలనన్నీ ! Hats off to all .

సినిమాలో హీరోయిన్ శోభన నృత్యాభిలాషి . తదనుగుణంగానే నృత్యాలను చక్కగా కంపోజ్ చేసారు మాధురి బలరాం . మన తెలుగు సినిమాల్లో ఎక్కువగా విన్న పేరు కాదు . శాస్త్రీయ నృత్యానికి చిరునామా అయిన తిరువాన్కూర్ సిస్టర్సుకి మేనకోడలు శోభన . శోభనే గొప్ప శాస్త్రీయ నృత్యకారిణి . చాలా గేప్ తర్వాత ఈమధ్య కల్కి సినిమాలో నటించింది .

సినిమా దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ ఒరిజనల్గా గొప్ప ఫొటోగ్రాఫర్ . సినిమాలోని ప్రతీ ఫ్రేమును కళాత్మకంగా చూపారు . కళాకారుడే దర్శకుడు అయితే సినిమా ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు . బాలూ మహేంద్ర సినిమాలు మనకు తెలుసు కదా ! అశోక్ కుమార్ దర్శకత్వంలో తర్వాత కాలంలో నీరాజనం , ఓ వర్షం కురిసిన రాత్రి , మంచు కురిసే వేళలో సినిమాలు వచ్చాయి .

చిత్రకారుడిగా , ప్రేమికుడిగా , భగ్నప్రేమికుడిగా కార్తీక్ బాగా నటించారు . ప్రత్యేక జ్యూరీ నంది అవార్డు కూడా వచ్చింది . అలాగే ఫిలిం ఫేర్ వారి ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది . ఇంత అందమైన సినిమాకు రెండవ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు వచ్చింది .

తమిళంలోకి కాదల్ గీతం అనే టైటిలుతో డబ్ అయింది . కన్నడంలోకి అభినందన పేరుతోనే రీమేక్ అయింది . రాంకుమార్ , సుధారాణి నటించారు . 2005 లో హిందీలో వచ్చిన బేవఫా సినిమాకు ఆధారం మన అభినందన సినిమాయే .

చాలా సింపుల్ కధ . కార్తీక్ , శోభన గాఢంగా ప్రేమించుకుంటారు . పెళ్లి చేసుకోవటానికి సిధ్ధపడతారు . ఇంతలో పురిటికి వచ్చిన హీరోయిన్ అక్క ప్రమాదంలో చనిపోతుంది . అక్క పిల్లల కోసం హీరోయిన్ తండ్రి ఆమెను , బావ శరత్ బాబుని ఒప్పించి పెళ్లి చేస్తాడు . కార్తీక్ భగ్న ప్రేమికుడు అవుతాడు . జరిగింది తెలుసుకున్న శరత్ బాబు నిద్ర మాత్రల్ని మింగి చనిపోయే ముందు బలవంతంగా ఇద్దరినీ ఒప్పించి ఒకటి చేయడంతో సినిమా ముగుస్తుంది .

ఇతర పాత్రల్లో సోమయాజులు , రాజ్యలక్ష్మి , చిట్టిబాబు , ప్రభృతులు నటించారు . ఎక్కువ పాత్రలు లేవు .
ఎలాంటి flashbacks , కుదుపులు లేకుండా straight express highway లాగా కధ సాగిపోతుంది . 1960s ప్రేమ సినిమాలు గుర్తుకొస్తాయి . చాలా నీట్ పిక్చర్ .

సినిమాకు సంగీతమే బలం . అందువలనే సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది . తప్పక చూడతగ్గ సంగీత భరిత కమనీయ చిత్రం . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడండి . ముఖ్యంగా పాటల్ని మాత్రం మిస్ కాకండి .

* ఇది నా 1159 వ సినిమా . 2022 లో పాత తెలుగు సినిమాల రివ్యూని ప్రారంభించాను . 1931 నుండి 1988 వరకు 1159 సినిమాలను పరిచయం చేసాను . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యాక్షన్ లేదు, ఆధార్ బ్లాకూ లేదు… ఈ వివాదం పూర్వపరాలు ఇవీ…
  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?
  • బాగా మగ్గిన అరటి పండు కేన్సర్‌ కణాల్ని చంపేస్తుందా..? నిజమేంటి..?
  • ఈ తెలంగాణ ద్వేషి అస్సలు మారడు… మళ్లీ అదే విద్వేష ప్రదర్శన..!!
  • బిగ్‌బాస్..! బహుశా ఫైనల్స్‌లో తనూజ, ఇమ్మూ, పడాల, భరణి, రీతూ..!!
  • వ్యక్తిపూజ- ఫ్యానిజం… ఆంధ్రా కింగ్ తాలూకా… కాదు, ఓ హీరో ఫ్యాన్ తాలూకా…
  • హనుమాన్ చాలీసా టాప్ రికార్డు… ఇవీ ఇండియాలో టాప్ 10 వీడియోలు..!
  • బురద… బూడిద..! ఆలు లేదు, చూలు లేదు… అప్పుడే వేల కోట్ల స్కాములట..!!
  • ముగ్గురు కొడుకులు… కాదు, కాదు… ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ…
  • 26/11 …. మరిచిపోలేని ఒక నిజ భారత రత్నం… కొన్ని బొగ్గు కేరక్టర్లు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions