Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాలెడ్జ్ వేరు… తెలివి వేరు… కామన్ సెన్స్ వేరు… ఇంట్రస్టింగు…

January 13, 2025 by M S R

.

Veerendranath Yandamoori  పరిజ్ఞానo (knowledge) వేరు. తెలివి (intelligence) వేరు. ఒక లెక్కకి జవాబు చెప్పటానికి (లేదా సమస్యకి పరిష్కారం కనుక్కోవటానికి) తన నాలెడ్జ్ ఉపయోగించటాన్ని తెలివి అంటారు. Ability to convert knowledge into solution is intelligence.

(a+b)²= a²+b²+2ab అని స్కూల్లో చెప్తారు. అది నాలెడ్జ్. (b+a)² కి కూడా ‘అదే జవాబు’ అని తెలుసుకోవటం తెలివి. ఇది ఏ కాలేజీలోనూ చెప్పరు. sin θ/cos θ=tan θ అని స్కూల్లో చెప్తారు. అది నాలెడ్జ్. మనకున్న నాలెడ్జీతో (sin θ/cos θ) x (tan θ/tan² θ)=1 అని సమాధానం చెప్పటం తెలివి.

Ads

ఎంత తొందరగా సమాధానం చెప్పగలమూ అన్నది ప్రతి స్పందన (reflex action). ఫ్యాను సమస్య ప్లగ్‌లో వుందా, వైర్‌లో వుందా లేక ఫ్యాన్‌లో వుందా అనేది గుర్తించ గలగటం ‘నాలెడ్జ్’. ఫ్యాను విప్పి, అందులో మిస్టేక్ ఎక్కడ వుందో తెలుసుకోగలగటం ‘అనుభవం’.

కరెంటు వైరుని ముట్టుకోకుండా వుండటం ‘మెచ్యూరిటీ’. తొందరగా రిపేరు చేయటం ‘నైపుణ్యం’. అన్నిటి కన్నా ముందు… ఫ్యాను ఆగి పోవటానికి కారణం అది పాడవటమా, లేక కరెంటు లేదా అని చూసుకోవటం ‘కామన్ సెన్స్’.

నాలెడ్జ్ ఉన్న ప్రతీవాడూ తెలివైనవాడు కాకపోవచ్చు. తెలివైనవాడికి సాధారణంగా కాస్తో కూస్తో నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ లేకుండా, కేవలం తెలివి వున్నవాడిని ‘అతి తెలివి గాడు’ అంటాము. తెలివి లేకుండా కేవలం నాలెడ్జ్ వున్న వాడిని ‘శుష్క పండితుడు’ అంటాము.

తెలివి పంచదార. పాలు నాలెడ్జ్. సేమ్యాలు అనుభవాలు. యాలకులు తర్కం. జీడిపప్పు లేటరల్ థింకింగ్‌..! ఉట్టి సేమ్యాలు తినలేము. పది యాలకులు నమల లేము. గుప్పెడు పంచదార మొహం మొత్తుతుంది. విడివిడిగా ఏవీ బాగోవు. సేమ్యాలు, యాలకులు, పంచదార అన్నీ కలిపితే వచ్చేది మధురమైన పాయసం… “జ్ఞానం”..! జ్ఞానానికి మించిన పై మెట్టు లేదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
  • పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!
  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions