‘‘జగన్ రాజకీయాలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. కేంద్రంతో సఖ్యత సాధ్యం కాని పక్షంలో రాజ్యసభలోని తన సభ్యులను బీజేపీలోకి పంపడానికి కూడా మొహమాటపడరు…’’ అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈరోజు తన ఎడిట్ ఫీచర్‌లో రాసుకొచ్చాడు… గుడ్…
స్పైడర్ సినిమాలో శవాల్ని చూస్తూ అలౌకిక ఆనందం పొందే ఎస్‌జేసూర్య కేరక్టర్ నుంచి కొలంబియా ది మోస్ట్ నొటోరియస్ డ్రగ్ స్మగ్లర్ ఎస్కో బార్ దాకా జగన్‌ను పోలుస్తూ… తిట్టేస్తూ… ఆక్షేపిస్తూ… శవరాజకీయాలని నిందిస్తూ… ఎప్పటిలాగే జగన్ మీద పడిపోయాడు ఆయన… చివరకు జగన్ చేతులు పిసుక్కోవడం అనే బాడీ లాంగ్వేజ్‌కు తనదైన బాష్యం చెబుతూ, ఆ పిసుక్కోవడం వెనుక వికృత ఆలోచనల్ని చంద్రబాబు పసిగట్టి, నిరోధించకపోతే ప్రమాదమే అని హెచ్చరించేదాకా వెళ్లిపోయాడు…
జగన్‌రెడ్డి చేతులు పిసుక్కుంటూ పిచ్చి చూపులు చూడటాన్ని ట్రోల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సిబ్బంది, తెలుగు తమ్ముళ్లు ఆనంద పడిపోతుంటారు కానీ… ఆ పిసుక్కోవడం వెనుక ఉండే వికృతమైన ఆలోచనలను పసిగట్టడంలో విఫలమవుతున్నారు…. ఇదే తను రాసిన పేరా…
అంతేనా..? అచ్చం చంద్రబాబు చెబుతున్నట్టే ఈ జగన్ భూతం మళ్లీరాదు అని నమ్మకం కుదిరితే తప్ప, ఇక మళ్లీ కోలుకోకుండా దెబ్బకొడితే తప్ప పెట్టుబడిదారులు రారు అని తనూ తేల్చేశాడు… ఏం చేస్తారో ఏమో గానీ… ఒక్క విషయం తెలుగుదేశం కూటమి ఎప్పుడూ తమ సోయిలో ఉంచుకోవాలి… తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కారణం కేసీయార్ మీద జనంలో బలమైన వ్యతిరేకత … సేమ్, ఏపీలో కూడా వేరే ప్రత్యామ్నాయం దిక్కులేక, జగన్ పాలన తీరును గట్టిగా వ్యతిరేకించిన జనం ఈ కూటమికి వోట్లేశారు… అంతేతప్ప ఇది చంద్రబాబు పాజిటివ్ వోటు కాదు…
Ads
తన రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపిస్తాడు అనే ప్రిడిక్షన్ చదివితే కాస్త నవ్వొచ్చింది… తప్పేముంది..? పార్టీ రక్షణకు, తన రక్షణకు ఏ వ్యూహం పన్నినా రాజకీయాల్లో సమర్థనీయమే ఈరోజుల్లో… మరి అప్పట్లో మోడీని పదే పదే తీవ్రంగా తిట్టిపోసిన చంద్రబాబు ఎంపీలు బీజేపీలోకి ఎలా వెళ్లారు..? ఎవరు పంపించారు..? చంద్రబాబు స్కిన్ సేవింగ్ కాదా అది..? పైగా 2019కు పూర్వం ఇవ్వజూపిన ప్రత్యేక ప్యాకేజీ ఇప్పుడు ఇస్తున్నారు అని రాస్తాడు…
మరి అప్పట్లో వెంకయ్యనాయుడు, చంద్రబాబు నిధులొచ్చినట్టే అని అర్థరాత్రి ప్యాకేజీ ప్రకటనలు జారీ చేసి, పండుగలు నిర్వహించారు కదా… ఆ నిధులేమయ్యాయి..? ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ అని ఏమీ చెప్పడం లేదు కదా…! విభజనయ్యాక ఇన్నేళ్లకు ప్రత్యేక హోదా గురించిన డిమాండ్ అర్థరహితం అంటాడు… యూటర్న్ బాబు గారు తన అధికారంతమున గొంతు విప్పిన డిమాండ్ ఏమిటి మహాశయా…
అలాగని జగన్ పాలన గొప్పదనీ, తన రాజకీయ పోకడ సూపర్ అనీ అబద్ధాలేవీ చెప్పడం లేదిక్కడ… కాకపోతే నాయకులు దొందూ దొందే అనేది జనానికి తెలుసు… కాకపోతే ఏపీ జనానికి వేరే ఆల్టర్నేట్ లేకపోవడం ఓ దురవస్థ, అంతే… జగన్‌ను ఇండి కూటమిలో చేరతాడనేది అబద్ధమని తేల్చేశాడు… అది కరెక్టు… ఐతేగియితే బీజేపీతోనే రాయబేరాలు ఉంటాయేమో గానీ షర్మిల రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న కాంగ్రెస్ వైపు, తనను జైలుపాలు చేసి కక్షసాధించిన కాంగ్రెస్ వైపు జగన్ వెళ్తాడని అనుకోలేం… వెళ్తే మరింత దెబ్బతినడమూ ఖాయం…
సేమ్, కేసీయార్‌కు కూడా బీజేపీతో సఖ్యతే శరణ్యం… విలీన ప్రయత్నాలనే వార్తలొస్తున్నట్టు రాధాకృష్ణ రాసుకొచ్చాడు గానీ విలీనం దాకా కేసీయార్ దిగిపోకపోవచ్చు… అసలే మండుతున్న అగ్నిపర్వతం నేను అని చెబుతున్నాడు… ఏమో, జగన్ ఇవ్వజూపుతున్నట్టే, గతంలో చంద్రబాబు ఇచ్చినట్టే… తన ఎంపీలను మోడీకి లంచంగా ఎరజూపవచ్చు… ఐనా మోడీకి ఇప్పుడు రాజ్యసభలో అంతర్జెంటుగా ఎంపీల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉందంటారా..? నితిశ్, చంద్రబాబు సఖ్యంగా ఉంటే చాలు తనకు ప్రస్తుతానికి…!!
Share this Article