Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మై డియర్ ఆర్కే… సలహాలు తీసుకునే స్థితిలో వాళ్లున్నారా అసలు..?!

August 31, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ………. కొంపతీసి రాధాకృష్ణ చంద్రబాబు కొంప కూల్చడు కదా ! MLAలు కౌంటర్లు ఓపెన్ చేసారని ఒకటికి రెండు సార్లు వీకెండ్ కామెంట్లలో చెప్పారు . బాగుంది . అదే పనిగా ఇన్ని సార్లు చెప్పాలా ! వాళ్ళందరూ ఏకసంథాగ్రాహులే కదా ! సూక్ష్మగ్రాహులే కదా ! పైగా రాధాకృష్ణ ఒకసారి చెపితే భాషా లాగా లక్ష సార్లు చెప్పినట్లే కదా !

అయినా ఎందుకు చెపుతున్నారు అదే పనిగా ? ఆయన చెపుతున్నారా లేక ఆయన చేత చెప్పిస్తున్నారా అనే అనుమానం MLA లకు వస్తుంది కదా ! మొగుడు ఏదో అంటే ఊళ్ళో వాళ్ళు కూడా అదే అంటారు . పైగా నిన్న రాధాకృష్ణ మరో ఉచిత సలహా కూడా ఇచ్చారు . చంద్రబాబు కలెక్టర్ , యస్పీలకు ఫోన్ చేసి MLAల ఆదేశాలను ఖాతరు చేయవద్దని చెప్పమని సలహా ఇచ్చారు . మా అయ్యే !

Ads

ఏకపత్నీవ్రతుడు అయిన భర్తను భార్యామణి నిత్యం అనుమానిస్తుంటే తిక్క రేగి పత్నీవ్రత్యానికి భర్త గారు భంగం కావించవచ్చు . పైగా మాట్లాడితే కూటమి MLAలు అని అంటున్నారు . అనవసరంగా భాజపా , జనసేన వాళ్ళను కూడా కలుపుతున్నారు , కెలుకుతున్నారు . పైగా జగన్ని కూడా కలుపుతున్నారు . ప్రపంచంలో అవినీతి అదేదో జగన్ తోనే ప్రారంభం అయినట్లు !!

చాలా ప్రమాదం రాధాకృష్ణ గారూ . వార్నింగులు ఇచ్చింది చాలు . చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , పురంధేశ్వరి చూసుకుంటారు . More you rub on wrong shoulders , greater is the threat of sowing the seeds of mutual suspicion . Not desirable …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మొగిలయ్యా, బాధ పడొద్దయ్యా… పాడులోకం ఇంతేనయ్యా…!
  • ప్రతి తెలంగాణ బిడ్డ ఓసారి నెమరేసుకోవాల్సిన ‘కన్నీటి కాలం’ ఇది…
  • ఆమె కథలో బోలెడు నాటకీయత… కానీ ‘క్రియేటివ్ ఫ్రీడమ్‌’పైనే భయం…
  • ప్చ్… చిరంజీవి, రాఘవేంద్రరావు, విజయశాంతి లెవల్‌లో ఆడలేదు…
  • కేటీయార్ ‘యాప్’సోపాలు..! రైతుల సౌకర్యం, సౌలభ్యమూ సహించవా..?!
  • కదులుతున్న బెంగాలీ డొంక…. కూలుతున్న మమత ఫేక్ వోట్ల పునాదులు…
  • పాన్ ఇండియా కాదు.. ! తెలుగులో మాత్రమే అఖండ తాండవం.. !!
  • యూదులు ఎక్కడున్నా ప్రాణభయమే…! అసలు ఏమిటీ హనుఖ్క..!?
  • …. అలా ఈనాడుపై ఉదయం, ఆంధ్రజ్యోతి ‘పగ తీర్చుకున్నాయి’…
  • సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions