.
పాత సినిమాలకే 4కే నగిషీలు చెక్కి, 5.1 సౌండ్ మిక్స్ జతచేసి, సరిచేసి, రీరిలీజ్ చేసి, మళ్లీ సొమ్ముచేసుకోవడమే కదా ప్రజెంట్ ట్రెండ్… బాలకృష్ణ చెప్పుకోదగిన సినిమాల్లో ఆదిత్య 369 కూడా ఒకటి… సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్…
అప్పట్లో అది ఓ ప్రయోగమే… మన తెలుగు ప్రేక్షకులకు, కాదు, చివరకు ఇండస్ట్రీలో ముఖ్యులకు కూడా టైమ్ మెషిన్, జర్నీ ఇన్ టు ఫ్యూచర్, పాస్ట్ అనేవి తెలియవు… ఆ కాన్సెప్టును జనరంజకంగా మలిచాడు దర్శకుడు…
Ads
అఫ్‌కోర్స్, కృష్ణదేవరాాయలుగా బాలయ్య ఫిట్… రొమాన్స్, క్రైమ్, కామెడీ, సైన్స్, ఫిక్షన్, ఫైట్స్ అన్నీ ఉన్నయ్ ఇందులో… పైగా అప్పట్లో స్లిమ్‌గా ఉన్న సిల్క్ స్మిత డాన్స్, బాలయ్య పక్కన జంటగా మోహిని, పిల్ల నటుడిగా తరుణ్… అన్నీ భలే కుదిరాయి… ప్రత్యేకించి జాణవులే నెరజాణవులే పాట బంపర్ హిట్…
ఇదీ ఆ లింకు… https://www.youtube.com/watch?v=tTPj_uZtfg8&ab_channel=VRTVWorld
34 ఏళ్ల తరువాత మళ్లీ వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ల కోసం సింగీతం పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు… తను షేర్ చేసుకున్న కొన్ని కీలకాంశాలు… ఆసక్తికరం… గతంలో కూడా చెప్పాడు…
– బ్యాక్ టు ద ఫ్యూచర్ అనే సినిమా ఇన్‌స్పిరేషన్‌తో ఈ సినిమా తీసినట్టు చెబుతుంటారు కానీ నిజం కాదు, హెచ్ జి వెల్స్ రాసిన ది టైమ్ మిషన్ నవలలో టైం ట్రావెల్, సైన్స్, ఫిక్షన్ అన్నీ ఉంటాయి… రఫ్‌గా స్టోరీ కాన్సెప్టు ఇలా ఉంటే బాగుంటుందని ఏనాడో మనసులో రాసి పెట్టుకున్నాను…
– ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనుకోకుండా ఈ కథ విని పలువురు నిర్మాతలకు సజెస్ట్ చేశాడు, కానీ ఇదేదో ఫాంటసీ కథలే అనుకుని, ఈ జానర్ అర్థం గాకపోవడంతో రిజెక్ట్ చేశారు… శివలెంక కృష్ణప్రసాద్ కూడా ఇదేదో కొత్తగా ఉందిలే అనుకుని సిద్దపడ్డారు… ధైర్యమే ఆరోజుల్లో…
– నా రఫ్ స్క్రిప్టులో ఫ్యూచర్‌లోకి, పాస్ట్‌లోకి వెళ్లాలనేది కాన్సెప్టు… మన స్వాతంత్ర్య రోజుల్లోకి హీరోను తీసుకుపోతే ఎలా ఉంటుందని అనుకున్నాను… కానీ కథలో హీరో ఇన్వాల్వ్ కావడానికి స్కోప్ లేదు, సో, తెలుగు ప్రజలు కనెక్టయ్యే కృష్ణదేవరాయలి చరిత్రలోకి వెళ్లాలని ఫిక్సయ్యాను… బాలకృష్ణ కూడా ఈ పాత్రకు అంగీకరించడం అప్పట్లో సాహసమే…
– అక్బర్- బీర్బల్ నాటి చరిత్రలోకి వెళ్లాలనే భావన వచ్చినా, ఆల్రెడీ చాలామంది తీశారు కదా అని వదిలేశాను… భారతకాలంకన్నా భువనవిజయం అయితే బాగుంటుందని అనుకున్నాం… ఫ్యూచర్‌లోకి జర్నీ ఎలా ఉండాలో ఓ అమెరికన్ యూనివర్శిటీలో ఫ్యూచరాలజీ సెక్షన్‌లో పుస్తకాలు తిరగేస్తుంటే క్లారిటీ వచ్చింది…
– కథ, డైలాగ్స్, స్క్రిప్టు ప్రతి దశలో జంధ్యాల కృషి ఉంది… కెమెరామెన్ గురించి చెప్పాలి… మొదట తీసుకున్నది పి.సి.శ్రీరామ్… కొన్నాళ్లు పనిచేసి, జబ్బు పడి, మానేశారు… తరువాత వీఎస్ఆర్ స్వామి చేరాడు మాతో… భవిష్యత్తు ఎపిసోడ్స్ మాత్రం కబీర్ లాల్ చేశాడు…
– నిజానికి ఈ సినిమాలో కథానాయిక విజయశాంతి కావల్సింది… కానీ డేట్స్ లేవు… అనుకోకుండా మోహినిని ఎవరో సజెస్ట్ చేశారు, మా అందరికీ నచ్చింది… ఆమె ఓ హార్స్ క్లబ్ సెక్రెటరీ కూతురు…
– ఆదిత్య అనే టైటిల్ ఫస్ట్ నుంచీ అనుకున్నదే… కానీ బోయింగ్ 737 తరహాలో ఓ అంకెను తరువాత యాడ్ చేశాం… దానికి పెద్ద కారణాలేమీ లేవు… లైట్ ట్రావెల్ స్పీడ్, టైం ట్రావెల్ స్పీడ్ ఒకటేనని నా భావన… లైట్ అంటే సూర్యుడు, సో, ఆదిత్య అనేది సినిమా పేరు…
– ఆదిత్య 369 సీక్వెల్ వాస్తవానికి బాలయ్య కొడుకుతో తీయాలని మొదట ప్లాన్… కుదరలేదు, బాలయ్యకు ఈరోజుకూ సీక్వెల్ మీద ఆలోచన ఉంది… ఎప్పుడు వర్కవుట్ అవుతుందో చెప్పలేం కదా…
ఈ సినిమా హిట్‌కు ఇళయరాజా పాటలు ఓ కారణం… జాణవులే, వరవీణవులే, కిలికించితాలలో అనే పాట ఈరోజుకూ స్వరణీయమే… స్మరణీయమే… అలాగే రాసలీల వేళ, రాయబారమేల, మాటే మౌనమై మాయ సేయనేలా అనే పాట కూడా వినసొంపు… జాణవులే పాట పాడింది జిక్కీ… సూపర్ హిట్ సాంగ్… అన్నట్టు జిక్కిని ఓసారి తలుచుకోవాలి ఈ సందర్భంగా… ఈ లింకు ద్వారా…
Share this Article