ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ కేసీయార్ కూతురు కవితను కలిశాడు… చాలాసేపు మాట్లాడుకున్నారు… బీఆర్ఎస్ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో ఎవరో ఒకరు జెండా మోసేవాళ్లు కావాలని కేసీయార్ ప్రయత్నం… అందులో భాగంగా శరత్ కుమార్ కూడా బీఆర్ఎస్‌లో చేరతాడు, లేదా తన పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేస్తాడనే ఊహాగానాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి…
రాజకీయాల్లో ఇది జరగదు అని చెప్పడానికి వీల్లేదు… దీన్ని కూడా అడ్డంగా కొట్టేయలేం… అయితే కేసీయార్‌కు అందరూ ఇలాంటివాళ్లే దొరుకుతున్నారు తప్ప, డబ్బు ఖర్చు గురించి వెనకాడకపోయినా సరే, పేరున్నవాళ్లెవరూ తనతో కలిసి నడవడానికి ముందుకు రావడం లేదు… అదీ అసలు వార్త… ఒడిశాలో మాజీ సీఎం గిరిధర గమాంగ్ బీఆర్ఎస్‌లో చేరాడు… పేరుకు మాజీ సీఎం తప్ప తనకు సొంతంగా బలమేముంది..?
1972 నుంచి వరుసగా గెలుస్తూనే ఉన్నాడు… అది కాంగ్రెస్ చలవే తప్ప తన బలమేమీ కాదు… తరువాత బిజూ జనతాదళ్ చేతిలో ఓడిపోయాడు… 80 ఏళ్ల వయస్సు… బీజేపీలో చేరాడు… ఈ వయస్సులో బీఆర్ఎస్‌లో చేరి ఇంకా రాజకీయాల్లో యాక్టివ్‌గానే ఉన్న తీరు అభినందనీయం… కానీ ఒడిశాలో తను ఇప్పుడు నిజానికి జీరో… మహారాష్ట్రలో బీఆర్ఎస్ తొలి కార్యకర్త, శివాజీ వారసుడు శంభాజీకి పొలిటికల్ నేపథ్యం పెద్దగా లేదు…
Ads
హైదరాబాదులో కొన్ని వాణిజ్య అవసరాల కోసమే తోట చంద్రశేఖర్ తదితరులు బీఆర్ఎస్‌లో చేరారనే ప్రచారం కూడా ఉంది… పైగా తనకు ఏపీలో పెద్ద సీనేమీ లేదు… కర్నాటకలో కుమారస్వామి ఉన్నాడు, కానీ ఈమధ్య మొహం చాటేస్తున్నాడు… ప్రకాష్‌రాజ్ ఉన్నాడు, తనూ దూరదూరంగానే ఉంటున్నాడు… సేమ్, ఈ శరత్ కుమార్…
ఈయనతో కూడా ఒరిగేదేమీ లేదు… మొదట్లో డీఎంకేతో ఉండేవాడు… తరువాత ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి పేరిట ఓ సొంత పార్టీ పెట్టుకున్నాడు… నాడార్ కమ్యూనిటీ ప్రయోజనాలే ముఖ్యంగా ఈ పార్టీ సిద్ధాంతాలు ఉంటయ్… తరువాత ఎఐడీఎంకే కూటమిలో చేరాడు… ప్రస్తుతం శాసనసభలో ఈ పార్టీ ప్రాతినిధ్యం జీరో… ఒక దశలో రెండు అసెంబ్లీ సీట్లు గెలిచారు గానీ అవన్నీ ఎఐడీఎంకే వోట్లే తప్ప శరత్ కుమార్ సొంత బలం ఏమీ లేదు… కేసీయార్ సార్, ఇలాంటోళ్లు ఏం ఉద్దరిస్తారు మనల్ని..? మన జెండా మోయలేడు, మన ఎజెండాను ముందుకు తీసుకెళ్లలేడు…!
Share this Article