Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Bad Girl … ప్రయోగాత్మక సినిమాయే… కానీ అశ్లీల కోణంతో ఫ్లాప్…

September 23, 2025 by M S R

.

తమిళం గానీ, మలయాళం గానీ… దర్శకులు ప్రయోగాలకు సాహసిస్తారు… వివాదాలకు జంకరు… సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు… న్యూ జనరేషన్ ఫిలిమ్స్ ఆలోచిస్తారు… తెలుగులో, కన్నడంలో పెద్దగా ప్రయోగాలు కనిపించవు, మూస కథలు… దిక్కుమాలిన హీరోయిజం తప్ప మరొకటి కానరాదు…

తమిళంలో బ్యాడ్ గరల్ అని ఓ మూవీ… ప్రముఖ దర్శకులు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మాతలు… వెట్రిమారన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టరుగా చేసిన వర్షా భరత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది… సినిమాలో ప్రధాన పాత్ర అంజలి శివరామన్ పోషించింది…

Ads

ట్రెయిలర్ రిలీజ్ కాగానే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి… ప్రత్యేకించి ఒక సెక్షన్‌ను తప్పుగా పోట్రే చేశారంటూ దేశవ్యాప్తంగా అభ్యంతరాలు… పైగా కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి… మద్రాస్ హైకోర్టు కూడా ఆ ట్రెయిలర్‌ను యూట్యూబ్ నుంచి తీసేయాలని ఆదేశించింది…

కానీ పలు ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో చిత్రానికి ప్రశంసలు వచ్చాయి… నిర్మాత, దర్శకులకు ధైర్యం వచ్చింది… సెన్సార్ బోర్డుకు వెళ్లారు… బోర్డు కూడా కొన్ని కట్స్ చెప్పింది… అవి తీసేసి విడుదల చేశారు… సరే, నిజంగా ఇక్కడి ప్రేక్షకుల తెలుసుకుందామని దర్శకురాలు కుటుంబసభ్యులతో థియేటర్ వెళ్లింది… వ్యతిరేకత ఏమీ కనిపించలేదు…

anjali

ఊపిరి పీల్చుకుంది… కానీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు సినిమా… ఇది ఒక యువతి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆమె ఎదుగుదల గురించి చెప్పే ఒక డ్రామా… ఇది ఒక ‘కమింగ్-ఆఫ్-ఏజ్’ చిత్రం.., ఇందులో ప్రధాన పాత్ర అయిన రమ్య (అంజలి శివరామన్) తన టీనేజ్ నుండి యువతిగా మారే ప్రయాణాన్ని చూపిస్తారు…

అంజలి శివరామన్ నటన దీనికి హైలైట్… ఈమె కేరళైట్… ఒకటీరెండు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌తో పాపులరైంది… తను సింగర్ కూడా… కథాంశం కంటే, ఒక యువతి ఆలోచనలు, ఆమె జీవితంలో జరిగే సంఘటనలను చిన్న చిన్న దృశ్యాల (vignettes) రూపంలో చూపించడం ఈ సినిమా ప్రత్యేకత…

anjali

సమస్య ఏమిటంటే..? ఎంచుకున్న కథ ఆసక్తికరంగా, బాగానే ఉన్నా… రియలిస్టిక్ పోకడలతో ఉన్నా… బోల్డ్ సీన్స్ ఉండటంతో ప్రేక్షకులు వ్యతిరేకించకపోయినా ఆదరించలేదు… కోలీవుడ్ ప్రేక్షకులకు నచ్చలేదు… ట్రెయిలర్ చూసి ప్రేక్షకులు అశ్లీల చిత్రమే అనుకున్నారు, దానికితోడు ఓ సెక్షన్ నుంచి వ్యతిరేకత… దాంతో సినిమా చుట్టూ ఓ వ్యతిరేక వాతావరణం నెలకొంది… అది మైనస్ అయిపోయింది…

కొన్ని సీన్స్ సెన్సార్ సూచనలకు మేరకు కత్తిరించినా సరే, ఇంకా కొంత అశ్లీలత అలాగే ఉండిపోయింది… ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా మరింత మందికి రీచయ్యేది..! మొత్తం మీద..: ఒక విభిన్నమైన, ప్రయోగాత్మక సినిమా చూడాలనుకునే వారికి ఇది నచ్చుతుందేమో…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజకీయ ఎదుగుదలకు ప్రేయసినే తార్చటానికి సిద్ధపడిన ఓ నాయకుడు..!!
  • నేములోనేముంది అనకండి..! ఇప్పుడు నామకరణమూ వ్యాపారమే..!
  • ప్రపంచంలోకెల్లా అందమైన టాప్-11 ఆటగత్తెలు వీళ్లేనట..!!
  • అక్కడ దుమ్ము రేపుతున్న షో… ఇక్కడ దుమ్ము కొట్టుకుపోయింది..!!
  • తొక్కిసలాట విషాదం… ఈ గుడి నిర్మాణం వెనుక ఓ ఇంట్రస్టింగు కథ…
  • ఒక కోట… ఒక బ్రహ్మి… ఎప్పుడు చూసినా నవ్వులు పండించే హిట్ మూవీ….
  • ఒక గొప్ప ఫోటో..! దీని వెనుక ప్రతి లీడర్ తప్పక చదవాల్సిన ఓ కథ..!!
  • నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ కథ…
  • గొప్పల తిప్పలు తరువాత… ముందు నీ గోచీ సరిచూసుకోవయ్యా ట్రంపూ…
  • ఇది ఆ పాత కాంగ్రెస్ కాదు… ఈ జుబ్లీ గుట్టల్లో కొత్తగా స్ట్రాటజిక్ అడుగులు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions