Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

25 ఏళ్లుగా ప్రతిరోజూ యోగా… పూర్తి శాకాహారం… ప్రతి సోమవారం ఉపవాసం…

March 22, 2024 by M S R

సినిమా, టీవీ, క్రికెట్, పొలిటికల్ సెలబ్రిటీల గురించి కథలు రాస్తాం మనం… చదువుతాం… ఇన్‌ స్పిరేషన్ అనుకుంటాం… కానీ పేరొందిన సైంటిస్టులు, కంపెనీ సీఈవోలు, చైర్మన్లు, ఖతర్నాక్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రత్యేకించి జడ్జిల గురించి మీడియా పెద్దగా పట్టించుకోదు… భిన్న రంగాల ప్రముఖుల జీవితాలు, జీవనశైలిపై ఇప్పుడిప్పుడే దృష్టిసారిస్తోంది… గుడ్…
మన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లీగల్ సర్కిళ్లలో మంచి పేరు ఉంది… సహజంగానే తన లైఫ్ స్టయిల్‌పై కూడా రీడర్స్‌కు ఆసక్తి ఉంటుంది… ఆయనది చంద్రచూడ్ వారసత్వం… తాత లాయర్, అంకుల్ లాయర్… తండ్రి ఎక్కువ కాలం సుప్రీం చీఫ్ జస్టిస్‌గా చేశాడు… ఇంట్రస్టింగు తీర్పులు ఎన్నో… ఆయన ఇద్దరు కొడుకులూ లాయర్లే… అభినవ్ ముంబైలో, చింతన్ లండన్‌లో… అంటే వరుసగా నాలుగో తరం కూడా లాయర్లే…
మొత్తం కుటుంబ వాతావరణమంతా సెక్షన్లు, రాజ్యాంగం, దావాలు, హక్కులతో నిండి ఉంటుంది… ఢిల్లీలో లా డిగ్రీ చేశాక, హార్వర్డ్ లా మాస్టర్స్ స్టూడెంట్ తను… తరువాత ముంబై, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీస్… 38 ఏళ్లకే సీనియర్ అడ్వొకేట్… తరువాత హైకోర్టు జడ్జిగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఏకంగా సుప్రీం చీఫ్ జస్టిస్…

27-చంద్రచూడ్-మరియు-తండ్రి-YV-చంద్రచూడ్
( తండ్రిలాగే, కొడుకు..: చంద్రచూడ్ తన తండ్రి వై.వి. చంద్రచూడ్‌తో…)

ఇదంతా ది వీక్ మీడియాలో వచ్చింది… రీసెంటుగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ స్టయిల్ వివరాలూ షేర్ చేసుకున్నాడు… ‘‘నా దినచర్య తెల్లవారుజామున 3.30 గంటలకు స్టార్టవుతుంది… అప్పుడు వాతావరణం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది… (బ్రాహ్మిముహూర్తం)… 25 ఏళ్లుగా నేను యోగా చేస్తున్నాను… యోగా చేసే టైమ్ కూడా అదే…’’

cji

Ads

కేన్సర్ కారణంగా 2007లో తన భార్య రష్మిని కోల్పోయాడు… తరువాత కల్పనా దాస్ తన జీవితంలోకి వచ్చింది… ఆమెతో కలిసి ఆయుర్వేద డైట్ ఫాలో అవుతాడు… ‘‘నా బెస్ట్ ఫ్రెండ్ తనే’’ అంటాడు… ‘‘ఇద్దరమూ శాకాహారులమే… ప్లాంట్ బేస్డ్ లైఫ్ స్టయిల్… మన ఆహారం మన బ్రెయిన్ మీద ప్రభావం చూపిస్తుందని విశ్వసిస్తాను… మన ఫిట్‌నెస్ కూడా మన లోపల నుంచి, మన బ్రెయిన్ నుంచి, మన హృదయం నుంచి రావల్సిందే…

నా జీవితంలోనూ ఎత్తుపల్లాలున్నయ్… సమస్యలను అధగమిస్తామనే ఆశావాదంతో, నమ్మకంతో ఉండటమే శరణ్యం… ప్రతి కష్టానికి ఓ ప్రయోజనం ఉంటుంది… కష్టం వచ్చినప్పుడు అది తెలియదు, తరువాత తెలుసుకుంటాం… ఫుడ్ విషయానికి వస్తే తృణధాన్యాలకన్నా రాందాణా ఇష్టపడతాను… (దీన్నే రాజగిర royal grain అంటారు, బాగా పోషక విలువలున్న ఫుడ్)… 25 ఏళ్లుగా నేను ప్రతి సోమవారం ఉపవాసం ఉంటాను… మహారాష్ట్రలో ఉపవాసం రోజుల్లో సాబుదానా కిచిడీ చేస్తారు… అదీ మంచిదే… ఈ ఫుడ్ అలవాట్లకు అప్పుడప్పుడూ బ్రేక్ (చీట్ డే) ఉంటుంది… ఐస్‌క్రీమ్ తింటాను… మన మైండ్ మన కంట్రోల్‌లో ఉంటే సగం సమస్యలు అవే పరిష్కారం అవుతాయి..’’

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions