Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ చిన్న పాట వందల మందిని చంపేసింది… ఆ రచయితను కూడా..!!

September 6, 2025 by M S R

.

ఒక పాట… ఒకే ఒక పాట… 62 ఏళ్లపాటు బ్యాన్ చేశారు… ఆ పాట విని, వికలమైపోయి, దాదాపు 200 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు… అవును, ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన పాట అది…

మనకు తెలుసు… పాట ప్రభావం… అవి తిరుగుబాటును ప్రేరేపించగలవు… భక్తిలో మునకలు వేయించగలవు… మనిషిని అధోలోకంలో లేదా అదో లోకంలోకి పంపించగలవు… ట్యూన్, భావం, లోతు అన్నీ పనిచేస్తాయి…

అంతెందుకు..? గద్దర్ పాటలు ఎంతోమందిని అజ్ఞాతంలోకి పంపించాయి… ఎందరో ఎన్‌కౌంటర్… ఎన్నో జీవితాల్లో కల్లోలం… పాట ప్రభావం… తన కుటుంబం మినహా… వాళ్లు సేఫ్… అదే ఐరనీ…

Ads

సరే, మనం చెప్పుకునే పాట విషయానికొద్దాం… దాని పేరు GLOOMY SUNDAY … రాసింది Rezso Seress… తనది హంగరీ… ఈ పాట రాసినప్పుడు తను చాలా డిప్రెషన్‌లో ఉన్నాడు… కారణం… తన గరల్ ఫ్రెండ్ తనను వదిలేసి వెళ్లింది…

ఆ బాధలో రాశాడు… అంతేకాదు, అప్పులు బాధ అదనం… 1935లో విడుదల చేసిన పాట ప్రపంచవ్యాప్తంగా మోగిపోయింది… ఆ పాట ఎంత కదిలించిందీ అంటే, అసలే బాధలో ఉన్నవాళ్లను ఏకంగా ఆత్మహత్యలకు పురికొల్పింది…

అందుకే 62 సంవత్సరాల బ్యాన్ అమలైంది… తరువాత 2003లో బ్యాన్ ఎత్తివేశారు… కానీ కథలో పెద్ద ట్విస్ట్ ఏమిటంటే..? ఆ పాట రాసిన రచయిత కూడా ఆత్మహత్య చేసుకున్నాడు… మరింత వివరంగా…



ఇది కేవలం ఒక పాట కాదు.., దీనికి ఒక విషాద చరిత్ర ఉంది… “హంగేరియన్ సూసైడ్ సాంగ్” (Hungarian Suicide Song) అని పిలవబడే ఈ పాట ఆ కాలంలో ఎందరో ఆత్మహత్యలకి ప్రేరణగా నిలిచింది… సెరెస్ తన ప్రియురాలితో విడిపోయిన బాధలో ఈ పాటని రాశాడని అంటారు…

ఆ ప్రేమ విఫలం అయిన తర్వాత అతని జీవితంలో కలిగిన నిరాశ, ఒంటరితనం ఈ పాటలో ప్రతి అక్షరంలోనూ కనిపిస్తాయి… అయితే, ఈ పాటని మొదట ప్రచురించడానికి ఎవరూ ముందుకు రాలేదు… ఆ తర్వాత కొన్నేళ్లకి, 1935లో ఈ పాటని ప్రచురించగా, ఊహించని విధంగా అది ప్రపంచవ్యాప్తంగా విషాద తరంగాలను సృష్టించింది…

ఈ పాట విన్నవారు తమ జీవితాలను ముగించుకోవడానికి ప్రేరేపితులయ్యారని వార్తలు వచ్చాయి… బ్రెజిల్ నుండి హంగేరీ వరకు, ఇంగ్లాండ్ నుండి అమెరికా వరకు ఈ పాటతో సంబంధం ఉన్న ఆత్మహత్యల గురించి పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి…

అయితే, నిజానికి ఈ పాట వల్లనే ఆత్మహత్యలు జరిగాయా లేదా ఆ కాలంలో ఉన్న ఆర్థిక మాంద్యం, రాజకీయ అస్థిరత వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయా అనేది స్పష్టంగా తెలియదు… కానీ ఈ పాట వల్ల అనేక ఆత్మహత్యలు జరిగాయని, దీనితో చాలా దేశాల్లో ఈ పాటని రేడియో స్టేషన్లలో నిషేధించారు…

ఈ పాట వెనుక ఉన్న మరో విషాదకరమైన నిజం ఏంటంటే, ఈ పాట రాసిన రేజో సెరెస్ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు… 1968లో అతను బుడాపెస్ట్‌లోని ఒక భవనంపై నుండి దూకి తన జీవితాన్ని ముగించుకున్నాడు…

“Gloomy Sunday” కేవలం ఒక విషాదకరమైన పాట మాత్రమే కాదు, అది మానవ భావోద్వేగాల లోతును, మనస్సుకు కలిగే ఒంటరితనాన్ని, నిరాశను ప్రతిబింబిస్తుంది… ఈ పాట ఇప్పటికీ ఒక బ్లాక్ లెజెండరీ సాంగ్‌గా మిగిలిపోయింది… ఇది కళ, సంగీతం మనపై ఎంత ప్రభావం చూపుతాయో మనకు గుర్తు చేస్తుంది…

ఈ పాట సాహిత్యం నిరాశ, వేదన,  మరణం అనే అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తుంది… పాటలో ఉన్న కొన్ని భాగాలు ఈ విధంగా ఉంటాయి:

  • “Gloomy is Sunday, with shadows I spend it all, My heart and I have decided to end it all…”

ఈ వాక్యాలు అప్పటి నిరాశను, లోతైన దుఃఖాన్ని సూచిస్తాయి… పాట మొత్తం కూడా ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు, ఒక వ్యక్తి తన జీవితాన్ని ముగించుకోవడానికి సిద్ధపడే మనస్తత్వాన్ని వివరిస్తుంది… పాట మొదటి భాగంలోని సాహిత్యం ఒక వ్యక్తి ఆత్మహత్య గురించి, అతని మరణానంతరం ప్రశాంతతను వెతకడం గురించి ఉంటుంది…

ఈ పాట యొక్క సంగీతం విషాదకరమైనది… పియానో ప్రధానంగా ఉపయోగించబడింది.., ఇది వినేవారి మనసులో ఒక రకమైన బరువు,  భారమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది… పాట ప్రారంభం నుంచి చివరి వరకు నెమ్మదిగా, వేదనతో సాగుతుంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Anjana Krishna IPS …. ఇంతకీ ఎవరీ లేడీ సింగం..? ఏమిటీ వివాదం..?!
  • మౌనమే మన స్ట్రాటజీ… ట్రంపుడు అందుకే అగ్గిమండిపోతున్నాడు…
  • కుటుంబమే వదిలేసేసరికి… ఇక కవితపై పింక్ శ్రేణుల ఉగ్ర దాడి..!
  • కారుతో పులిని గుద్దేశాడు… పులి హతం, కారు పల్టీ… దేహమంతా గాయాలు…
  • పెప్పర్ వడ విత్ రసం… ఆహా… సరిగ్గా కుదరాలే గానీ అదుర్స్…
  • Pure Veg Mineral Water…! అంతా మాయ.., అంతా మన భ్రమ… అంతా ఓ దందా…
  • ‘‘ నెల రోజులపాటు పొద్దున్నే రండి.., జీవితాంతం ఉద్యోగభద్రత ఇస్తా ’’
  • ఆ చిన్న పాట వందల మందిని చంపేసింది… ఆ రచయితను కూడా..!!
  • మదరాసి..! మరీ గజిని మార్క్ కాదు… ఏదో ఓ సగటు సౌత్ సినిమా మాత్రమే…!!
  • దేవనపల్లి కవిత..! గులాబీ యాదవ శిబిరంలో అసలైన ముసలం..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions