Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కన్నడనాట మరో ‘పవిత్ర’… హీరో, హీరోయిన్ అరెస్టు, మర్డర్ కేసు…

June 11, 2024 by M S R

దర్శన్ … ఓ కన్నడ హీరో… చాలా సీనియర్… 47 ఏళ్లు చిన్న మొల్లేమీ కాదు, అనగా చిన్న పిల్లాడేమీ కాదు అని… సినిమా ఫ్యామిలీయే… తండ్రి తూగుదీప శ్రీనివాస్ కూడా నటుడే… దర్శన్ సోదరుడు దినకర్ నటుడు, దర్శకుడు, నిర్మాత… దర్శన్ కూడా డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కమ్ హీరో… ఛాలెంజింగ్ స్టార్ అంటారట ఆయన్ని…

2003లో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ధర్మస్థల వెళ్లి విజయలక్ష్మి అనే స్టూడెంట్‌ను పెళ్లి చేసుకున్నాడు… ఇదీ ఆయన నేపథ్యం… ఇదే విజయలక్ష్మి 2011లో దర్శన్ నన్ను గృహహింసకు గురిచేస్తున్నాడు అని పోలీస్ కంప్లయింట్ ఇస్తే పోలీసులు తనను అరెస్టు చేశారు, 14 రోజులపాటు పరప్పన అగ్రహార జైలులో గడిపాడు…

2016లో అభ్యంతకర ప్రవర్తన పేరిట మళ్లీ కంప్లయింట్ చేసింది ఆమె… 2021లో మైసూరు హోటల్‌లో వెయిటర్‌ను కొట్టాడు… 50 వేలు ఇప్పించి ఈ కేసు పోలీసులే సెటిల్ చేశారట… ఈయన గారికి ఓ ప్రైవేటు జూ కూడా ఉంది… ఓసారి ఫారెస్ట్ ఆఫీసర్లు రెయిడ్ చేసి నియమోల్లంఘనల్ని గుర్తించి కొన్ని జీవులను స్వాధీనం చేసుకున్నారు… భరత్ అనే ఫిలిమ్ ప్రొడ్యూసర్‌ను నీ అంతు చూస్తాను అని బెదిరించినట్టు మరో పోలీస్ కంప్లయింట్ ఉంది…

Ads

మొత్తానికి మనకేం అర్థమవుతోంది… ఇదొక తిక్క కేసు అని..! పెద్ద కంట్రవర్సీ అని…! సరే, ఒరిజినల్ భార్యతో సంబంధాలు బాగాలేవు… ఇక పవిత్ర గౌడ అనే నటితో కనెక్టయ్యాడు… ఆమె ఎవరు..? తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్ కమ్ ఫ్యాషన్ డిజైనర్… ఖుషీ అనే బిడ్డ కూడా..! చాన్నాళ్లుగా వీళ్లిద్దరి నడుమ వివాహేతర సంబంధం ఉందని కన్నడ మీడియా, సోషల్ మీడియా గాసిప్స్ రాస్తూనే ఉంది… వాళ్లూ పెద్దగా ఖండించరు…

దర్శన్‌తో తన ఫోటోల్ని కూడా పోస్ట్ చేస్తుందామె తన సోషల్ మీడియాలో ఖాతాల్లో… ఎప్పుడైనా దర్శన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తే తీసేస్తుంటుంది, మళ్లీ కొత్తవి పెడుతుంటుంది… బహుశా సహజీవనమేమో… ఇక ఇప్పుడు కథేమిటంటే..?

రేణుకాస్వామి … 33 ఏళ్లు… చిత్రదుర్గలో అపోలో ఫార్మసీలో చేస్తాడు… ఈ చిత్రదుర్గకు అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు పంపిస్తుంటాడట… వీడి మృతదేహం కామాక్షిపాళ్యలోని ఓ అపార్ట్‌మెంట్‌ దగ్గర డ్రైనేజీలో దొరికింది… ఒరేయ్, మా పవిత్ర జోలికి వస్తే ఖతమైపోతావ్ అని గతంలోనే దర్శన్ హెచ్చరించినట్టు సమాచారం… తీరా ఇప్పుడు పోలీసులు కేసు పెట్టేసి, దర్శన్, పవిత్ర సహా 9 మందిని బుక్ చేశారు, అరెస్టు చేశారు…

ఏదో వీడియో ఉందట, అందులో దర్శన్, తన గ్యాంగ్ రేణుకాస్వామి కొడుతున్న సీన్లున్నాయట… తరువాత తీసుకెళ్లి ఓ డ్రైనేజీలో పారేశారట… సినిమా కథ అనిపిస్తోందా..? ఎందుకొచ్చిన ఈ ‘అక్రమ సంబంధాలు’, వేధింపులు, హత్యలు అనిపిస్తోందా..? అంతే, నిజమే… కానీ సొసైటీలో ఇలాంటివెన్ని జరగడం లేదు… కాకపోతే ఆల్రెడీ ఓ నొటోరియస్ మెంటాలటీ ఉన్న దర్శన్ వంటి హీరో ఇన్వాల్సయిన కేసు కాబట్టి కన్నడనాట కలకలం రేపుతోంది…!!

ప్చ్… ఈమధ్య పవిత్ర అనే పదానికి కన్నడంలో గ్రహచారం బాగాలేనట్టుంది… సీనియర్ నరేష్ సహజీవనం చేసే పవిత్రది ఒక స్టోరీ… ఈమధ్య రోడ్డు ప్రమాదంలో మరణించిన టీవీ సీరియళ్ల నటి పవిత్రా జయరాంది మరో స్టోరీ… ఇప్పుడు ఈ పవిత్ర గౌడది ఇంకో స్టోరీ… అన్నీ పవిత్రబంధాలే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions