.
“హోమ్‌బౌండ్” సినిమా భారతదేశం నుంచి 2026 ఆస్కార్ “Best International Feature Film” కేటగిరీలో అధికారికంగా ఎంపికయ్యింది… ఈ నిర్ణయం 12 మంది సభ్యులతో ఉన్న సెలక్షన్ ప్యానల్ తీసుకుంది…
అసలు ఏమిటి ఈ సినిమా..? 2020లో న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన ‘Taking Amrit Home’ అనే ఆర్టికల్ ఆధారంగా రాసుకున్న రియల్ స్టోరీ… పెద్ద పేరున్న దర్శకుడేమీ కాదు… నీరజ్ ఘైవాన్… షార్ట్ ఫిలిమ్స్, అంథాలజీ ఫిలిమ్స్, టీవీ సీరియల్స్ … అవీ ఎక్కువేమీ కాదు… ఈ హోమ్‌బౌండ్‌కు ముందు మాసాన్ సినిమాకు గాను చాలా ప్రశంసలు వచ్చాయి…
Ads
తనను నమ్మి కరణ్ జోహార్, తన మిత్రులు ఈ సినిమాను నీరజ్‌కు అప్పగించారు… Cannes Film Festival 2025 లో ఈ సినిమాకు 9 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ లభించింది… టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF 2025) International People’s Choice Award లో 2nd runner-up…
ఇంకా సినిమా థియేటర్లలోకి రాలేదు… ఈనెల 26 న రిలీజ్… ఈ సినిమా కథలో ఇద్దరు స్నేహితులు ప్రధాన కథానాయకులు… ఈ పాత్రలు పోషించిన విశాల్ జెత్వా, ఇషాన్ ఖత్తర్ కూడా అప్‌కమింగ్ స్టార్సే… శ్రీదేవి బిడ్డ జాన్వీ కపూర్ ఓ స్టార్ అట్రాక్షన్… కాకపోతే ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఏమీ లేదు… హీరోలు మాత్రం బాగా నటించి, అందరి ప్రశంసలూ పొందుతున్నారు…
ఈ కథ ఉత్తర భారతదేశంలోని మాపూర్ అనే ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది… పోలీసు అధికారులు కావాలనే ఒకే కల ఉన్న ఇద్దరు చిన్ననాటి స్నేహితులు, చందన్ కుమార్ (విశాల్ జెత్వా), షోయబ్ అలీ (ఇషాన్ ఖత్తర్) ల గురించి ఈ సినిమా…
ఆ ఇద్దరికీ ఖాకీ బట్టల పోలీస్ పోస్ట్ ఉపాధి కోసం కాదు… అదొక గౌరవం, అదొక స్టేటస్… వాటి కోసం వాళ్లు పడే కష్టాలు చూపిస్తూ దర్శకుడు …. సామాజిక కట్టుబాట్లు, వివక్ష, గ్రామీణ జీవితాలను చిత్రీకరించాడు…
ఇషాన్ ఖత్తర్ షోయబ్ అనే ముస్లిం యువకుడి పాత్రలో చాలా సహజంగా నటించాడు… షెడ్యూల్డ్ కులాల నేపథ్యం నుంచి వచ్చిన యువకుడిగా, వివక్షకు గురయ్యే చందన్ పాత్రలో విశాల్ జెత్వా కూడా అంతే శక్తివంతంగా నటించాడు… జాన్వీ కపూర్ చిన్న పాత్ర…
కుల వివక్ష, వ్యవస్థాగత అసమానతలు వంటి కఠిన వాస్తవాలను చూపించడానికి దర్శకుడు వెనుకాడలేదు… కాకపోతే ఆ సీరియస్‌నెస్ కొంత డైల్యూట్ చేయడానికి కామెడీని వాడుకున్నాడు అక్కడక్కడా… ప్లెయిన్ బీజీఎం… స్ట్రెయిట్ కథనం… ఇదొక వాస్తవిక, ఆలోచనాత్మక సినిమా…!!
Share this Article