.
దోగిపర్తి సుబ్రహ్మణ్యం రాసిన సిరివెన్నెల సినిమా సమీక్ష పబ్లిష్ చేస్తున్నప్పుడు… అసలు మూన్ మూన్ సేన్ ఒకే ఒక సినిమాతో తెలుగులో ఇంత పాపులర్ అయ్యింది కదా… అసలు ఎవరామె..? ఆమె కథేమిటి..? వంటి ప్రశ్నలు బయల్దేరాయి…
చాలా విశేషాలున్నయ్… తెలుగులో సిరివెన్నెల మాత్రమే కాదు, అదే 1987లో మజ్ను సినిమాలో కూడా చేసింది… అంతే, ఈ రెండు మాత్రమే… పుట్టుపేరు శ్రీమతి సేన్… ప్రస్తుత వయస్సు 71… తన జీవితకాలంలో చేసిన సినిమాలు దాదాపు 60… హిందీ, బెంగాలీ, మలయాళం, కన్నడ, తెలుగు, మరాఠీ… 40 టీవీ సీరియళ్లు…
Ads
ఈమె తల్లి సుచిత్రాసేన్… పాపులర్ బెంగాలీ నటి… పెద్ద ధనిక ఫ్యామిలీ వీళ్లది… తండ్రి దీపనాథ్ సేన్… తాత దీనానాథ్ సేన్ త్రిపుర మహారాజు దగ్గర దివాన్ గా చేసేవాడు…
నటన మాత్రమే కాదు, చిత్రలేఖనం నేర్చుకుంది ఈమె… టీచర్‌గా పనిచేసింది… పెళ్లికి ముందే ఓ బిడ్డను దత్తత తీసుకుంది… తనకు పిల్లలు పుట్టాక నటించడం స్టార్ట్ చేసింది… రైమా సేన్, రియా సేన్, ఆ ఇద్దరు పిల్లలూ నటులే ఇప్పుడు… తను పెళ్లి చేసుకున్నది త్రిపుర రాజవంశీకుడు, పేరు భరత్ దేవ్ వర్మ…
ఈమె అత్తగారు ఎవరో తెలుసా..? ఇలాదేవి… ఈమె కూచ్‌బెహర్ రాణి ఇందిరా రాజే కుమార్తె… జైపూర్ మహారాణి గాయత్రిదేవికి స్వయానా అక్క… ఈ గాయత్రి అందం చూసి ఇందిరాగాంధీ కూడా కుళ్లుకునేది… చాన్స్ దొరికినప్పుడు ఆ ఈర్ష్యను ప్రదర్శించింది కూడా… ఆమె ఆసక్తికరమైన కథకు లింక్ ఇదుగో….
మూన్ మూన్ సేన్ తన పిల్లలతో కలిసి మొదట్లో చేసిన యాడ్స్ గానీ, తను చేసే సినిమాలు గానీ… వివాదాలే..! శృతిమించి ఉంటాయి, బోల్డ్‌గా చేస్తుంది అనైతిక పాత్రల్ని… అలా ఎప్పుడూ కంట్రవర్సీలో ఉండేది… ఐనా భర్త ఎప్పుడూ అభ్యంతరపెట్టేవాడు కాదు, నీ కెరీర్ నీ ఇష్టం అనేవాడు… ఐనా సినిమాల్లో పెద్ద సక్సెస్ ఏమీ కాలేకపోయింది…
2014లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరింది… వరుసగా 9సార్లు గెలిచిన ఓ సీపీఎం నాయకుడి మీద బంకూరా నియోజకవర్గం నుంచి గెలిచింది… నిజంగా మమతా బెనర్జీ రాజ్యసభకు లేదా లోకసభకు ఎక్కువగా పాపులర్ టీవీ, సినిమా సెలబ్రిటీలను ఎందుకు ఎంచుకుంటుందో అర్థం కాదు… పైగా కాస్త కంట్రవర్సీ కేరక్టర్లను… మిమి చక్రబర్తి, నుస్రత్ జహాన్, దేవ్, మూన్ మూన్ సేన్… ఇలా… సెలబ్రిటీ కాకపోయినా మహువా మొయిత్ర వంటి వివాదాస్పద కేరక్టర్లు కూడా మమతకు ఇష్టులే…
Share this Article