Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్… ఒడిశాలో క్షీణావస్థే ప్రబల ఉదాహరణ…

June 8, 2024 by M S R

ఎన్ని అనుభవాలు అయినా , ఎన్ని గుణపాఠాలు ఉన్నా పాఠాలేమీ నేర్చుకోని ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ . కాంగ్రెస్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేకపోయిన రాష్ట్రం ఒరిస్సా . ఆఖరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి జానకీ వల్లభ్ పట్నాయక్ . బహుశా ఈతరం వారికి ఆ పేరు కూడా గుర్తు ఉండి ఉండదు . 2000 వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యారు .

24 సంవత్సరాలుగా ఆయనే ముఖ్యమంత్రి . నిరాడంబరుడు , నిశ్చలతత్వుడు . ఆయన 24 ఏళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా , ఒరిస్సా ప్రజలు ఆయన్ని వదులుకోవటానికి ఇష్టపడలేదు . ఈ 24 ఏళ్ళలో ప్రత్యామ్నాయ పార్టీగా ప్రొజెక్ట్ చేసుకోవటంలో కాంగ్రెస్ ఘోరాతిఘోరంగా విఫలమయింది .

1995 ఎన్నికల నుండి 2024 ఎన్నికల వరకు ఒరిస్సా అసెంబ్లీలో కాంగ్రెస్ సీట్లు , ఓట్ షేర్ ఇక్కడ ఇచ్చాను . నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా కాంగ్రెస్ ఓట్ షేర్ ప్రస్తుతానికి 13.3% కు జారిపోయింది .

Ads

odisha

ఏ రాజకీయ పార్టీ అయినా దేశంలో , రాష్ట్రాలలో తమ పరిస్థితిని నిరంతరం అధ్యయనం చేసుకోవాలి . బలాలు , బలహీనతలు , అవకాశాలు , సవాళ్లు బేరీజు వేసుకుంటూ ఉండాలి . అందుకు ఆయా పార్టీల వార్ రూములు చాలా ఏక్టివ్ గా ఉండాలి . Knee jerk reactions ఉండాలి . ఈ విషయంలో కాంగ్రెస్ గత ముప్పై ఏళ్ళలో చాలా వెనుకపడి పోతూ వస్తుంది .

దేశానికి కాంగ్రెస్ అవసరం ఏంటి ? చాలా ఉంది . ఇప్పటికీ Secular , liberal , inclusive , left oriented centerist పార్టీ ఇది ఒక్కటే . దురదృష్టవశాత్తు నేటి కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి దేశం పట్ల తమకున్న బాధ్యత తెలియదు . ఎన్నికల్లో గెలుపు అధికారం కోసం కాదు . ఎక్కువ మంది ప్రజల శ్రేయస్సు , అభివృద్ధి . ఈ మర్మం తెలియనన్నాళ్ళు కాంగ్రెస్ ప్రత్యమ్నాయ పార్టీగా ఎదగలేదు .

77 సంవత్సరాల నవీన్ పట్నాయక్ అలిసిపోయాడని అందరికీ తెలుసు . ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమనీ తెలుసు . మరో పార్టీకి అవకాశం ఉందనీ తెలుసు . అయినా ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవటంలో కాంగ్రెస్ విఫలం కావటం దురదృష్టం . ఈ ఎన్నికల నుండి కాంగ్రెస్ ఏమయినా పాఠం , గుణపాఠం నేర్చుకుంటే బాగుంటుంది . నిరంతర శ్రమతో ప్రజల ఆదరణతో అధికారంలోకి వస్తున్న భా జ పాకు శుభాభినందనలు … (డోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గుడిమల్లం..! ఉల్కశిల నుంచి చెక్కిన తొలి శివలింగ మూర్తి..?!
  • తాజా ఏబీసీ ఫిగర్స్… ఈనాడు- సాక్షి- ఆంధ్రజ్యోతి… ఏది ఎక్కడ..!!
  • ఒక మీడియా హౌజ్… ఆఫీస్ క్లోజ్… అందరూ కలం పోరాటయోధులే మరి..!!
  • Mirai..! భిన్నమైన ఓ కథకు రక్తికట్టించే ప్రజెంటేషన్… గుడ్ ఔట్‌పుట్…
  • పెద్ద థ్రిల్ ఏమీ లేదు… సినిమా మొత్తం చూడాల్సి రావడమే ఓ హారర్…
  • ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనగా… ప్రయోగశాలల్లో పెంచబడిన వజ్రాలు…
  • వారసత్వమంటే బీజేపీకి పడదట… కానీ టీ-స్టేట్ కమిటీలో ఆరుగురు వాళ్లే..!!
  • కేసీయార్ స్కామ్స్ చూసీచూడనట్లు వదిలేయాలా… ఎందుకు..?!
  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…
  • బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions