.
ఒకప్పటి టాప్ స్టార్లలో ఒకరు రత్ని అగ్నిహోత్రి… గుర్తుంది కదా… కమల్‌హాసన్‌నతో ‘హమ్ బనే తుమ్ బనే ఏక్ దూజేకే లియే’ అంటూ దేశవ్యాప్తంగా పాపులరైంది… వరుసగా బోలెడు అవకాశాలు… హిందీయే కాదు, తెలుగు, తమిళం, కన్నడం, ఉర్దూ కూడా…
పుట్టింది ముంబైలో, ఓ పంజాబీ కుటుంబంలో… తండ్రి కొలువు కోసం చెన్నైకి షిఫ్టయ్యారు… భారతీరాజా ఆమెను పికప్ చేసి, భాగ్యరాజాతో ఓ సినిమాలో నటింపజేశాడు… హిట్… ఇంకేం..? 3 ఏళ్లలో ఏకంగా 32 సినిమాలు చేసిందామె…
Ads
1979 నుంచి 1987 వరకు హవా నడిచింది… కానీ 1988 నుంచి హఠాత్తుగా తెర మీద మాయమైంది… ఏమైంది..? నిన్న ఆమె బర్త్ డే అట… 65 ఏళ్లు… సోషల్ మీడియాలో ఆమె గురించి పోస్టులు, అభినందనలు, శుభాకాంక్షలు… అసలు ఆమె ఏం చేస్తున్నది ప్రస్తుతం అని ఆరా తీస్తే… అదీ ఓ డెస్టినీ స్టోరీయే…
కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే… 1985లో అనిల్ విర్వాణి అనే ఓ ఆర్కిటెక్ట్ కమ్ బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకుంది… ముందస్తు షరతు కావచ్చు, పెళ్లయ్యాక కొన్నాళ్లకు పాత అగ్రిమెంట్లన్నీ ఫుల్‌ఫిల్ చేసి, ఇక నటన మానేసింది…
తరువాత ఇంట్లో గొడవలు… 2001 లో రీఎంట్రీ ఇచ్చింది… ఏ పాత్ర దొరికినా చేయడం స్టార్ట్ చేసింది… ఇంట్లో గృహహింస… లూనావాలాలో విడిగా ఉండసాగింది… భర్త నుంచి ఇబ్బందులు పెరగడంతో 2015లో పోలీసులకు ఫిర్యాదు చేసింది… తరువాత ఆమే చెప్పింది…
- ‘‘30 ఏళ్లపాటు గృహహింస… కొడుకు తనూజ్ విర్వాణి కోసం భరించాను… ఇక విసిగిపోయి ఫిర్యాదు చేశాను’’
తరువాత సినిమాలు మానేసి పోలాండ్ వైపు మళ్లింది… అక్కడ ఏం పని అంటారా..? ఆమె సోదరి అనిత అగ్నిహోత్రి అక్కడ ఉంటున్నది… ఆమె మాజీ మిస్ ఇండియా, కాస్ట్యూమ్ డిజైనర్… సొంతంగా పోలాండ్‌లో ఓ ఇండియన్ రెస్టారెంట్ స్టార్ట్ చేసింది…

అందులో భాగస్వామిగా చేరిన రతి అగ్నిహోత్రి Szczecin అనే నగరంలో “BOMBAY” అనే పేరుతో రెస్టారెంట్ల చెయిన్ (chain of restaurants)ను స్థాపించింది… ‘‘నాకు వంట అంటే చాలా ఇష్టం, మా రెస్టారెంట్లలోని వంటకాల తయారీని, రెసిపీలను (వంట చిట్కాలు/ విధానాలను) దగ్గరుండి చూసుకుంటాను… నాకు నటన కంటే వంటే బాగా వచ్చు’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది…
పోలాండ్ వ్యాపార కేంద్రమే కాదు ఆమెకు… గత జీవితపు చికాకుల నుంచి విముక్తి కేంద్రం… ఏడాదికి 3 నెలలు అక్కడే గడుపుతుంది… మిగతా కాలం లూనావాలాలో కొడుకుతోపాటు ఉంటుంది… తను బాలీవుడ్ సినిమా, టీవీ ఇండస్ట్రీలో చిన్న నటుడు…
సీన్ కట్ చేస్తే… మళ్లీ భర్త ఆమె దగ్గరకు వచ్చాడు… రాజీపడదాం, కలిసి ఉందాం అన్నాడు… ఆమె అంగీకరించింది… (అధికారికంగా విడాకులు ఏమీ తీసుకోలేదు అప్పటికి, విడిగానే ఉంటున్నారు…) ప్రస్తుతం అంతా ప్రశాంతం… ఆమె నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పింది.., ప్రస్తుతానికి తిరిగి సినిమాలు చేసే ఉద్దేశం లేదని కూడా అంటోంది…
ఎన్టీయార్ కుటుంబానికి క్లోజ్
చిరంజీవి (పున్నమి నాగు), శోభన్‌బాబు (జీవిత రథం) వంటి హీరోలతో కూడా చేసినా ఎన్టీయార్ కుటుంబంతో ఆమెకు సాన్నిహిత్యం… 1981లో తిరుగులేని మనిషి, తరువాత కలియుగ రాముడు, వయ్యారి భామలు-వగలమారి భర్తలు, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర… ఇలా… అంతేకాదు, 2016లో బాలయ్య డిక్టేటర్‌లో కూడా కనిపించింది…!!
Share this Article