Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ క్షణం, ఉరికి వేలాడేదే… ఒక ఆలోచనకి, కొత్త బతుక్కి మదిలో పురుడు…

January 28, 2025 by M S R

.

పోటీ పరీక్షల్లో ఎలా చదివారు..,? సివిల్స్ ఎలా బ్రేక్ చేశారు..? ఏ బ్యాచ్, ఏ ర్యాంక్, ఎన్ని మార్కులు, ఏ సబ్జెక్టు, ఎన్నిసార్లు దండయాత్ర, రోజుకు ఎన్ని గంటలు చదివారు..? మంచి ర్యాంకులు సంపాదించిన సివిల్స్ క్రాకర్స్ సక్సెస్ స్టోరీలు బోలెడు చదువుతుంటాం…

వాటిల్లో కొన్ని మాత్రమే పేద, గ్రామీణ, అణగారిన సామాజికవర్గాల నేపథ్యం నుంచి వచ్చిన కథలుంటాయి… అవి స్పూర్తిదాయకమే… చాన్నాళ్లుగా సోషల్ మీడియాలో మరో భిన్నమైన సక్సెస్ స్టోరీ కనిపిస్తోంది…

Ads

సరే, సోషల్ మీడియాలో కథలంటేనే ఎక్కువ శాతం ఫేక్ కదా… ఇది నిజమో కాదో చెక్ చేస్తే పలు ఇంగ్లిష్ జాతీయ పత్రికలు, సైట్లలోనూ కనిపించింది… అలాంటి ఓ ఇన్‌స్పయిరింగ్ పోస్టు చదువుదాం… (సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో మరోసారి గుర్తుచేసుకుందాం)…

ఒక్క క్షణం గడిస్తే.. ఆమె మెడకు ఉరిపడేదే ! ప్రాణాలు గాలిలో కలిసిపోయేవే… ఏడ్చీ ఏడ్చీ ఆమె కళ్లల్లో ఇక ఒక్క బొట్టు కూడా మిగల్లేదు… ఆమె పేరు సవితా ప్రధాన్… ఒక్కసారి ఆమె నేపథ్యంలోకి వెళ్తే…

ఓ గిరిజన గ్రామంలో పుట్టింది… తునికాకు ఏరుకుని బతికే ఓ చిన్న కుటుంబం… ఏడుగురు పిల్లలు… ఈమె టెన్త్ పాసైంది… ఆ ఊళ్లో టెన్త్ పాసైన తొలి మహిళ… ఆమెను చదివించాలని లేకపోయినా తనకొచ్చే రూ.75 స్కాలర్‌షిప్‌ డబ్బులు, ఒక పూట జావ, జత యూనిఫాం కోసం పాఠశాలలో చేర్చారు ఆమెను…

తరువాత ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్లి ప్లస్ టూ దాకా చదువుకుంది… రావడానికి రెండు రూపాయలు, వెళ్లడానికి రెండు రూపాయలు… కానీ ఆమె దగ్గర లేక నడిచే వెళ్లేది…

savitha pradhan

తరువాత పెళ్లయింది… ఇక నరకం మొదలైంది… అత్తింట్లో అందరూ వేధించేవాళ్లే… అడుగు తీసి అడుగేస్తే ఆంక్షలు, తిట్లు, నిందలు… మొగుడు తనకన్నా పదకొండేళ్లు పెద్ద…

పెళ్లిచూపుల్లోనే ఆ రఫ్ కేరక్టర్ చూసి భయపడింది… కానీ మంచి సంబంధం, పెద్దింటి సంబంధం అంటూ ఆమె నోరు మూశారు తల్లిదండ్రులు… ఇక అత్తింటికి వెళ్లాక ఆమెకు నరకం అంటే ఏమిటో తెలిసింది…

వాళ్లకి కావాల్సింది కోడలు కాదు, ఓ పనమ్మాయి. అందరూ తిన్న తర్వాతే తినాలి… ఒకవేళ ఏమీ మిగలకపోతే మళ్లీ వండకూడదు… నలుగురిలోకి రాకూడదు… తలమీద చెంగు తీయకూడదు… నవ్వకూడదు… టీవీ చూడకూడదు… ఎదురు తిరిగితే రక్తం కారేలా కొట్టేవాడు భర్త… నవ్వడం ఎప్పుడో మరిచిపోయిందామె…

అందుకే ఆత్మహత్య చేసుకుందామనుకుంది… ఆ సమయానికి గర్భిణి అని తెలిసింది… కడుపుతో ఉందని తెలిసి కూడా సరిగ్గా తిండిపెట్టేవారు కాదు… రొట్టెలు దొంగిలించి, ఎవరూ చూడకుండా, చీరె కొంగులో దాచుకుని, బాత్‌రూంలోకి వెళ్లి గబగబా నోట్లో కుక్కుకునేది…

ఈ స్థితి పుట్టింట్లో చెబితే పిల్లలు పుడితే అన్నీ సర్దుకుంటాయన్నారు… చూస్తుండగానే ఇద్దరు పిల్లలు… ఓసారి ఇక విసిగిపోయి, ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకోవడానికి రెడీ అయ్యింది… మెడకు చెట్టుకుంటూ కిటికీ వైపు చూసింది…

అక్కడ ఆమె అత్తగారు కోడలు చేసేదంతా కన్నార్పకుండా చూస్తుందే తప్ప ఆపలేదు… ఏమిటీ పని, ఎందుకిలా చేస్తున్నావ్‌ అని కూడా అడిగే ప్రయత్నం చేయలేదు… ఈమెలో ఎక్కడో లైట్ వెలిగింది…

‘ఛిఛీ, ఇలాంటి వాళ్లకు భయపడా నేను చావాలనుకుంటుంది… అయినా నేను పోయాక నా పిల్లల పరిస్థితి ఏంటి ?’ అని ఆలోచించింది… మనసులో నుంచి ఉరి ఆలోచన తుడిచేసింది…

 

pradhan

ఏం, నేను బతకలేనా..? ఈ ఇంటి నుంచి బయటికి వెళ్తా… పుట్టింటికీ పోయేది లేదు… నా పిల్లలను నేను పెంచుకుంటా అని మనసులో ఓ సంకల్పం చెప్పుకుంది… తల ఎత్తుకుంది… పిల్లల్ని తీసుకుని బయటికి వచ్చింది… ఆమె పోతే మరో పిల్ల, అత్తిల్లు సైలెంటుగా ఉంది…

2 వేల రూపాయలు చేతిలో ఉన్నయ్… లక్కీగా ఓ బ్యూటీ పార్లర్‌లో చిన్న కొలువు దొరికింది… పర్లేదు, కడుపుకు ఢోకా లేదు… పిల్లలకు ట్యూషన్లు మొదలు పెట్టింది… వంట పనులు చేసేది… దొరికిన ప్రతి పనినీ చేసింది…

ప్రైవేటుగా బీఏ పరీక్షలు రాసింది… ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేసింది… ఆమె అందులో యూనివర్సిటీ ఫస్ట్‌… కొన్ని రోజులకి అమ్మ సాయం వచ్చింది… ఇంకాస్త మంచిది, మరో ఉద్యోగం వస్తే చాలనుకొని దినపత్రికలు తిరగేసేది రోజూ…

ఓరోజు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ కనిపించింది… ఆ జీతం వివరాలు ఆమెను ఆకర్షించాయి… ఇది సాధిస్తే జీవితమంతా మంచిగా బతకొచ్చు కదానేదే ఆమె ప్రాథమిక లక్ష్యం… ఫస్ట్ అటెంప్టులోనే సక్సెస్… 24 ఏళ్లకే చీఫ్ మునిసిపల్ ఆఫీసర్ పోస్టింగ్… ఇంకేం కావాలి..?

కానీ పాత మొగుడు అప్పుడప్పుడూ వచ్చేవాడు… మళ్లీ వేధింపులు… అప్పుడప్పుడూ కొట్టేవాడు… చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసి వదిలించుకుంది, విడాకులు కూడా తీసుకుంది… మరో మనిషి దొరికాడు… పేరు హర్ష… తనను రెండో పెళ్లి చేసుకుంది…

ఆ హోదాలోనూ పలు మాఫియాలతో పోరాడింది… ధైర్యంగా నిలబడింది… ఇప్పుడు ఆమె గ్వాలియర్, చంబల్‌కు అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌… ఒకవైపు కొలువు చేసుకుంటూనే ఓ యూట్యూబ్ చానెల్ పెట్టింది… పేరు హిమ్మత్‌వాలీ లడ్కియా… బ్రేవ్ గరల్స్…

తన వంటి పిల్లలకు ధైర్యం చెప్పడానికే ఆ చానెల్… తన జీవితాన్నే పాఠాలుగా చెబుతుంది… గ్రేట్… ఒక్కరు తనలా ఎదిగినా సరే, ధైర్యంగా తలెత్తుకుని నిలబడినా ఆమెకు అంతకన్నా కావల్సిందేముంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియా భాయ్… హేట్సాఫ్ సిరాజ్… నువ్వూ ట్రూ హైదరాబాదీ…
  • కర్త, కర్మ, క్రియ కేసీయారే..! ఖ్యాతి మసకబారి, తొలి అధికారిక మరక..!!
  • వంగా సందీప్‌రెడ్డి మార్క్ రోల్… నో, నెవ్వర్, సాయిపల్లవికి అస్సలు నప్పదు…
  • నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా… ఘంటసాలకూ ఆరాధ్యుడు ఈ సుబ్బరామన్…
  • ఆదాయమే పరమార్థమై… ఆ ‘దేవాదాయ ధర్మాదాయ’ నామకరణాలు…
  • ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది… వందేమాతరం..,
  • జేజమ్మ..! బిరబిరా సాగే నదీప్రవాహం… ప్రేమలో అందరినీ తడిపేస్తూ…!!
  • కడుపు చించుకోవద్దు… రేవంత్‌రెడ్డి మాటల్లో తప్పేముంది..?!
  • ఊరికే రావు జాతీయ అవార్డులు… ఎక్కడైనా సరే లెక్కలుంటాయండీ…
  • 5600 కోట్ల విలాసం అది… అడుగే పెట్టలేదు, అమ్మేస్తున్నాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions