నోరి దత్తాత్రేయుడు… తెలుగు జాతి గర్వించదగిన డాక్టర్… ప్రత్యేకించి కేన్సర్ రోగులెందరికో దేవుడు… ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆయన గురించి మళ్లీ పరిచయం చేయడం ఓ సాహసమే… లెజెండరీ స్టేటస్‌కన్నా చాలా ఎక్కువ… ఈమధ్య హైదరాబాద్ వచ్చాడు… విస్మయకరం అనిపించింది ఏమిటంటే… ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ముప్పావుగంట ఇంటర్వ్యూ ఇవ్వడం… చాలా అంశాల్ని ఏ శషభిషలూ లేకుండా పంచుకోవడం..! మేం తోపులం, మేం దైవాంశ సంభూతులం అని ఫీలయ్యే పిచ్చి సెలబ్రిటీలందరూ ఆయన్ని చూసి నేర్చుకోవాలి… ఇంటర్వ్యూ చేసింది Vyus.in
డజను మంది పిల్లల్లో చిన్నవాడు… ఆరేళ్లప్పుడే తండ్రి చనిపోతే, తల్లి అందరినీ పెంచి పెద్దచేసింది… అందరూ మంచి పదవులు చేపట్టి, అనూహ్యంగా ఎదిగినవాళ్లే… తక్కువ రీసోర్సెస్‌తో, ఒక పేద నేపథ్యంతో, పెద్ద దిక్కులేని స్థితిలోనూ అంతమంది చదువులు, ఎదుగుదల అంటే, నిజంగా ఆ తల్లిది ఓ కోణంలో భాగ్యమే… కష్టాలు పడుతూ, త్యాగాలు చేస్తూ, ఉన్న కాసింత బంగారం కూడా అమ్మేస్తూ, ఫీజులు కడుతూ… ప్రతి ఒక్కరినీ సమదృష్టితో పెంచిన ఆయన తల్లిదే ఓ పుస్తకం రాయొచ్చేమో బహుశా…
Ads
అన్నీ చెప్పుకోలేం ఇక్కడ… కానీ ఒకటీరెండు ఇంట్రస్టింగ్ అంశాలున్నయ్… ‘‘ఇజ్రాయిల్ నుంచి ఓ పేషెంట్… లండన్ వెళ్తే ఆరు నెలల ఆయుష్షు అన్నారు… అమెరికాలో పెద్ద పెద్ద హాస్పిటల్స్‌ను కన్సల్ట్ చేసింది… చాలామంది నా దగ్గరకు వెళ్లమన్నారు… ఆయన ప్రయోగాలు చేస్తూ, కొత్తవి కనుక్కుంటూ ఉంటాడు, అన్ని కేసులకూ ఒకే చికిత్స ఉండదు, రోగిని బట్టి, తత్వాన్ని బట్టి, తీవ్రతను బట్టి చికిత్స అవసరం అని గుర్తుచేశారు… నా దగ్గరకు వచ్చింది…
అప్పట్లో నేను కొత్తగా కనిపెట్టిన ఓ మెథడ్‌లో చికిత్స చేశాను, ఫలించింది, ప్రతి ఏటా చెకప్‌కు వస్తుంది… ధనికురాలే, నా పేరిట ఓ ఫెలోషిప్ కూడా పెట్టింది… నేను ఆమెకు చికిత్స చేసింది 1986లో… ఈరోజుకూ ఆమె బతికే ఉంది… 6 నెలల ఆయుష్షు అని అందరూ ఆశలు వదిలేసిన రోగి 35 ఏళ్లుగా నిక్షేపంలా ఉంది… మొన్నామధ్య అరవయ్యేళ్ల వివాహబంధాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంది… నాకు మెయిల్ పెట్టింది… ఈ అరవై ఏళ్ల వైవాహిక జీవితంలో 35 ఏళ్లు మీరు ప్రసాదించిందే అని రాసింది… (డెస్టినీ..? మిరకిల్..?) ఇలా బోలెడు, చిక్కు కేసుల్ని టేకప్ చేస్తాను, చాలెంజ్‌లా తీసుకుంటాను…’’
శ్రీదేవితో అనుబంధం :: శ్రీదేవి తల్లికి కేన్సర్, చికిత్సకు వచ్చింది, నాకు ఆమె అంతకుముందే తెలుసు… చికిత్స టైమ్‌కు నేను బయట దేశాల్లో ఉన్నాను… ఆమె పేరుతో మరో పేషెంట్ ఉంది అప్పటికే… దాంతో కన్‌ఫ్యూజయిన ఓ డాక్టర్ రాంగ్ సైడ్ ఓపెన్ చేశాడు, కేన్సర్ లేదని గమనించి మళ్లీ క్లోజ్ చేశాడు… మరుసటిరోజు పత్రికల్లో వార్తలు… నేను వచ్చాక సరిదిద్దాను, ఆమెకు నయమైంది… ఆ 3 నెలలూ శ్రీదేవి రోజూ వచ్చి కూర్చునేది…
ఓ బ్రదర్‌లా భావించి, అన్ని విషయాలూ నాతో షేర్ చేసుకునేది… ఫ్యామిలీ, కెరీర్, పెళ్లి గురించి కూడా… ఆమె నిజానికి ఇన్నోసెంట్, అదే సమయంలో బ్రిలియెంట్… ఎప్పుడైనా అమెరికాకు వస్తే మా ఇంట్లోనే ఉండేది… ఎప్పుడు కలిసినా పరుగెత్తుకొచ్చి హగ్ చేసుకునేది, అందరూ ఆశ్చర్యపోయేవారు, అంత సూపర్ స్టార్ అలా ప్రేమగా వచ్చి హగ్ చేసుకుంటున్నది ఎవరినబ్బా అని చూసేవాళ్లు… ముంబై వస్తే అన్నీ ఆమే చూసుకునేది, స్వయంగా వండి, వెజ్ ఫుడ్ వడ్డించేది… ఆమెను కోల్పోవడం నాకు నష్టమే…’’
కేన్సర్‌కు ఇప్పుడు ఇమ్యూనోథెరపీ బాగా పనిచేస్తోంది… జిమ్మీ కార్టర్ తెలుసు కదా, మాజీ అధ్యక్షుడు… కేన్సర్ వచ్చి, అది బ్రెయిన్, లివర్, లంగ్స్, బోన్స్‌కు వ్యాపించింది… ఆ స్టేజీలో ఐదారునెలలు బతికితే గొప్ప, కానీ పదకొండేళ్లయింది… ఒక్క కేన్సర్ కణం లేదిప్పటికీ… ఇమ్యూనోథెరపీ సాధించిన మిరకిల్… అందరికీ ఇదే పనిచేయకపోవచ్చుగాక, రోగి శరీరతత్వాన్ని బట్టి పనిచేస్తుంది…’’ ఇలా సాగిపోయింది ఇంటర్వ్యూ… గుడ్… కొన్ని కోడిమెదళ్లకు ఓసారి గుర్తుచేద్దాం… తెలుగు జాతిపతాకలు అంటే, ఇదుగో ఇలాంటి వాళ్లు…!!
నచ్చిన మరో అంశం… ఆయనకు ఇద్దరు పిల్లలు… కొడుకు పీపుల్స్ లాయర్, బిడ్డ పెద్ద డాక్టర్… న్యూయార్క్ స్టేట్ కోవిడ్ ఇన్‌ఛార్జి… 14 ఏళ్లు భరతనాట్యం సాధన చేసింది… మన కల్చర్, రూట్స్ మీద ప్రేమ ఉన్నవాళ్లు… ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారు… ఆధ్యాత్మికత మీద అనురక్తి… ఈయన మూడు గుళ్లకు స్థాపకుడు… ఒకటి న్యూజెర్సీలో, రెండు న్యూయార్క్‌లో… భార్య కూడా డాక్టరే… న్యూయార్క్ హాస్పిటల్‌కు రీజనల్ డైరెక్టర్… ఇంకేం కావాలి..? సార్థకజీవుడు..!!
Share this Article