Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈసారికి సారీ నాన్నా.., వచ్చేసారి నీ ఫోటో దగ్గర బంగారు పతకం పెడతాను చూడు..!!

August 6, 2021 by M S R

‘‘నాన్నే నాకు స్పూర్తి… తను ఎంత కష్టజీవో నాకు బాగా తెలుసు… ఓ చిన్న రైతు… తన భూమే తన సర్వస్వం…. ఎప్పుడు చూసినా పొలంలో ఏదో పనిచేస్తుండేవాడు… నాకు మంచి చదువు చెప్పించాలనేది నాన్న కోరిక… ‘ఒరే నాన్నా, మన భూమి, మన శ్రమే మన గుర్తింపు… డబ్బు అంత త్వరగా ఏమీ రాదు, మనలాంటోళ్లకు కాయకష్టం, పంటపొలం లేకపోతే డబ్బేది..?’ ఇలాంటి ముచ్చట్లే చెప్పేవాడు… ఊళ్లోకి ఏ కొత్త కారు వచ్చినా ఆసక్తిగా చూస్తుండేవాడు… ‘చూడ్రా, ఎంత అందంగా, సౌకర్యంగా ఉన్నాయో కార్లు..? నేను సాధించలేకపోయాను, నువ్వయినా అనుభవించాలిరా’ అనేవాడు నాతో… నిజమేనా, ఓ కారు కొని, అందులో నాన్నను కూర్చోబెట్టి, ఆయన కలను తీర్చగలనా నేను..? ఆ కళ్లల్లో ఆనందాన్ని చూడగలనా..? ఈ డబ్బు, ఈ కార్లు ఎలా సాధ్యం..? మంచి చదువా, మంచి కొలువా, పంట పొలమా, ఏది..? నాకేమీ తోచేది కాదు… క్రికెట్ ఆడుతుండేవాడిని… దాన్ని కెరీర్‌గా చేసుకుందామా..? తేల్చుకోలేని వయస్సు… మా అంకుల్ ఒకాయన షాట్‌పుట్ ప్లేయర్… అలవోకగా షాట్స్ విసిరేవాడు… ఆశ్చర్యమేసేది… మా ఊళ్లోని యువకులను పిలిచి చాలెంజ్ చేసేవాడు, నేను విసిరినంత దూరం మీరెవరైనా విసురుతారా..? ప్చ్, ఎవరికీ చేతనయ్యేది కాదు…

tejinderpal

అరె, చెప్పనే లేదు కదూ… పంజాబ్‌లోని మొగా జిల్లా, ఖోసాపండొ ఊరు… నా పేరు తజిందర్‌పాల్ తూర్… అంకుల్ గురించి చెప్పాను కదా… తనను బీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాను… అప్పటికది సరదా… ఖాళీగా ఉన్న పొలంలో షాట్ విసిరేవాడిని… ఏరోజుకారోజు అంకుల్‌ను రీచ్ అవుతున్నానా లేదా చూసుకునేవాడిని… ఓసారి తనను దాటేశాను… ఆశ్చర్యపడిన ఆయన ‘‘ఈ ఆటకు ఇంకా గుర్తింపు కావాలిరా, అది నువ్వు తీసుకురాగలవు’’ అని కౌగిలించుకున్నాడు ఆనందంగా… అదీ ఈ ఆటలో నాకు దక్కిన మొదటి రివార్డు… తనే మెళకువలు నేర్పించేవాడు… బడి వెళ్లడానికి ముందు, బడి విడిచిపెట్టాక… రోజూ రెండుసార్లు శిక్షణ… నాన్న ఒక్కరోజు కూడా నిరుత్సాహపరచలేదు… పొలం పనిలో దిగు అని చెప్పేవాడు కాదు… నా ఆట పదునెక్కుతోంది, పోటీలకు వెళ్లేవాడిని… గెలుపు రుచి చూస్తున్నాను… నాన్నకు కారు కొంటాననే నమ్మకం కుదురుతోంది… నా కెరీర్ ఏమిటో నాకు క్లారిటీ కూడా వచ్చేసింది… కానీ ఈలోపు ఓ పిడుగు… నాన్నకు బోన్ కేన్సర్… అదీ నాలుగో స్టేజ్… నా గుండె పగిలింది… ఊళ్లో ఉన్న మా పూర్వీకుల భూమిని అమ్మాల్సి వచ్చింది, లేకపోతే హాస్పిటల్ ఖర్చులకు డబ్బేది..? చిన్నప్పటి నుంచీ ఆ భూమినే తన ప్రాణంగా ప్రేమించిన నాన్న ఆ భూమిని అమ్మాల్సిన మా దుస్థితికి సాక్షాత్తూ రోదించాడు… ‘మీ పూర్వీకుల ఇజ్జత్ తీశారు కదా మీరు’ అనే ఊరివాళ్ల దెప్పులు మరింత బాధించేవి… నాన్నకు ఢిల్లీకి తీసుకెళ్లాలి చికిత్స కోసం… ‘ఆ షాట్ పుట్ కూడు పెట్టదు కానీ ఏదైనా పనిచూసుకో’ అనే బంధుగణం, ఊరివాళ్ల ఒత్తిడి పెరుగుతోంది… అంకుల్‌కు చెప్పాను… ‘‘నేను షాట్ పుట్ వదిలేస్తాను’’

Ads

tajinderpal

‘వద్దురా, నువ్వెక్కడుంటే అక్కడికి నేనూ వస్తాను, ప్రాక్టీస్ ఆపొద్దు’ అన్నాడు అంకుల్… నాన్నకు చికిత్స జరుగుతూనే ఉంది… స్పోర్ట్స్ కోటాలో చదువు… ఆసియన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్‌లో వెండి పతకం కొట్టాను… అప్పుడు నా పేరు అందరికీ తెలిసింది… నాన్న కళ్లలో మెరుపు… ఈసారి బంగారం తప్పక కొడతావురా నా బంగారం అన్నాడు… కారు కొనాలనే కోరిక మాత్రం తీరలేదు… 2018… కామన్‌వెల్త్ గేమ్స్ వచ్చినయ్… నాన్న ఆరోగ్యం మరింత క్షీణించింది… నా పట్టు కూడా సడలింది… ఫైనల్స్‌లో ఏ స్థానంలో నిలిచానో కూడా గుర్తులేదు… నాన్న నా ఓటమిని చూడలేడు… అందుకే ఆసియన్ గేమ్స్ నాటికి కూడదీసుకున్నాను… జాతీయ రికార్డు, గోల్డ్… తిరిగి వచ్చి నాన్నను అలుముకుని పతకం చూపించాలని అనుకున్నాను… కానీ నాన్న నన్ను వదిలి వెళ్లిపోయాడు… అమ్మ చెబుతోంది… ‘‘నువ్వు పతకం గెలవడం హాస్పిటల్ టీవీలో చూశాడురా నాన్న’’… అప్పటిదాకా ఆపుకున్నా గానీ, అప్పుడు కళ్లల్లో నుంచి వరదలా దూకాయి కన్నీళ్లు… ఊళ్లో ఎవరికో అమ్మిన మా పూర్వీకుల భూమితోపాటు మరికొంత భూమినీ కొన్నాను… నాన్న కల కదా, కారు కొన్నాను… ఫ్యామిలీ మొత్తం లాంగ్ టూర్ వెళ్లాం… నాన్న కూర్చోవాల్సిన ముందు సీటు ఖాళీగానే ఉంచేసి… అది నాన్న సీటు కదా… తను లేకపోయినా సరే… నేను ఒలింపిక్స్‌లో ఆడాలనేది కూడా నాన్న కల… దానికీ అర్హత సాధించాను… ప్చ్, ఫైనల్స్‌లోకి పోలేకపోయాను… నో ప్రాబ్లం, ఇంకా వయస్సుంది, అప్పుడే కథ ముగియలేదు, మళ్లీ ఒలింపిక్స్ రావా ఏం..? నాన్న చూస్తూనే ఉన్నాడు పైనుంచి… నాన్నా, ఈసారి క్షమించు, వచ్చేసారి గోల్డ్ తప్పనివ్వను… నీ ఫోటో దగ్గర పతకాన్ని పెడతాను చూడు…’’
May be an image of 2 people and people standing

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions