.
ఏస్… Ace… విజయ్ సేతుపతి హీరో కాబట్టి, నటుడిగా తనకు తెలుగులోనూ కాస్త మంచి పేరే ఉంది కాబట్టి… ఈ సినిమా మీద కాస్త ఆసక్తి తెలుగు ప్రేక్షకులకు కూడా..,!
అంతకుమించిన విశేషం, మరీ చప్పట్లు కొట్టి అభినందించాల్సిన సీన్ ఏమీ లేదు… జస్ట్, ఏదో అలా అలా పైపైన కాస్త కామెడీ, కాస్త క్రైమ్, కాస్త లవ్వు జానర్లను కలిపి కొట్టాడు దర్శకుడు… ఏదో సరదా సినిమా… సీరియస్ స్టోరీ లైన్ లేదు, ఎంచుకున్న కథకు కూడా అనిల్ రావిపూడి తరహాలో కామెడీ పూతలు పూసి వదిలారు…
Ads
ఎస్, విజయ్ సేతుపతి ఏ పాత్ర చేసినా పర్‌ఫెక్ట్‌గా దానికి న్యాయం చేస్తాడు కదా… ఇందులోనూ అంతే… యోగిబాబు పదే పదే విసిగిస్తున్నాడని మనం మొన్న కూడా చెప్పుకున్నాం కదా… మొనాటనీ వచ్చేసింది… అక్కడక్కడా సేతుపతితో కూడిన కొన్ని సీన్లలో కామెడీ బాగానే అనిపించినా ఓవరాల్‌గా సినిమా పెద్దగా రక్తికట్టలేదు… పైగా అక్కడక్కడా బోర్…
పైగా తమిళ డబ్బింగ్ పాటల గురించి తెలిసిందే కదా… ట్యూన్లలో తోచిన తెలుగు పదాలను ఇరికించి మీ ఖర్మ అని తెలుగు శ్రోతలను, ప్రేక్షకులను వెక్కిరిస్తారు… ఇదీ అంతే… సేతుపతి లుక్కు చూస్తే ఈ సినిమా అప్పుడెప్పుడో ప్రారంభమై, ఆగిపోయి, మళ్లీ పట్టాలకు ఎక్కిందేమో అన్నట్టుగా ఉంటుంది…
మలేషియా బ్యాక్ డ్రాప్‌లో షూటింగు… ఏదో కొలువు కోసం వెళ్లిన హీరో, ఓ చిన్న కొలువు, అక్కడ ఒకావిడతో లవ్వు, ఆమె కోసం డబ్బు సేకరించే ప్రయత్నాల్లో ఇరుక్కుని, చివరకు డబ్బు దోపిడీ దాకా వెళ్తుంది జర్నీ… సినిమాలో సేతుపతి యాక్షన్, యోగిబాబు కామెడీ వదిలేస్తే… చెప్పాల్సింది రుక్మిణి వసంత్ గురించి…
ఆమె పాత్రకు లోతైన కేరక్టరైజేషన్ ఏమీ లేదు, సో సో పాత్ర… తమిళంలోకి దీంతోనే ఎంట్రీ… కానీ తను కనిపించినంతసేపు ప్లజెంటుగా ఉంది… సన్నగా, అందమైన సలాకలాగా లుక్కు… ఒరిజినల్ కన్నడిగ, లండన్‌లో నటనలో శిక్షణ, చిన్నప్పటి నుంచీ నాటకాలపై ఆసక్తి…
సప్తసాగరాలు దాటి సినిమాతో గుర్తింపు వచ్చింది కానీ తరువాత సినిమాలు వరుసగా ఫ్లాప్.., అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగువాళ్లనూ పలకరించింది గానీ అదేమో తన్నేసింది… కాకపోతే నవీన్ పోలిశెట్టితో ఓ సరదా ప్రేమకథను ఫన్ ఓరియెంటెడ్‌గా మణిరత్నం ఓ సినిమా చేస్తున్నాడనీ, అందులో రుక్మిణి వసంత్ నటించబోతోందనే వార్త ఇంట్రస్టింగు… అలాగే జూనియర్ (డ్రాగన్) సినిమాలో చాన్స్ వచ్చిందని మరో వార్త… గుడ్…
ఈ సినిమా విజయ్ సేతుపతికి ఉన్న కాస్త ఇమేజీ దృష్ట్యా తమిళంలో ఏమైనా ఆడొచ్చునేమో… కానీ తెలుగులో కష్టం… సినిమా విడుదలకు ముందు కూడా పెద్దగా బజ్ లేదు… ఇదొక సినిమా వస్తుందనే విషయమే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు… ఐనా కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకే జనం రావడం లేదు థియేటర్ల దాకా…!!
Share this Article