మొత్తానికి యూట్యూబ్ అష్టావక్రుడు ప్రణీత్ హన్మంతు వెకిలి కామెడీ కంటెంట్ చాలామందిలో చలనం తెప్పిస్తోంది… గుడ్, మంచిదే… తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు వీడియో ఒకటి కనిపించింది… అందులో తను చాలా సీరియస్ హెచ్చరిక జారీ చేశాడు ఆ అసోసియేషన్ తరఫున…
మామూలుగా తను ఏం మాట్లాడతాడో తనకే తెలియదు కొన్నిసార్లు, తన మాటల్ని కూడా సోషల్ మీడియా వెటకారం చేస్తుంటుంది… కానీ ఈ వీడియో మాత్రం హుందాగా, మా వంటి ఆర్టిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో పద్ధతిగా ఉంది… తను చేయాల్సిన పనే ఇది కూడా…
ఆ వీడియోలో ఏమంటున్నాడంటే…? ‘‘తెలుగు వాళ్లు అంటే మర్యాదస్తులు, పద్దతులు ఫాలో అవుతారు అని ప్రపంచం మొత్తం అనుకుంటుంది, అదీ మనకున్న పేరు, కానీ రీసెంట్ యూట్యూబర్ వివాదం, ఆ వీడియోపై సాయిధరమ్ తేజ్ స్పందించాడు, ఆ వీడియో చూస్తే మరీ జుగుప్సాకరంగా ఉంది. వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్…
Ads
తను మంచి కుటుంబం నుంచే వచ్చాడు . మరెందుకిలా చేశాడో అర్థం కాదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు బోలెడు లేఖలు వస్తున్నాయి… అసోసియేషన్ యాక్షన్ తీసుకోవాలి అని… యూట్యూబర్లు, సోషల్ మీడియా హ్యాండ్లర్లు హీరోలపై, హీరోయిన్లపై అసభ్యకరమైన కంటెంట్ చేస్తున్నారు…
కొన్ని వీడియోలు చూస్తుంటే… వీళ్లకు తల్లులు, చెల్లెళ్లు, భార్యలు, బిడ్డలు లేరా అనిపిస్తుంది… నిజమే, ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించకపోతే మేం లేం, ప్రేక్షకలోకానికి మేం తలవంచుతాం, కానీ డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని నటీనటులపై ఏమిటీ వీడియోలు..?
నిన్న లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం ఫోన్ చేశాడు… నా ఫోటోను బోలెడు మీమ్స్‌లో వాడుకుంటున్నారు, నాకూ సంతోషమే, ఎంజాయ్ చేస్తాను, కానీ జుగుప్సాకరమైన వీడియోల్లో కూడా నా ఫోటో వాడుతున్నారు అని బాధపడ్డారు… ఇక మా అసోసియేషన్ రంగంలోకి దిగుతుంది… సోషల్ మీడియాకు నా విజ్ఙప్తి ఏమిటంటే…
48 గంటల్లో అసభ్యకరమైన వీడియోలు, కామెంట్స్ తీసేయండి… తీయకపోతే మేం వీడియోలు మళ్లీ చూస్తాం, యూట్యూబ్ తో డిస్కస్ చేస్తాం… సైబర్ సెక్యూరిటీ వాళ్లకు కంప్లయింట్లు చేస్తాం, సదరు అసభ్యకరమైన ఖాతాలను బ్యాన్ చేయిస్తాం… లీగల్ యాక్షన్ తప్పదు… తెలంగాణ, ఏపీ సీఎంలు, డిప్యూటీ సీఎంలకు మా తరఫున ఒక కోరిక, మమ్మల్ని ఈ విషయంలో సపోర్ట్ చేయండి…
విష్ణు భాయ్, ఇక్కడ చిన్న సూచన… ఎస్, మా అసోసియేషన్ స్పందించాల్సిందే… కానీ ఎవరూ స్వచ్చందంగా రిమూవ్ చేయరు, అందుకని తలతిక్క, వెగటు థంబ్ నెయిల్స్‌తో అశ్లీలంగా క్రియేట్ చేయబడిన కొన్ని వీడియోలను గుర్తించండి, యాక్షన్ స్టార్ట్ చేయండి, పర్లేదు, సొసైటీ హర్షిస్తుంది… అలాగని నిజంగానే ఆరోగ్యకరమైన హ్యూమర్ పండించే వాళ్ల జోలికి వెళ్లకండి… అన్నీ కర్బ్ చేయడానికి ప్రయత్నించకండి..! ఈ కోణంలో కొన్ని జాగ్రత్తలు అవసరం..!!
Share this Article